తడౌ ప్రజలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తడౌ (తడౌ / థాడో టె) కుకి వంశానికి చెందిన ఒక జాతి. వీరు ఈశాన్య భారతదేశం చిను రాష్ట్రం, బర్మా లోని సాగింగు విభాగం, తూర్పు బంగ్లాదేశులో ప్రాంతాలలో నివసిస్తున్నారు. తడౌ భాష టిబెటో-బర్మా భాషా కుటుంబానికి చెందిన ఒక మాండలికం. ఇది మణిపూరు లోని వివిధ ప్రాంతాల్లో మాట్లడబడుతుంది. మీటీ లోను (మీటీ భాష)భాష తరువాత ఇది రెండవ అతిపెద్ద మాండలికం. మణిపూరులో అన్ని జిల్లాల్లో తడౌప్రజలు కనిపిస్తారు. మణిపూరు జనాభా లెక్కల 2011 ఆధారంగా వారు మీటీ తరువాత రెండవ అతిపెద్ద జనాభాగా ఉంది. తడో-కుకి ప్రజలు మిజోరాం, నాగాలాండు, అస్సాం, (భారతదేశం) బంగ్లాదేశు, బర్మా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారు. తడౌ - కుకీలు (సోదర కుకి తెగలన్నింటితో) ఒక సాధారణ సంస్కృతిని పంచుకుంటారు.

మతం[మార్చు]

థాడౌ ప్రజలలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. 1894 నుండి మణిపూరులో మిషనరీగా పనిచేసిన విలియం పెటిగ్రూ అనే ఆంగ్లికన్ నుండి థాడస్ మధ్య క్రైస్తవ మతాన్ని గుర్తించవచ్చు. 2008 డిసెంబర్ 13 న క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తడౌ ప్రజల 100 వ వార్షికోత్సవం భారతదేశంలోని మణిపూరు మోదబంగు, సదరు పర్వతాలలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తడౌ జనాభాలో 10% మంది యూదు మతాన్ని అనుసరిస్తున్నారు. వారు ఇజ్రాయెలు 12 తెగలలో ఒకటైన మనస్సే వారసులు అని విశ్వసిస్తున్నారు. దాదాపు 5000 మంది తడౌ ప్రజలు ఇప్పుడు ఇజ్రాయెల్‌లో స్థిరపడ్డారు.

చరిత్ర[మార్చు]

కుకి ప్రధాన అధిపతి చోంగ్తుతు "చిన్లుంగ్ లేదా షిన్లుంగ్ లేదా ఖుల్" అనే గుహ నుండి ఉద్భవించాడని థాడో ప్రజలు విశ్వసించారు, ఈ ప్రదేశం మధ్య చైనాలో ఎక్కడో ఉందని విశ్వసిస్తున్నారు. మరికొందరు దీనిని టిబెట్టులో ఉన్నట్లు పేర్కొన్నారు. (గిన్జాటువాంగు 1973: 5) మెక్. కులోచు (1857: 55). గుహ నుండి ఉద్భవించిన ఆ పూర్వీకులలో చోంగ్తు ,సాంగ్తు, ఖుప్గం, వంగల్ప, కొంతమంది వంశీయులు నోయిమాంగ్పా, చోంగ్జా, సమూహంలోని ఇతరులను విడిచిపెట్టారు.

