దేవులపల్లి అమర్

వికీపీడియా నుండి
(డి. అమర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దేవులపల్లి అమర్
Devulapalli Amar
జననం (1957-08-15) 1957 ఆగస్టు 15 (వయసు 66)
వృత్తివిలేఖరి, రచయిత

దేవులపల్లి అమర్ (ఆంగ్లం: Devulapalli Amar; జననం 1957 ఆగస్టు 15) ప్రముఖ భారతీయ జర్నలిస్టు.[1]

తొలి రోజులు[మార్చు]

మదన్ మోహనరావు, సరస్వతి దంపతులకు దేవులపల్లి అమర్ జన్మించాడు. ఆయన బి.ఏ. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత జర్నలిజంలో పట్టా పొందాడు.

పత్రికారంగం[మార్చు]

దేవులపల్లి అమర్ 1975లో ప్రజాతంత్ర పత్రికకు వ్యవస్థాపక సంపాదకుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఆంధ్రప్రభలో స్టాఫ్ కరస్పాండెంట్ లో కొంతకాలం పనిచేసి అందులో సహాయ సంపాదకునిగా ఎదిగాడు. ఆ తరువాత ఈనాడు, ఉదయం, ఆంధ్రభూమి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తదితర దినపత్రికలలో పనిచేసి మంచి అనుభవాన్ని సంపాదించాడు. ఆయన గతంలో సాక్షి టీవీలో సమకాలీన రాజకీయాలపై ఒక లైవ్ షో కూడా నిర్వహించేవాడు. ఆయన రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించాడు. ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌(ఐజేయూ) అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు.[2][3]

తెలంగాణ‌కు చెందిన ఆయన వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ హయాంలో 2019 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా, అంతరాష్ట్ర వ్యవహారాల సలహాదారుడుగా నియమితులయ్యాడు.[4] ఇటీవల ఆయన పదవీ కాలం ముగియడంతో మరో సంవత్సరం పొడగిస్తూ  రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సాధార‌ణ ప‌రిపాల‌నా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రేవు ముత్యాల రాజు 2022 సెప్టెంబరు 10న అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశాడు.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-09-21. Retrieved 2015-01-30.
  2. http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2008051654981000.htm&date=2008/05/16/&prd=th&[permanent dead link]
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-01-24. Retrieved 2015-01-30.
  4. "Devulapalli Amar appointed adviser to AP government - The Hindu". web.archive.org. 2022-09-10. Archived from the original on 2022-09-10. Retrieved 2022-09-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)