Jump to content

థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)

వికీపీడియా నుండి
(టీఓయూ నుండి దారిమార్పు చెందింది)

థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు.) హైదరాబాదు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ ఏర్పాటు చేసిన ఒక నాటక విభాగం. సర్ రతన్ టాటా ట్రస్ట్ ఆర్థిక సహకారంలో 2012, జూలైలో ఏర్పాటుచేయబడింది. రంగస్థల శాఖకి ఉన్న అన్ని రకాల వనరులను ప్రజలందరికీ అందజేయడం, అలాగే నాటకరంగంలో విశేష కృషి చేస్తున్న కళా సంస్థల పనితీరునీ, అనేక మంది ఔత్సాహిక కళాకారుల అనుభవాన్ని శాఖ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు తెలుసుకోని వారికి సలహాలు, సహకారం, అందించడం ఈ విభాగం ముఖ్య ఉద్ధేశ్యం.

సర్ రతన్ టాటా ట్రస్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ టి. విష్ణువర్ధన్ సహకారంతో, హైదరాబాదు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖ అధ్యాపకులు అనంతకృష్ణన్, ఎన్.జె.బిక్షు, రాజీవ్ వెలిచేటిల అధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో అసిస్టెంట్ ప్రొఫెసెర్ గా పనిచేసిన డా. పెద్ది రామారావు ఈ ప్రాజెక్టు సమన్వయకర్తగా, రంగస్థల నటుడు, దర్శకుడు ఎస్.ఎం. బాషా ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా, హైదరాబాదు విశ్వవిద్యాలయం రంగస్ధల కళలశాఖలో పి.హెచ్డి చేస్తున్న షేక్ జాన్ బషీర్ ప్రాజెక్టు అసోసియేట్‌గా, హైదరాబాదు విశ్వవిద్యాలయం రంగస్ధల కళలశాఖలో ఎంఫిల్ చేస్తున్న ప్రణయ్‌రాజ్ వంగరి ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా పనిచేశారు.

మిస్ మీనా నాటక ప్రదర్శన
అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి

తెలుగు నాటకరంగాన్ని మరింత ప్రయోజనాత్మకమైన కళాప్రక్రియగా అభివృద్ధిచేయడంకోసం, విద్యార్థులకు చిన్న వయస్సులోనే నాటకకళ పట్ల అసక్తిని కలిగించగలిగితే వారిలోని సృజనాత్మకత మరింతగా రాణించి మంచి పౌరులుగా తయారుకాగలరని, నాటకకళలో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులు చదువులో కూడా మంచి ఫలితాలు సాధించగలుగుతారని ఈ సంస్థ భావించి, అందుకోసం ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిషత్తు నాటక సమాజాల సహకారంతో విద్యార్థులకోసం రకరకాల శిక్షణా శిబిరాలు ఏర్పాటుచేసింది.[1]

కార్యకలాపాలు

[మార్చు]
  1. నాటకరంగం కోసం హైదరాబాదు అబిడ్స్ లోని "గోల్డెన్ త్రెషోల్డ్"ని ఒక సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేసింది.
  2. తెలుగు నాటకరంగంలో అవిరళ కృషి చేస్తున్న కొన్ని నాటక సంస్థలతో పరిషత్తులతో కలిసి పనిచేసింది. వారికోసం ప్రత్యేకమైన శిక్షణ శిబిరాలను ఏర్పాటుచేసింది.
  3. ఆర్టిస్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం ద్వారా యువతను నాటకరంగానికి, నాటక ప్రదర్శనలకు ఆకర్షించేలా చేసింది.
  4. నాటకరంగ విద్యార్థులను రిసోర్స్ పర్సన్స్ గా తయారుచేసి, వారి దర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కొన్నిస్కూళ్ళలోనూ, స్వచ్ఛంద సంస్థల్లోనూ నాటక ప్రదర్శనలు చేయించింది.[2]
  5. తెలుగు నాటకరంగానికీ, మిగిలిన ప్రాంతీయ నాటకరంగాలకీ మధ్య ఉన్న అగాధాన్ని పూరించడంకోసం గోల్డెన్ త్రెషోల్డ్ లో జాతీయ, అంతర్జాతీయ నాటక ప్రదర్శనలు, సదస్సులు ఏర్పాటుచేసింది.