విలియం షా (1929) సేకరించిన మౌఖిక సంప్రదాయాల నుండి తడౌ మూలం గురించి నమోదు చేయబడింది. షా (1929) నమోదు చేసిన తడౌ కథనం ఆధారంగా నోయిమాంగ్పా భూగర్భ ప్రాంతానికి అధిపతి. నోయిమాంగ్పా బంధువు చోంగ్తు, తన కుక్కతో అడవిలో వేటాడుతున్నప్పుడు, ఒక పెద్ద గుహను కనుగొన్నాడు. ఈ ఆవిష్కరణను చూసి సంతోషించిన చోంగ్తు, తన వేటను విడిచిపెట్టి, తిరిగి తన గ్రామానికి వెళ్ళాడు. ఆయన భూమి మీద తన సొంత గ్రామాన్ని ఏర్పరచుకునే ఆలోచనలను సూచించాడు. ఇంతలో భూగర్భ అధిపతి నోయిమాంగ్పా కొరకు ‘చోను’ పండుగను ప్రదర్శిస్తున్నారు. ఇందులో చోంగ్టు, నియోమంగ్పా కుమారుడు చోంకిం అన్నయ్య చోంగ్జుతో సహా అందరూ పాల్గొన్నారు. ఈ విందులో చోంగ్తు తన కత్తిని తీవ్రంగా ఊపుతూ అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను గాయపరిచాడు. ఆ సమయంలో అందరూ కోపంగా ఉన్నారు. చోంగ్తు ఈ చర్య ముందస్తుగా నిర్ణయించబడింది. తద్వారా ఆయన ఎగువ ప్రపంచానికి వెళ్ళి తన సొంత గ్రామాన్ని ఏర్పరచటానికి ఒక అవసరం ఏర్పరుచుకున్నాడు. నోయిమాంగ్పా ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఆయన చోంగ్తు చనిపోవాలని కోరుకున్నాడు. నోయిమాంగ్పా కోపాన్ని విన్న చోంగ్తు, కుకీలు మాట్లాడే విధంగా జనావాసాలు లేని భూమికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ‘ఖులు’ గుహవాసులతో చోంగ్జా, చోంగ్తులకు విందు చేశారు. భూమి పైభాగానికి వెళ్ళేటప్పుడు ఒక గొప్ప చీకటి ఉంది. ఇది ఏడు రోజుల ఏడు రాత్రులు కొనసాగింది. దీనిని కుకిలు “తిమ్జిను” అని పిలుస్తారు. వారు తమ మార్గాన్ని అడ్డుకుంటున్న ఒక రాయిని కనుగొన్నారు. అనేక ప్రయత్నాలు చేసిన తరువాత చోంగ్జా విడిచిపెట్టి నోయిమాంగ్పాకు తిరిగి వచ్చి ఫలితాన్ని నివేదించారు ’. ‘ఖుల్’ లో డూం వద్ద విడిచిపెట్టినందుకు చోంగ్తు, పార్టీని సాంగ్జా భార్య నేమ్నే శపించింది. వెనుకబడిన చోంగ్జా, నోయిమాంగ్పా, ఇతర వంశాలు చైనా, జపనీ ప్రజలతో కలిసిపోయాయని కూడా నమ్ముతారు.

ఆంగ్లో - కుకీ తిరుగుబాటు (1917–19)[మార్చు]

ఆంగ్లో-కుకి యుద్ధం (1917-19) బ్రిటిషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన తిరుగుబాట్లలో ఒకటి. ఇది " ఇండియన్ నేషనల్ మూవ్మెంటు ఫర్ ఫ్రీడం " తో సమకాలీనంగా జరిగింది. ఈ ఉద్యమాన్ని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. తౌడాలు దీనిని "ఖోంగ్జై గాలు" అని పిలిచారు. మీటీసు దీనిని "ఖోంగ్జై లాలు" (ఖోంగ్జై యుద్ధం) అని పిలిచారు. జౌలు దీనిని జూగలు అని పిలిచారు. అయినప్పటికీ మణిపూరు అధికారిక రికార్డులలో దీనిని కుకి తిరుగుబాటు 1917-1919 అని అంటారు. 1917 మార్చి 17 నుండి ప్రారంభమై 20 మే 1919 మే 20 న ముగిసింది.

