డాన్
అమితాబ్ బచ్చన్, జీనత్ అమన్, ప్రాణ్, హెలెన్ నటించిన హిందీ చలనచిత్రo ,1978, ఏప్రిల్,20 న విడుదల. 'డాన్ ' చిత్రానికి దర్శకత్వం చంద్రా బారోత్ కాగా, సంగీతం కళ్యాణ్ జీ, ఆనంద్ జీ సమకూర్చారు.
.
డాన్ | |
---|---|
![]() సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | చంద్రా బారోత్ |
రచన | జావెద్ అఖ్తర్ సలీం ఖాన్ |
నిర్మాత | నారీమన్ ఎ. ఇరానీ |
తారాగణం | అమితాభ్ బచ్చన్ జీనత్ అమన్ ప్రాణ్ హెలెన్ |
ఛాయాగ్రహణం | నారీమన్ ఎ. ఇరానీ |
కూర్పు | వామన రావు |
సంగీతం | కళ్యాణ్ జీ ఆనంద్ జీ |
విడుదల తేదీ | 20 April 1978 |
సినిమా నిడివి | 175 ని |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | INR 50,000,000 |
కథ
[మార్చు]పోలీసులు తీవ్రంగా గాలించే చట్టవ్యతిరేక వ్యాపారాలు నిర్వహించే డాన్ (అమితాభ్ బచ్చన్) వారికి చిక్కకుండా వారిని ముప్పుతిప్పలు పెడుతుంటాడు. డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ, నా ముమ్కిన్ హై (డాన్ పట్టుకోవటం కష్టమే కాదు, అసాధ్యం కూడా) అన్నది డాన్ ఊతపదం. తన వ్యాపారాన్ని వేగంగా విస్తరించటానికి డాన్ అనుసరించే నిర్దయా విధానాలు, నిక్కచ్చి వ్యవహార శైలితో డాన్ పోలీసులనే కాకుండా తన ప్రత్యర్థులను కూడా శత్రువులుగా మార్చుకొంటుంటాడు. రమేష్ అనబడు వ్యక్తి పెళ్ళి చేసుకొని స్థిరపడాలనే ఉద్దేశంతో డాన్ వ్యాపారం నుండి వైదొలగాలని స్వయంగా నిర్ణయించుకొన్నాడని తెలపటంతో అతడిని హత మారుస్తాడు డాన్. రమేష్ తో నిశ్చితార్థం జరిగిన అతని ప్రియురాలు కామిని (హెలెన్) అతని చెల్లెలు రోమా (జీనత్ అమన్) డాన్ పైన పగ పెంచుకొంటారు. డాన్ ని ఆకర్షించి అతనిని పోలీసులకి పట్టించాలనుకొన్న కామిని కుయుక్తిని డాన్ చివరి నిముషంలో పసిగట్టి ఆమెని హతమార్చి తాను తప్పించుకు పోతాడు.
డాన్ ని మట్టుబెట్టాలనుకొన్న రోమా తన వేషభాషలని మార్చి జూడో, కరాటే నేర్చుకొని తాను కూడా చట్టవ్యతిరేక పనులు చేస్తున్నట్టు డాన్ అనుచరులను నమ్మిస్తుంది. ఆమె పోరాట పటిమకు ముచ్చట పడిన డాన్ రోమా నిజ స్వరూపం తెలియక తన వ్యాపారంలో చోటిస్తాడు డాన్. డాన్ ని ప్రాణాలతో పట్టుకోవాలన్న పోలీసుల యత్నాలు విఫలమౌతాయి. ఆ పోరాటంలో ఆఫీసర్ డిసిల్వా చేతిలో డాన్ మరణిస్తాడు. అయితే డిసిల్వా ఈ నిజాన్ని బయటి ప్రపంచానికి తెలియనివ్వడు. దీనికి కారణం, డాన్ ని పోలి ఉన్న విజయ్ గురించి డిసిల్వాకి అది వరకే తెలిసి ఉండటం. సైనికుడిగా డాన్ విస్తరిస్తున్న చీకటి సామ్రాజ్యానికి అధిపతి ఎవరో తెలుసుకోవటానికి విజయ్ ని ఉపయోగించుకోవాలనుకొంటాడు డిసిల్వా.
