దేవులపల్లి అమర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవులపల్లి అమర్
Devulapalli Amar
జననం (1957-08-15) 1957 ఆగస్టు 15 (వయస్సు: 62  సంవత్సరాలు)
వృత్తివిలేఖరి, రచయిత

దేవులపల్లి అమర్ (ఆంగ్లం: Devulapalli Amar (జ 1957 ఆగస్టు 15) ప్రముఖ భారతీయ జర్నలిస్టు.[1]

తొలి రోజులు[మార్చు]

అమర్ దేవులపల్లి మదన్ మోహనరావు మరియు సరస్వతి దంపతులకు జన్మించారు. వీరు బి.ఏ. పూర్తిచేసిన తర్వాత జర్నలిజంలో కూడా పట్టా పొందారు.

పత్రికారంగం[మార్చు]

దేవులపల్లి అమర్ 1975లో ప్రజాతంత్ర పత్రికకు వ్యవస్థాపక సంపాదకుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఆంధ్రప్రభలో స్టాఫ్ కరస్పాండెంట్ లో కొంతకాలం పనిచేసి అందులో సహాయ సంపాదకునిగా ఎదిగారు.

వీరు ఈనాడు, ఉదయం, ఆంధ్రభూమి మరియు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలలో పనిచేసి మంచి అనుభవాన్ని సంపాదించారు. ఇతడు రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించాడు. ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌(ఐజేయూ) అధ్యక్షుడిగా ఉన్నాడు.[2] .[3]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]