1917 జనవరి 28 నాటి తన టెలిగ్రాంలో భారత విదేశాంగ కార్యదర్శి లండను నుండి వచ్చిన విజ్ఞప్తి తరువాత మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాంసులోని యుద్ధభూమిలో కుకి, దాని ఉప తెగలను పోరాట దళంలో నియమించడాన్ని నిలిపివేయాలని గుర్తుచేస్తూ బ్రిటిషు వారికి వ్యతిరేకంగా నిరసనగా 1917 డిసెంబరు నెలలో మణిపూరు లోని తౌడాలు బ్రిటిషు వారి మీద బహిరంగంగా పోరాడారు. "పిబా" లేదా కుకి తెగ అధిపతులలో ఒకరైన ఐసాను అధిపతి చెంగ్జాపావో డౌంగెలు అందరికీ ఆదేశాలు పంపాడు. అవసరమైతే బ్రిటిషు వారిని బలవంతంగా ప్రతిఘటించాలని జంపి గ్రామంలో ప్రముఖ కుకి ముఖ్యుల ముఖ్యమైన సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన ముఖ్యులు:

  1. పు ఖోతింథాంగు సిత్ల్హౌ (కిల్ఖోంగు), జాంపి అధిపతి
  2. పు ఖుప్ఖోటింటాంగు (టింటాంగు) హయోకిపు
  3. పు సాంగ్చుంగు సిత్ల్హౌ, సంగ్నావో అధిపతి
  4. పు లుంఖోలాల్ సిత్ల్హౌ , చోంగ్జాంగు అధిపతి
  5. పు వుమంగులు కిప్జెన్, తుజాంగు అధిపతి
  6. పు లుంజాంగుల్ కిప్జెన్, వుమంగులు కిప్జెన్ కుమారుడు
  7. పు ఎంజకుపు ఖోల్హౌ, తేన్జాంగు అధిపతి
  8. పు లియోతాంగు హయోకిపు, గోబో అధిపతి
  9. పు మంగ్ఖో-ఆన్ హయోకిపు, టింగ్కై అధిపతి
  10. పు హెల్జాసన్ హాయోకిపు, లోయిబోలు అధిపతి
  11. పు ఓన్పిలెన్ హయోకిపు, జౌపి అధిపతి
  12. పు ఓన్పిలాల్ హయోకిపు, శాంటింగు అధిపతి
  13. పు జామ్ఖోఖపు, బోల్జాంగు అధిపతి
  14. పు గుల్జహెను హయోకిపు బోల్జాంగు అధిపతి


కుకి ముఖ్యులు ఖుప్ఖోటింటాంగు హయోకిపును యుద్ధ క్షేత్రంగా నియమించారు. జంపి అధిపతి ఖోతింతాంగు సిత్ల్హౌ (కిల్హాంగు) ముఖ్యులను అలరించడానికి ఒక మిథునును చంపాడు. "సజాం" ​​ముఖ్యులందరికి పంపిణీ చేయబడింది. ఆ విధంగా కుకి ముఖ్యుల శక్తివంతమైన కుట్ర స్థాపించబడింది. సింగ్సను అధిపతి తన వంశం (తడౌ) తరపున బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించిన గుర్తుగా మిథును తోకను కత్తిరించాడు. మణిపూరులో తిరుగుబాటు అడవి-అగ్ని వలె వ్యాపించింది. ముఖ్యంగా కుకి నివాస ప్రాంతాలలో - జంపి, దులేను సంగ్నావో, ఖౌచాంగుబుంగు పశ్చిమాన లైజాంగు; తూర్పున చసతు, మాకోటు; ఆగ్నేయంలో మొంబి, లోన్జా, నైరుతిలో హెంగ్లెపు లోయిఖై( ఉఖా).

కుకి యోధులు, శక్తివంతమైన బ్రిటీషు దళాల మధ్య చాలా నెలల పోరాటం తరువాత కుకి తిరుగుబాటు చివరకు 20 మే 1919 మే 20 న ముగిసింది. కుకిలను బ్రిటిషు పాలకులు లొంగదీసుకున్నారు. వలసరాజ్యాల అధికారులు ఈ యుద్ధాన్ని 'కుకి తిరుగుబాటు' గా నమోదు చేశారు. అస్సాం మాజీ చీఫ్ కమిషనరు సర్ నికోలర్ బీట్సను బెల్ కూడా ఆంగ్లో-కుకి యుద్ధం 1917-19 పూర్తిగా కుకీలకే పరిమితం అని చెప్పారు.

