Jump to content

టి. రంగాచారి

వికీపీడియా నుండి
టి. రంగాచారి
జననం1865
మరణం1945
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
న్యాయవాది, రాజకీయవేత్త, పాత్రికేయుడు, శాసనసభ్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు

దివాన్ బహదూర్ టి. రంగాచారి సిఐఈ (1865-1945) తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యాయవాది, రాజకీయవేత్త, పాత్రికేయుడు, శాసనసభ్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.

తొలి జీవితం

[మార్చు]

రంగాచారి 1865లో మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన భూస్వామి అయ్యంగార్ కుటుంబంలో జన్మించాడు.[1] మద్రాసులో చదివిన రంగాచారి, న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నాడు.[1] కొంతకాలం న్యాయవాదిగా పనిచేశాడు. ఆ తరువాత భారత స్వాతంత్ర్య ఉద్యమంలోకి వచ్చాడు. రంగాచారి నాయకత్వంలో రంగాన్, పాశ్చాత్యులు, హాస్యం, గ్యాంగ్‌స్టర్, క్రైమ్ కథలు వంటి విభిన్న అమెరికన్ మూవీ థీమ్‌ల ద్వారా 1927-28లో తీయబడిన సినిమాల సెన్సార్‌షిప్ కోసం రంగాచారి కమిటీ ఏర్పడింది. ఎక్కువగా పౌరాణిక కథలపై ఆధారపడ్డారు.[2]

రాజకీయాలు

[మార్చు]

భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన ప్రారంభంలోనే రంగాచారి ఆ పార్టీలో చేరి, సమావేశాలలో పాల్గొన్నాడు.[3] మద్రాసు మహాజన సభ సభ్యుడిగా కూడా రంగాచారి పనిచేశాడు. మద్రాసు శాసన మండలిలో సభ్యుడుగా పనిచేసాడు. కేంద్ర శాసనసభలో కూడా సభ్యుడిగా, శాసనసభ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసాడు.

మరణం

[మార్చు]

రంగాచారి తన 80 సంవత్సరాల వయసులో 1945లో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 The who's who in Madras: A pictorial who's who of distinguished personages, princes, zemindars and noblemen in the Madras Presidency, Issue 9. Pearl Press. 1940. p. 205.
  2. Vinayak Purohit (1988). Arts of transitional India twentieth century. Vol. 1. ISBN 9780861321384.
  3. Fern, Joeanna Rebello; Apr 20, es | TNN | Updated:; 2014; Ist, 04:07. "Madras was where idea of Congress was born - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-27. {{cite web}}: |last3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)

ఇతర మూలాలు

[మార్చు]
  • Some Madras Leaders. 1922. pp. 35–37.