Jump to content

డయానా హేడెన్

వికీపీడియా నుండి
డయానా హేడెన్
అందాల పోటీల విజేత
డయానా హేడెన్
జననము (1973-05-01) 1973 మే 1 (వయసు 51)
హైదరాబాదు, భారతదేశం
విద్యసెయింట్ ఆన్స్ హైస్కూలు, సికిందరాబాదు[1]
పూర్వవిద్యార్థిరాయల్ అకాడమీ ఆఫ్ డ్రమెటిక్ ఆర్ట్,
లండన్, ఇంగ్లాండ్
వృత్తిరూపదర్శి, నటి
ఎత్తు1.79 మీ. (5 అ. 10+12 అం.)
బిరుదు (లు)ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 1997
మిస్ వరల్డ్ 1997
ప్రధానమైన
పోటీ (లు)
ఫెమినా మిస్ ఇండియా 1997
  • (విజేత- మిస్ ఇండియా వరల్డ్

మిస్ వరల్డ్ 1997

  • (విజేత)
  • (మిస్ వరల్డ్ ఏషియా &ఓషియానా)
  • (మిస్ ఫోటోజెనిక్)
  • (స్పెక్టాక్యులర్ స్విమ్‌వేర్)
భర్త
కోలిన్ డిక్
(m. 2013)
పిల్లలు3

డయానా హేడెన్ (జ. 1 మే 1973) ఒక భారతీయ నటి, మోడల్. మిస్ వరల్డ్ 1997 విజేత. ఈమె భారతదేశం నుండి మిస్ వరల్డ్‌గా ఎన్నికైన మూడవ మహిళ. అంతే కాక ఈమె అందాలపోటీలలో 1997లో మూడు ఉపవిభాగాలలో టైటిల్స్ సాధించింది. ఈ ఘనత సాధించిన మిస్ వరల్డ్ ఈమె ఒకతే.

ఆరంభ జీవితం

[మార్చు]

డయానా ఒక ఆంగ్లో ఇండియన్ క్రైస్తవ కుటుంబంలో హైదరాబాదులో జన్మించింది.[2] ఈమె సెయింట్ ఆన్స్ హైస్కూలు, సికిందరాబాదులో చదువుకుంది.[3]

ఈమె మోడలింగ్‌ను వృత్తిగా స్వీకరించడానికి ముందు ఎన్‌కోర్ అనే కంపెనీ ఈవెంట్ మేనేజర్‌గా, బి.ఎం.జి.క్రెసెండో అనే సంస్థలో పౌరసంబంధాల అధికారిగా పనిచేసింది.[3]

అందాల పోటీలు

[మార్చు]

ఈమె తన 23వ యేట మిత్రుల ప్రోద్బలంతో "ఫెమినా మిస్ ఇండియా" పోటీలలో పాల్గొనింది.[4] ఈమె ఫెమినా మిస్ ఇండియా 1997 పోటీలలో షార్ట్‌లిస్ట్ చేయబడి రెండవ స్థానాన్ని దక్కించుకుంది. "మిస్ ఇండియా వరల్డ్" టైటిల్‌ను గెలుచుకుంది. సేచెల్లిస్‌లో జరిగిన 47వ ప్రపంచ సుందరి పోటీలలో ఈమె భారతదేశం తరఫున పాల్గొనింది.[5] ఆ పోటీలలో 86మంది అందగత్తెలతో పోటీపడి "మిస్ వరల్డ్ 1997"గా కిరీటాన్ని పొందింది.[6] ఈమె ఈ పోటీలలో "మిస్ వరల్డ్ - ఆసియా & ఓషియానా", "మిస్ ఫోటోజెనిక్", "స్పెక్టాక్యులర్ స్విమ్‌వేర్" అనే మూడు ఉపవిభాగాలలో టైటిల్స్‌ను సంపాదించుకుంది. ఈ విధంగా మిస్ వరల్డ్ పోటీలలో "మిస్ వరల్డ్" టైటిల్‌తో పాటు మూడు సబ్‌టైటిళ్లను పొందిన ఏకైక వ్యక్తిగా ఈమె నిలిచింది. రీటాఫారియా(1966), ఐశ్వర్య రాయ్(1884) ల తర్వాత "ప్రపంచ సుందరి"గా ఎన్నికైన మూడవ భారతీయ మహిళ డయానా హేడెన్.

ప్రపంచ సుందరి విజయం తర్వాత ఈమె లోరియల్, కోల్గేట్, ఛోపార్డ్ వంటి సంస్థలతో మోడల్‌గా ఒప్పందం కుదుర్చుకుంది.[7][8] ఈమె ఛైల్డ్ రైట్స్ అండ్ యూ (క్రై), గ్రీన్‌పీస్, పెటా, స్పాస్టిక్స్ సొసైటీ వంటి అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసింది. ఈమె కాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులపై అవగాహన పెంచడానికి తన వంతు కృషిచేసింది.[9]

వృత్తి

[మార్చు]

ప్రపంచ సుందరి విజయం తర్వాత ఈమె లండన్ వెళ్ళి "రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమెటిక్ ఆర్ట్" సంస్థలో యాక్టింగ్ కోర్సులో చేరింది.[10]ఇంకా డ్రామా స్టూడియో లండన్‌లో కూడా చదివింది. ఇక్కడ షేక్‌స్పియర్ నాటకాలపై దృష్టి పెట్టింది. స్టూడియో తరఫున ఉత్తమ నటిగా నామినేట్ చేయబడింది.[10] 2001లో దక్షిణ ఆఫ్రికాలో షేక్‌స్పియర్ నాటకం ఒథెల్లో ఆధారంగా నిర్మించబడిన సినిమాలో తొలిసారి నటించింది.