బనారసీ పాన్ ని ముంబయిలో అమ్ముకొంటున్న విజయ్ కి ఇద్దరు అనాథ పిల్లలు తారసపడటంతో వారిని తనతో బాటే పెంచుకొంటుంటాడు. వారి చదువు సంధ్యల బాధ్యతలను డిసిల్వా స్వీకరించి విజయ్ ని డాన్ గా మారుస్తాడు. చీకటి వ్యాపారం నుండి తొలగిపోవాలనుకొన్న జస్జీత్ పోలీసుల చేతిలో చిక్కి తన ఇద్దరు పిల్లలకు దూరమైన జస్జీత్ డిసిల్వా పైన పగబడతాడు. డాన్ తన జ్ఞాపక శక్తిని కోల్పోయినట్టు నటిస్తుంటాడు విజయ్. డాన్ ని మట్టుబెట్టాలనుకొంటున్న రోమాకి హఠాత్తుగా ఈ నిజం తెలుస్తుంది.
తన జ్ఞాపకశక్తిని తిరిగి పొందినట్టు డాన్ తన సహచరులకు తెలియజేసి, తన వ్యాపారానికి సంబంధించిన ఎర్ర డైరీని వారి నుండి సంపాదిస్తాడు డాన్. దానిని డిసిల్వాకి అందజేస్తాడు. డాన్ జ్ఞాపకశక్తి తిరిగి వచ్చినందుకు డాన్ బృందం వేడుకలు చేసుకొంటుండగా పోలీసులు డాన్ పైన దాడి చేస్తారు. అక్కడ జరిగే కాల్పుల్లో డిసిల్వా మరణిస్తాడు.
పోలీసులు విజయ్ నే డాన్ గా పరిగణించి అతని వెంట పడగా, డాన్ బృందానికి విజయ్ అసలైన డాన్ కాడని తెలుస్తుంది. ఈ అయోమయాన్ని విజయ్ ఎలా ఛేదించి బయట పడ్డాడు అన్నదే చిత్రానికి ముగింపు.
తారాగణం
[మార్చు]- అమితాబ్ బచ్చన్
- జీనత్ అమన్
- ప్రాణ
- హెలెన్
- ఓం శివపురీ
- సత్యన్ కప్పు
- పి.జయరాజ్
- కమల్ కపూర్
- అర్పణా చౌదరి
- షెట్టి
- మాక్ మోహన్
- యూసఫ్ ఖాన్
- పించో కపూర్
- శరద్ కుమార్
- బేబీ
- బిలిష్
- జగదీష్ రాజ్
- కేశవరత్న
- ఎం.ఎ.లతీఫ్
- రాజన్ హక్షర్
- మాస్టర్ అలంకార్
- మాణిక్ ఇరానీ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: చంద్రా బరోత్
- కధ: సలీమ్ జావేద్
- పాటలు: అంజాన్ ఇందీవర్
- గాయనీ గాయకులు: కిషోర్ కుమార్, అమితాబ్ బచ్చన్, లతామంగేస్కర్, ఆశాభోంస్లే,
- సంగీతం: కళ్యాణ్ జీ, ఆనంద్ జీ
- కూర్పు: వామనరావు
- నిర్మాత: నారీమన్ ఇరానీ
- విడుదల:20:04:1978.
సంగీతం
[మార్చు]గీతం | నేపథ్యగానం | రచయిత |
---|---|---|
మై హూ డాన్ | కిషోర్ కుమార్ | అంజాన్ |
బంబయి నగరియా | కిషోర్ కుమార్ | అంజాన్ |
ఖైకే పాన్ బనారస్ వాలా | కిషోర్ కుమార్, అమితాభ్ బచ్చన్ | అంజాన్ |
జిస్ కా ముఝే థా ఇంతెజార్ | కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ | అంజాన్ |
యే మేరా దిల్ | ఆశా భోంస్లే | ఇందీవర్ |
విశేషాలు
[మార్చు]- ఈ చిత్రం, తెలుగులో యుగంధర్గా రూపొందించబడింది. తమిళంలో బిల్లాగా రూపొందించబడింది.
- కథలో స్వల్ప మార్పులతో షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా 2007 లో ఇదే పేరుతో ఈ చిత్రం విడుదలయ్యింది.
- డాన్ శీనులో రవితేజ ఈ చిత్రం ప్రేరణతోనే డాన్ అవ్వాలనుకొంటాడు.