ఆధునిక చరిత్ర[మార్చు]

తడౌ[1] 1956లో భారతదేశ రాజ్యాంగం " లా నోటిఫికేషన్ ఆర్డర్ నెం. ఎస్.ఆర్.ఒ. 2477 ఎ. 29 అక్టోబర్ 1956 అక్టోబరు 29న న్యూ ఢిల్లీ ఇండియా.

కుకీల ఉప సమూహాలు (వంశాలు) ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  1. గుయితె
  2. డౌంజెలు
  3. సిత్ల్హౌ
  4. సింగుసితు
  5. ల్హౌవుం
  6. ల్హౌజెం
  7. థాంసంగు
  8. సింగ్సను
  9. సిత్కిలు
  10. చొగ్తౌ
  11. కిప్జెను
  12. హయోకిపు
  13. చాంగ్లోయి
  14. హాంగ్షింగు
  15. తౌతాంగు
  16. లొత్జెం
  17. హయోలై
  18. తుబొయి
  19. మిసావొ
  20. ఖుయోల్హౌ
  21. మాతె
  22. బైతె
  23. ల్హుంగ్డిం
  24. గైలతు
  25. కిలంగు
  26. ఇంసను
  27. జంగ్బె
  28. లెంతంగు
  29. థంగ్జియో
  30. ల్హంగు ' అం
  31. ఖొంగ్థాంగు
  32. తడౌ

వివాహం[మార్చు]

తడౌ ప్రజలలో నాలుగు రకాల వివాహాలు ఉన్నాయి: చోంగ్మౌ, సాప్సతు, జోల్-లా ', కిజాం మాంగు. తరువాతి రెండు సాప్సాటు, జోల్-లాహు పారిపోవడానికి వివాహం చేసుకునే ఆచారేతర వివాహ రూపాలు. ఈ రూపాలలో మొదటిది క్రింది అంశాలను కలిగి ఉంటుంది.

  1. వరుడి తల్లిదండ్రులు, వధువు తల్లిదండ్రుల మధ్య వధువు-ధర (కన్యాశుల్కం) చర్చలు (అయితే ఇక్కడ పేర్కొన్న 'వధువు ధర' అనే భావన 'వరకట్న వ్యవస్థ' హిందూ భావనకు చాలా భిన్నంగా ఉందని గమనించాలి)
  2. వధువు తల్లిదండ్రుల ఇంటి నుండి తన భర్త ఇంటికి బయలుదేరే తేదీని ఏర్పాటు చేయడం
  3. వధువును తన కొత్త ఇంటికి తీసుకురావడానికి బలమైన యువకులను పంపడం (వరుడి ద్వారా); కుస్తీ తరువాత ఆచార విందు.
  4. వధువుతో వరుడి ప్రతినిధుల తిరిగి వివాహానికి తరలి వెళ్ళడం

