డొరొతీ పార్కర్
డొరొతీ పార్కర్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | డొరొతీ రోత్సుచైల్డ్ 1893 ఆగస్టు 22 న్యూజెర్సీ, యునైటెడ్ స్టేట్స్ |
మరణం | 1967 జూన్ 7 న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ | (వయసు 73)
వృత్తి | కవయిత్రి, రచయిత్రి, విమర్శకురాలు, సినీ రచయిత్రి |
జాతీయత | అమెరికన్ |
రచనా రంగం | కవిత్వం, వ్యంగ్యం, కథలు |
సాహిత్య ఉద్యమం | అమెరికన్ ఆధునికత |
గుర్తింపునిచ్చిన రచనలు | ఎనఫ్ రోప్, సన్సెట్ గన్, స్టార్ లైట్, స్టార్ బ్రైట్ -, ఎ స్టార్ ఈజ్ బోర్న్ |
పురస్కారాలు | ఓ. హెన్రీ అవార్డు 1929 |
జీవిత భాగస్వామిజీవిత భాగస్వాములు | ఎడ్విన్ పాండ్ పార్కర్ II
(m. 1917; విడాకులు 1928)అలాన్ కాంప్బెల్
(m. 1934; విడాకులు 1947)
(m. 1950; మరణం 1963) |
డొరొతీ పార్కర్ (ఆగస్టు 22, 1893 - జూన్ 7, 1967) అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి, విమర్శకురాలు, సినీ రచయిత్రి. సమకాలీన అంశాలపై వ్యంగ్యంగా రచనలు చేసిన డొరొతీ పార్కర్ అత్యంత ప్రజాదరణను పొందింది.[1]
జననం
[మార్చు]డొరొతీ పార్కర్ 1893, ఆగస్టు 22న అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో జన్మించింది.[2] డొరొతీ తల్లి స్కాటిష్, తండ్రి జర్మన్ యూదు కు చెందినవారు. డొరొతీకి ఐదేళ్ళ వయసున్నప్పుడు 1898, జూలైలో తల్లి మరణించింది.[3] ఆమె తండ్రి 1900 లో ఎలియనార్ ఫ్రాన్సిస్ లెవిస్ (1851-1903) ను వివాహం చేసుకున్నాడు.[4] డొరొతీ పార్కర్ కు ఎలియనార్ ఫ్రాన్సిస్ లెవిస్ ను తల్లి అని పిలవడం ఇష్టం ఉండేదికాదు.[5] డొరొతీకి తొమ్మిదేళ్ళ వయసున్నప్పుడు 1903లో ఎలియనార్ ఫ్రాన్సిస్ లెవిస్ మరణించింది.[6]
విద్యాభ్యాసం - ఉద్యోగం
[మార్చు]1911 లో 18 సంవత్సరాల వయస్సులో డొరొతీ పార్కర్ మిస్ డానా స్కూల్ నుండి పట్టభద్రురాలయింది.[7] 1913లో తండ్రి మరణించిన తరువాత జీవనోపాధికోసం నాట్య పాఠశాలలో కొంతకాలం పియానో పియానో టీచరుగా పనిచేసింది.[8] వోగ్, వానిటీ ఫెయిర్ వంటి పత్రికల్లో జర్నలిస్ట్‌గా, రచయితగా పనిచేసింది.[9]
రచనా ప్రస్థానం
[మార్చు]21వ ఏళ్ళ వయసులో 1914లో డొరొతీ పార్కర్ తొలి కవితని వానిటీ ఫెయిర్ పత్రికలో ప్రచురించబడింది. 1926లో ఎనఫ్ రోప్ పేరుతో తొలి కవితా సంకలనం వెలువరించింది. ఇది 47వేల కాపీలు అమ్ముడయ్యాయి.[10] సన్ సెట్ గన్స్ (1928), డీట్-హెచ్ అండ్ టాక్సెస్ (1931), నాట్ సో డీప్ యాస్ వెల్ (1936) వంటి కావ్యాలను ప్రచురించింది.
కథలను, నాటకాలను రచించిన డొరొతీ, ఆ తర్వాత హాలీవుడ్ సినిమాలకు రచనలు చేసి ఏ స్టార్ ఈజ్ బార్న్ (1937), స్మాష్-అప్, ది స్టోరీ ఆఫ్ ఏ వుమెన్ (1947) వంటి సినిమాల ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత్రిగా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది.
