దేవరకొండ వెంకట సుబ్బారావు
దేవరకొండ వెంకట సుబ్బారావు | |
---|---|
డి.వి.సుబ్బారావు | |
జననం | దేవరకొండ వెంకట సుబ్బారావు 1894 |
మరణం | 1960 |
ఇతర పేర్లు | డి.వి.సుబ్బారావు |
ప్రసిద్ధి | తెలుగు రంగస్థల నటులు |
డి.వి.సుబ్బారావు గా ప్రసిద్ధిచెందిన తెలుగు రంగస్థల నటుని పూర్తి పేరు దేవరకొండ వెంకట సుబ్బారావు (1894 - 1960).
వీరు ఉన్నత పాఠశాల విద్య తర్వాత కొంతకాలం గుమస్తాగా పనిచేసి, 14 ఏళ్ళ వయసునుండే భువన రంజనీ థియేటర్ లో చేరి వారి నాటకాలలో పాత్రలు పోషించారు. తర్వాత నల్లూరి బ్రహ్మానందం నడుపుతున్న ఇండియన్ డ్రమెటిక్ కంపెనీలో 1910 సంవత్సరంలో చేరారు. అనతికాలంలో ఆ సంస్థకు అధిపతిగా దానిని క్రమశిక్షణ కలిగిన నాటక సమాజంగా తీర్చిదిద్దారు. వీరు నాటక ప్రదర్శనం ఒక సమిష్టి కృషిగా, సమయ పాలనతో, ఎలాంటి లోపం లేకుండా నిర్వహించారు. నాటక రచయితగా పింగళి నాగేంద్రరావు ను నియమించి వారిచే ఎన్నో ఉత్తమ నాటకాలను రచించి ప్రదర్శించారు. సుమారు 36 సంవత్సరాలకు పైగా పనిచేసి 34 నాటకాలను ప్రదర్శించారు. వానిలో గులేబకావళి, గయోపాఖ్యానం, గోపీచంద్, బొబ్బిలి, రసపుత్ర విజయం, లవకుశ, చంద్రహాస, కృష్ణలీల, సత్య హరిశ్చంద్ర, నా రాజు, వింధ్యరాణి, మరో ప్రపంచం, చిత్ర నళీయం, చిత్రాంతి ముఖ్యమైనవి.
హరశ్చంద్ర పాత్రలో తెలుగు నాటకరంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.[1]
మూలాలు[మార్చు]
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
బయటి లింకులు[మార్చు]
- కమ్యూనిస్టుల ఐక్య సంఘటన అన్వేషణ ప్రథమ సంపుటి రెండవ సంపుటి
- HARICHANDRA DRAMA (Jr D V SUBBA RAO) varanasi scene
- ↑ పెద్ది రామారావు బ్లాగ్. "హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పాడు". ramaraopeddi.blogspot.in. Archived from the original on 24 ఏప్రిల్ 2017. Retrieved 5 April 2017. Check date values in:
|archive-date=
(help)