నిర్వహించిన కార్యక్రమాలు

[మార్చు]
  1. 2012, జులై 28న విజయవాడలో సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో స్థానిక 'తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం'లో థియేటర్ ఔట్రీచ్ యూనిట్ మొదటి 'నాటక మిత్రుల సదస్సు' జరిగింది. తెలుగు నాటకరంగ అభివృద్ధికి థియేటర్ ఔట్రీచ్ యూనిట్ చేసే కార్యకలాపాల గురించి చర్చించి, తెలుగు నాటకరంగం కళాకారుల నుండి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సదస్సుకు సుమధుర కళానికేతన్ అధ్యక్షుడు నరసరాజు, యూనివర్సిటీ రంగస్థలకళల శాఖాధిపతి డా. ఎన్.జె. బిక్షు, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ డా. పెద్ది రామారావు, అడవి శంకరరావు (మేకప్ ఆర్టిస్ట్), కె.కె.ఎల్. స్వామి (శ్రీకాకుళం), ఎం.ఎస్. చౌదరి (న్యూస్టార్స్ మోడ్రన్ థియేటర్,విజయవాడ), పి.వి. రమణమూర్తి (నవరస థియేటర్ ఆర్ట్స్), ఎమ్ డి.ఎస్. పాషా (నరసరావుపేట రంగస్థలి), హేమ (భాగ్యశ్రీ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్, వైజాగ్) తదితరులు తమ అభిప్రాయాలను తెలియజేశారు.
  2. 2012, ఆగస్టు 5న సాయంత్రం 6.35 ని.లకు గోల్డెన్ త్రెషోల్డ్లో జరిగిన నాటక కళాకారుల సమ్మేళనంతో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారుడు కె.వి. రమణాచారి, సెంట్రల్ యూనివర్శిటీ ఎస్.ఎన్. స్కూల్ పీఠాధిపతి ఆచార్య అనంతకృష్ణన్, శాఖాధిపతి శ్రీ బిక్షు, నాటకరంగ అధ్యాపకుడు, దర్శకుడు చాట్ల శ్రీరాములు, అడబాల, దుగ్గిరాల సోమేశ్వరరావు, డి.ఎస్.ఎన్. మూర్తి, భాస్కర్ శివాల్కర్ మరికొంతమంది నాటకమిత్రులు, విద్యార్థులు హాజరయ్యారు.

ఆర్టిస్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం

[మార్చు]

తెలుగు నాటకరంగంలో పాల్గొనే యువత చాలా తక్కువగా ఉన్నందువలన యువతను ప్రోత్సహించి నాటకరంగానికి చేయూత ఇవ్వాలన్న లక్ష్యంతో థియేటర్ ఔట్రీచ్ యూనిట్ 2012, సెప్టెంబరులో ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సీ ప్రోగ్రాం ని ఏర్పాటుచేసింది. అందులో భాగంగా రాష్ట్రంలోని ఔత్సాహిక నాటక బృందాలలో పనిచేస్తున్న కొంతమంది యువతీయువకులను ఎంపికచేసి వారితో ఒక కళా బృందాన్ని ఏర్పాటుచేసి, వారందరికి గౌరవప్రథమైన స్థాయిలో ఉపకార వేతనం అందిస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ప్రత్యేక శిక్షణ ఇప్పించి మిస్ మీనా[3],[4] అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి[5] అనే నాటకాలను తయారుచేసి, రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చింది.[6]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "థియేటర్ ఔట్రీచ్ యూనిట్ అధికారిక వెబ్ సైట్". Archived from the original on 2013-04-20. Retrieved 2013-03-08. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. సాక్షి, ఫీచర్స్ (13 November 2014). "బాల ప్రేక్షకుల కోసం నాటకోత్సవం." Sakshi. Archived from the original on 9 September 2020. Retrieved 9 September 2020.
  3. ఈనాడు, ఈతరం (18 May 2013). "కుర్రకారు...నాటకాల జోరు!". Archived from the original on 27 December 2016. Retrieved 6 August 2016. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. సూర్య, నరసరావుపేట టౌన్‌, మేజర్‌న్యూస్‌ (5 February 2013). "ఆద్యంతం రక్తి కట్టించిన 'మిస్‌మీనా' నాటక ప్రదర్శన". Retrieved 6 August 2016.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]
  5. The Hindu, Friday Review (26 July 2013). "Brave ACT". The Hindu (in Indian English). Archived from the original on 11 December 2013. Retrieved 9 September 2020.
  6. The Hindu, Friday Review (26 July 2013). "New dawn for theatre". The Hindu (in Indian English). Neeraja Murthy. Archived from the original on 4 November 2013. Retrieved 10 September 2020.

ఇతర లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.