2008లో ఈమె బిగ్‌బాస్ (హిందీ సీజన్ 2)టెలివిజన్ సీరీస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశించి 13వ వారం వరకూ కొనసాగింది. [11]

ఎ బ్యూటిఫుల్ ట్రూత్ పుస్తకావిష్కరణ సందర్భంలో డయానా

ఈమె వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం అంశాలుగా ఎ బ్యూటిఫుల్ ట్రూత్ అనే పుస్తకాన్ని రచించింది.2012,ఆగష్టు 6న విడుదలైన ఈ పుస్తకం వ్రాయడానికి ఈమెకు రెండు సంవత్సరాలు పట్టింది.[12][13]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈమె లాస్ వెగాస్‌కు చెందిన కొలిన్ డిక్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.[14] అతడు ముంబైలో ఒక అంతర్జాతీయ ఎన్.జి.వోలో పనిచేశాడు.[15] ఒక ఇంటర్వ్యూలో తన అపార్ట్‌మెంటులో అద్దెకు దిగిన సందర్భంలో తొలిసారి డిక్‌ను కలుసుకున్నట్లు తెలియజేసింది.[16] వీరి వివాహం 2013 సెప్టెంబర్ 13న బంధుమిత్రుల సమక్షంలో లాస్ వెగాస్‌లో ఒక కంట్రీ క్లబ్‌లో జరిగింది.[17]

ఈమె 2016లో ఒక కుమార్తెను,[18][19] 2018లో ఒక కుమార్తెను, ఒక కుమారుడు (కవలపిల్లలు)ను ప్రసవించింది.[20]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సినిమా సంవత్సరం పాత్ర వివరాలు మూలం
తెహ్‌జీబ్ 2003 షీనా రాయ్ తొలి చిత్రం [21]
అబ్ బస్! 2004 సోమియా మాథుర్ హిందీ సినిమా [22]
ఒథెల్లో:ఎ సౌత్ ఆఫ్రికన్ టేల్ 2006 ఎమిలియా [23]
ఆల్ అలోన్ 2006 కేమియో [24]
లోరీ 2012 నటి హిందీ సినిమా [25]

టెలివిజన్

[మార్చు]
పేరు సంవత్సరం పాత్ర వివరాలు మూలం
ఫెమినా మిస్ ఇండియా 1997 1997 పోటీదారు [26]
మిస్ వరల్డ్ 1997 1997 పోటీదారు [27]
విస్‌డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది సెంచురీ 2000 హోస్ట్ [28]
మిస్ యూరోప్ 2002 2002 హోస్ట్ [29]
హోల్బి సిటీ 2003 నాట్ హుసేన్ [30]
బయోగ్రఫీ విత్ డయానా హేడెన్ 2005 అతిథి హిస్టరీ టివి 18లో 3 నెలల సీరియల్. [31]
మిస్ వరల్డ్ 2005 2005 న్యాయనిర్ణేత [32]
బిగ్ బాస్ 2 (హిందీ) 2008 పోటీదారు [33]
ఫెమీనా మిస్ ఇండియా 2009 2009 న్యాయనిర్ణేత [34]
ఆడ్ ఏషియా అవార్డ్స్ 2011 హోస్ట్ [35]
లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2012 హోస్ట్ [31]

