డా. ధర్మరాజు ఎం.బి.బి.యస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. ధర్మరాజు ఎం.బి.బి.యస్
దర్శకత్వంశీను రామస్వామి
రచనశీను రామస్వామి
నిర్మాతఆర్.కె. సురేష్
తారాగణంవిజయ్​ సేతుపతి
తమన్నా
ఐశ్వర్య రాజేష్
ఛాయాగ్రహణంఎం. సుకుమార్
కూర్పుకాశీ విశ్వనాథన్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
స్టూడియో 9
విడుదల తేదీ
2016 ఆగస్టు 19 (2016-08-19)
సినిమా నిడివి
147 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసు₹25 కోట్లు

డా. ధర్మరాజు ఎం.బి.బి.యస్ 2016 లో విడుదల అయిన తెలుగు సినిమా. స్టూడియో 9 బ్యానర్ పై ఆర్.కె. సురేష్ నిర్మించిన ఈ సినిమాకి శీను రామసామి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, తమన్నా, ఐశ్వర్య రాజేష్ నటించారు.[1] ఇది తమిళ "ధర్మ దురై" సినిమాకి అనువాదం.

నటవర్గం[మార్చు]

కథ[మార్చు]

ధర్మ తాగుబోతు అందువలన అతని సోదరులు అతనిని ఎక్కువ సమయం అవుట్‌హౌస్‌లో బంధిస్తారు. అతని పనుల వలన అతని అన్నతమ్ములు విసిగిపోయి అతన్ని చంపాలనుకుంటారు. ధర్మ తల్లి అతన్ని విడిపించి పంపిస్తుంది. ధర్మ, మధురై మెడికల్ కాలేజీలో తనతో పాటే చదివిన స్టెల్లా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆమె కారు ప్రమాదంలో చనిపోయిందని తెలుసుకొని, ఇంకో స్నేహితురాలు సుభాషిణి దగ్గరికి వెళ్తాడు. ఆమె ధర్మలో వచ్చిన మార్పుకు ఆందోళన చెందుతుంది. ధర్మ ఊర్లో లక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించానని, తన అన్నదమ్ములు వరకట్నం అడగడం వలన పేద అమ్మాయి అయిన లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని అందుకే తాను మద్యానికి బానిస అయ్యానని చెపుతాడు. ఆ తరువాత ధర్మ కోలుకున్న తర్వాత సుభాషిణి గురుంచి అడుగగా తన భర్త తనకు తెలియకుండా తాగే పాలలో అబార్షన్ మాత్రలు కలిపి, పుట్టబోయే బిడ్డను చంపినందున విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాని చెపుతుంది. విడాకులు వచ్చాక ధర్మ, సుభాషిణి సహజీవనం చేస్తారు. వాళ్ళ ప్రొఫెసర్ కోరిక మేరకు వివాహం చేసుకోవాలనుకుంటారు.

పాటలు[మార్చు]

  • పల్లెటూరి పిల్ల నువ్వు ఏమి చేస్తివే
  • ఎటుపక్క చూసిన నువ్వే ఉండు

ఇవి కూడ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Vijay Sethupathi's 'Dharmaraju'". The Times of India. Retrieved 2022-07-01.
  2. "Two New Heroines For Vijay Sethupathi's'Dharmaraju'". Desimartini. 2015-12-17. Retrieved 2022-07-01.
  3. "Aishwarya Rajesh, Srushti Dange join Tamannaah - Times of India". The Times of India. Retrieved 2022-07-01.