కథా సంకలనాలు
[మార్చు]- 1930 లివింగ్ ఫర్ లివింగ్
- 1933 ఆఫ్టర్ సచ్ ప్లెషర్స్
- 1939 హియర్ లైస్
- 1942 కలెక్టడ్ స్టోరీస్
- 1944 ది పోర్టబుల్ డొరొతీ పార్కర్
కవితా సంకలనాలు
[మార్చు]- 1926 ఎనఫ్ రోప్
- 1928 సన్సెట్ గన్స్
- 1931 డెత్ అండ్ టాక్స్
- 1936 నాట్ సో డీప్ యాజ్ ఎ వెల్ (సేకరించిన కవితలు)
- 1944 కలెక్టడ్ పోయెట్రీ
- 1996 ది లాస్ట్ పోయెమ్స్ ఆఫ్ డోరతీ పార్కర్
నాటకాలు
[మార్చు]- 1929 క్లోజ్ హార్మోనీ
- 1953 లేడీస్ ఆఫ్ ది కారిడార్
స్క్రీన్ ప్లే
[మార్చు]- 1949 ది ఫ్యాన్
- 1942 సపోర్ట్
- 1937 ఏ స్టార్ ఈజ్ బార్న్
- 1936 సుజీ
- 1938 స్వీట్ హార్ట్స్
- 1938 ట్రేడ్ విండ్స్
- 1941 వీక్ ఎండ్ ఫర్ త్రీ
- 1947 స్మాష్-అప్, ది స్టోరీ ఆఫ్ ఏ ఉమెన్
ఇతర వివరాలు
[మార్చు]మిత్రులతో కలిసి ఆల్గోన్క్విన్ రౌండ్ టేబుల్ పేరిట ఒక రచనా ఉద్యమాన్ని ప్రారంభించిన డొరొతీ పార్కర్, సమకాలీన అంశాలపై రచనలు చేసింది. 1936లో హాలీవుడ్ యాంటీ నాజీ లీగ్ హక్కుల పేరిట ఒక మేధో బృందాన్ని స్థాపించి, ఆనాటి సమాజంలోని ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడింది.[11] దాంతో డొరొతీని కమ్యూనిస్టుగా భావించిన అమెరికా ఎఫ్.బి.ఐ. ఆమెపై 1000 పేజీల నివేదికను రూపొందించడంతో హాలీవుడ్ సినీ ప్రపంచం 1949లో డొరొతీపై నిషేధాన్ని విధించింది.[12]
మరణం
[మార్చు]డొరొతీ పార్కర్ 73 ఏళ్ళ వయసులో 1967, జూన్ 7న గుండెపోటుతో యునైటెడ్ స్టేట్స్ లోని న్యూయార్క్ నగరంలో మరణించింది.[13]
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, చెలిమె-ప్రపంచ కవిత (4 February 2019). "డొరొతీ పార్కర్". మామిడి హరికృష్ణ. Archived from the original on 4 February 2019. Retrieved 4 February 2019.
- ↑ Meade, Marion (1987). Dorothy Parker: What Fresh Hell Is This?. New York: Penguin Books. p. 5. ISBN 0-14-011616-8.
- ↑ Meade 12
- ↑ Meade 13
- ↑ Herrmann, Dorothy (1982). With Malice Toward All: The Quips, Lives and Loves of Some Celebrated 20th-Century American Wits. New York: G. P. Putnam's Sons. p. 78. ISBN 0-399-12710-0.
- ↑ Meade 16
- ↑ Kinney, Authur F. (1978). Dorothy Parker. Boston: Twayne Publishers. pp. 26–27.
- ↑ Silverstein, Stuart Y. (1996). Not Much Fun: The Lost Poems of Dorothy Parker. New York: Scribner. p. 13. ISBN 0-7432-1148-0.
- ↑ Silverstein 13
- ↑ Silverstein 35
- ↑ Koch, Stephen, Double Lives: Stalin, Willi Munzenberg and the Seduction of the Intellectuals, New York: Enigma Books (2004), Revised Edition, ISBN 1-929631-20-0
- ↑ Kunkel, Thomas (1996). Genius in Disguise: Harold Ross of The New Yorker. Carrol & Graf. p. 405. ISBN 0-7867-0323-7.
- ↑ Whitman, Alden (June 8, 1967). "Dorothy Parker, 73, Literary Wit, Dies". The New York Times. Archived from the original on 2018-01-20. Retrieved 2019-02-04.
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో డొరొతీ పార్కర్ పేజీ
- Dorothy Parker Society
- Algonquin Round Table
- Minstrels Archive section on Parker's works
- Selected Poems by Dorothy Parker
- Parker's resting place
- Emdashes coverage Archived 2020-04-13 at the Wayback Machine of Dorothy Parker
- Dorothy Parker photo gallery; GettyImages