మూలాలు

[మార్చు]
  1. "From Sushmita Sen to Diana Hayden, see how educated your favourite Indian beauty pageant winners are". India Times. 25 July 2017. Archived from the original on 30 March 2019. Retrieved 15 February 2018.
  2. "With Yeats on her lips, India's own Diana Hayden crowned Miss World". Rediff.com. 23 November 1997. Archived from the original on 30 May 2010. Retrieved 25 December 2010.
  3. 3.0 3.1 "Biography of Diana Hayden". WhereInCity India Information. Archived from the original on 20 September 2010. Retrieved 25 December 2010.
  4. "These photos prove that Miss World 1997 Diana Hayden is no less beautiful than Aishwarya Rai". Zoom TV. 27 April 2018. Archived from the original on 18 అక్టోబరు 2020. Retrieved 18 అక్టోబరు 2020.
  5. "When Diana Hayden was crowned Miss World 1997". Indiatimes. 27 April 2018. Archived from the original on 18 అక్టోబరు 2020. Retrieved 18 అక్టోబరు 2020.
  6. "Diana Hayden: Being brown skinned, I've had to fight the 'light skin is better' issue". The Indian Express. 28 April 2018. Archived from the original on 24 March 2019. Retrieved 21 May 2019.
  7. "Diana Hayden - India's 1st Loreal model". Missosology. 16 May 2011. Archived from the original on 16 February 2018. Retrieved 15 February 2018.
  8. "Femina Miss India World 1997, Diana Hayden". beautypageants.indiatimes.com. Archived from the original on 2020-10-12. Retrieved 2020-10-18.
  9. "When Diana Hayden proved she's more than a beauty queen". 27 April 2018. Archived from the original on 17 October 2018. Retrieved 21 May 2019.
  10. 10.0 10.1 "Biography of Diana Hayden". DianaHayden.com. Archived from the original on 10 July 2011. Retrieved 25 December 2010.
  11. "Diana Hayden in Bigg Boss house". Times of India. 15 September 2008. Archived from the original on 2 July 2018. Retrieved 27 April 2018.
  12. "Beauty guide". The Hindu. Chennai, India. 5 Aug 2012. Archived from the original on 12 October 2020. Retrieved 6 Aug 2012.
  13. "Diana Hayden launches her book at Vadodara!". Times of India. 6 Aug 2012. Archived from the original on 9 August 2013. Retrieved 6 Aug 2012.
  14. "Diana Hayden ties the knot in Las Vegas". Hindustan Times. 18 September 2013. Archived from the original on 12 October 2020. Retrieved 27 December 2019.
  15. "Diana Hayden walks down the aisle with Collin Dick in Las Vegas". Daily Bhaskar. 18 September 2013. Archived from the original on 27 December 2019. Retrieved 27 December 2019.
  16. Jamvwal, Nisha (18 September 2013). "Long road to a fairytale ending". The Deccan Chronicle. Archived from the original on 27 December 2019. Retrieved 27 December 2019.
  17. "Diana Hayden gets married". 20 September 2013. Archived from the original on 12 అక్టోబరు 2020. Retrieved 27 December 2019.
  18. "Ex-Miss World gives birth from egg frozen for 8 years". The Times of India. 13 January 2016. Archived from the original on 28 November 2017. Retrieved 3 December 2017.
  19. "Diana Hayden's Baby Girl Was Born from a Frozen Egg. Here's What This Means for Indian Women". The Better India. 12 January 2016. Archived from the original on 4 December 2017. Retrieved 3 December 2017.
  20. "Diana Hayden gave birth to a healthy baby girl at the age of 42". 12 March 2018. Archived from the original on 24 August 2018. Retrieved 24 August 2018.
  21. "Tehzeeb". Reddif.com. Archived from the original on 10 February 2018. Retrieved 9 February 2018.
  22. "Ab... Bas! - Times of India". Times of India. 25 November 2004. Archived from the original on 18 అక్టోబరు 2020. Retrieved 8 June 2019.
  23. "Othello: A South African Tale". British Universities Film and Council. Archived from the original on 10 February 2018. Retrieved 9 February 2018.
  24. "Diana Hayden's biography". www.webindia123.com. 19 September 2012. Archived from the original on 8 June 2019. Retrieved 8 June 2019.
  25. Salvadore, Sarah (10 February 2011). "Actor Karan Singh Grover has signed a film opposite former Miss World Diana Hayden". The Times of India. Archived from the original on 12 October 2020. Retrieved 8 June 2019.
  26. "When Diana Hayden was crowned as Miss World 1997". Indiatimes. 27 April 2018. Archived from the original on 18 అక్టోబరు 2020. Retrieved 18 అక్టోబరు 2020.
  27. "Miss India, quoting Irish poet wins Miss World 1997". New Straits Times. 24 November 1997. Archived from the original on 5 March 2016. Retrieved 8 June 2019.
  28. "Diana Hayden makes a flying start". Zee News. 10 Jan 2014. Archived from the original on 8 June 2019. Retrieved 8 June 2019.
  29. "Biography of Diana Hayden, Miss World 1997". Archived from the original on 8 June 2019. Retrieved 8 June 2019.
  30. "Diana Hayden, Miss World 1997 - ETimes profile". Indiatimes. 6 April 2011. Archived from the original on 18 అక్టోబరు 2020. Retrieved 18 అక్టోబరు 2020.
  31. 31.0 31.1 "India Speakers Bureau - Diana Hayden". 16 August 2012. Archived from the original on 8 June 2019. Retrieved 8 June 2019.
  32. "The Manila Times". 16 December 2005. Archived from the original on 7 March 2016. Retrieved 30 June 2019.
  33. "Diana Hayden on her Bigg Boss stint in 2008: The best was that my Hindi improved tremendously". Indian Express. 5 February 2018. Archived from the original on 24 March 2019. Retrieved 8 June 2019.
  34. "First look: Femina Miss India 2009 wild card winners". 13 January 2009. Archived from the original on 8 June 2019. Retrieved 8 June 2019.
  35. "Diana Hayden's keynote speech". Leading Speaker's Bureau. 9 August 2011. Archived from the original on 8 June 2019. Retrieved 8 June 2019.

బయటి లింకులు

[మార్చు]