'సాప్సతు' వివాహ రూపంలో కుటుంబాల మధ్య వైవాహిక చర్చలు మాత్రమే ఉంటాయి. వివాహేతర సంబంధాల ఫలితంగా గర్భం దాల్చిన సందర్భంలో "జోల్-లా" వివాహం ఆశ్రయించబడుతుంది. ఈ సందర్భంలో వధువు-ధర (కన్యాశుల్కం) సాధారణంగా సహజీవనం ప్రక్రియకు ముందు అంగీకరించబడుతుంది. ఇది గర్భం కనుగొనబడిన వెంటనే ప్రారంభమవుతుంది. "కిజాం మాంగు" అనేది ఒక వైవాహిక ఏర్పాటు. ఇది రెండు పార్టీల యూనియన్ ఫలితంగా వధువు, వరుడు లేదా ఇద్దరి తల్లిదండ్రుల అనుమతి లేకుండా పారిపోవటం ద్వారా వస్తుంది. సహజీవనం జరిగిన తరువాత వధువు-ధర ఏదో ఒక సమయంలో పరిష్కరించబడుతుంది. వివాహానంతర నివాసం పితృస్వామ్య విధానం అనుసరించి వరుడి ఇంట్లో దంపతులు ఇద్దరూ సహజీవనం చేస్తారు. వారసత్వం అధికారం ప్రత్యేకంగా పురుషులకు (అనగా పెద్ద కుమారుడు) కేటాయించబడుతుంది. తడౌ సమాజంలో సాంఘికీకరణకు తాడో మహిళలు ముఖ్య ప్రతినిధులుగా ఉంటారు. పిల్లలు నడవడం నేర్చుకున్న తర్వాత వారికి గొప్ప స్థాయి స్వాతంత్ర్యం లభిస్తుంది. తల్లిదండ్రులు తక్కువ నిర్మాణాత్మక విద్యను అందిస్తారు. తద్వారా తడౌ బిడ్డను శిక్షణాత్మక మార్గాల ద్వారా నేర్చుకోవచ్చు.

సాహిత్యం[మార్చు]

డాక్టరు జి.సి. క్రోజియరుతో పాటు ఆయన భార్య శ్రీమతి ఎం.బి. క్రోజియరు, పు గుల్హావో థామ్సాంగు బ్రిటిషు ఫారిన్ బైబిల్ సొసైటీ నుండి అనుమతి పొందిన తరువాత బైబిల్ను ప్రత్యేకంగా తడౌలో అనువదించడానికి పూర్తి సహకారంతో పనిచేశారు. పు గుల్హావో మునుపటి రచనలు, 1) పాథెన్ లా- 1922 2) తుకిడాంగు లే కిడోన్బటు - 1924 3) పాథెన్ థు - 1925 4) జాన్ సుత్ కిపానా తుఫా- 1925 5) లంగు ఫట్వెట్- 1930, 6) రోం మైట్ హెంగా పాల్ లేఖా థాట్ - 1933.

"లేఖా బుల్: తడౌ కుకి ఫస్ట్ ప్రైమర్" మొదటి ఎడిషనును 1927 లో పు గుల్హావ్ థామ్సాంగు రాశారు.

పు లాంగ్ఖోబెలు కిలోంగు (1922) ప్రస్థుత కాలానికి చెందిన మరొక స్థానిక విద్యావేత్తగా గుర్తించబడుతున్నాడు.

మూలాలు[మార్చు]

  1. Kukis are the single largest tribe in Manipur as per population census 2011.

ఇతర వనరులు[మార్చు]

  • Shaw, William. 1929. Notes on the Thadou kuki.
  • Shakespear, J. Part I, London, 1912, The Lushai Kuki Clans. Aizawl : Tribal Research Unit.
  • Tribal Research Institute. 1994. The Tribes of Mizoram. (A Dissertation) Aizawl: Tribal Research Institute, Directorate of Art and Culture.
  • The Socio-Economics Of Linguistic Identity A Case Study In The Lushai Hills. Satarupa Dattamajumdar, Ph.D.
  • Lieut. R. Stewart in the Journal of the Asiatic Society of Bengal (1857). entitled "A slight notice of the Grammar of Thadou or New Kookie language."

వెలుపలి లింకులు[మార్చు]

మూస:Kuki-Chin-Mizo tribeshttps://www.ethnologue.com/language/tczమూస:Scheduled tribes of Indiahttps://web.archive.org/web/20191218022407/http://kukiforum.com/2004/06/the-thadous-2/%7B%7BHill tribes of Northeast India}}https://web.archive.org/web/20200229125129/https://thadoubaptistassociation.org/en/home