Jump to content

తమిళ సంస్కృతి

వికీపీడియా నుండి

తమిళ ప్రజలు అనుసరించే సంస్కృతిని తమిళ సంస్కృతి అంటారు. ఈ తమిళ సంస్కృతి ఆ ప్రజల జీవన విధానంలోనూ, వారి కళలలోనూ ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఇంకా ప్రపంచంలోని అనేక ప్రదేశాలలో నివసించే తమిళ ప్రజలు తమ సంస్కృతిని సజీవంగా కాపాడుకుకుంటున్నారు. ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర కలిగిన తమిళ సంస్కృతికి ఎంతో వైవిధ్యభరితమైన వారసత్వం కొనసాగుతోంది.

భాష, సాహిత్యం

[మార్చు]
అగస్త్యుడు, తమిళ సాహిత్యంలో మొదటి సంగం కాలానికి చెందిన కవి. [1]

తమిళులకు వారి భాషతో బలమైన అనుబంధం ఉంది, తమ సాహిత్యంలో తరచుగా " తమిళనణై ", "తమిళ తల్లి"గా తమ భాషను గౌరవిస్తారు. [2] చారిత్రాత్మకంగానే కాక, ఇప్పటికీ తమ తమిళతనాన్ని వారు ఎంతగానో గర్విస్తారు. [3] దక్షిణ భారతదేశంలోని ఇతర భాషలలాగానే, తమిళానికి ఉత్తర భారతదేశంలోని ఇండో-యూరోపియన్ భాషలతో సంబంధం లేదు. ఆంగ్ల, సంస్కృత భాషలలోని ఎన్నో పదాలను వాడే ఇప్పటి తమిళంలో ఇంకా ప్రాచీన ప్రోటో-ద్రావిడియన్ భాషకు చెందిన అనేక లక్షణాలు సురక్షితంగా ఉండడం విశేషం. ఇంకో విశేషం ఏమిటంటే ఆంగ్ల, హిందీ భాషల్లో (సంస్కృతం నుండి ఎక్కువ మూలాలు కలిగిన హిందీ, దేవనాగరి లిపిలో వ్రాయబడుతోంది) సాధారణంగా ఉపయోగించే అనేక అక్షరాలు తమిళంలో లేవు. [4] తమిళ సాహిత్యం చాలా ప్రాచీనమైనది. భారత ప్రభుత్వంచే శాస్త్రీయ భాషగా గుర్తించబడింది. సంప్రదాయ తమిళ సాహిత్యంలో గేయాల నుండి పదకవిత్వం వరకూ ఉన్న సాహిత్యంలో సింహభాగం నీతి మీదనే ఎక్కువగా ఉండడం విశేషం. ఇతర భారతీయ భాషా సాహిత్యాలలోని ప్రాచీన సాహిత్యం దగ్గర నుండి నేటి వరకూ ఈ పోకడ కలిగిన సాహిత్యం మరొకటి లేదు. అలాగే తమిళ సాహిత్యం దక్షిణతూర్పు ఆసియాలోని పురాతన సెక్యులర్ సాహిత్యంగా గుర్తించబడింది. [5]

తమిళ మత గ్రంథాలు

[మార్చు]
శ్రీరంగంలోని పరవాసుదేవ విగ్రహం ఉన్న బంగారు గోపురం, ఇతర రాజగోపురాలు.

తొల్కాప్పియం అనే తమిళ వ్యాకరణ గ్రంధంలోనూ, పట్టుప్పట్టు అనే సంగం కాలానికి చెందిన గ్రంధంలోనూ, ఎట్టుట్టొకై అనే మరో గ్రంధంలోనూ ప్రాచీన ద్రావిడ ప్రజల మతవిశ్వాసాలపై, జీవనంపై ఎన్నో విశేషాలు ఉన్నాయి. తొల్కాప్పియం గ్రంధంలో విష్ణువును తిరుమల్ అనే పేరుతో ప్రస్తావించారు. [6] [7] సంగమ యుగంలో పరమపోరుల్ ( పరమాత్మతో ఏకత్వాన్ని సాధించడం) అంటే విష్ణువును చేరడం అంటూ అభివర్ణించారు. విష్ణువునే సంగం సాహిత్యంలో మాయవన్, మామియోన్, నెతియోన్, మాల్ అని కూడా వ్యవహరించారు. [8] సంగం సాహిత్యంలో భాగమైన "ముక్కోల్ పకవర్స్" గ్రంధంలో, కేవలం వైష్ణవ సాధువులు మాత్రమే త్రిదండాన్ని పట్టుకోవాలని తెలిపారు. ఆ కాలంలో వైష్ణవం చాలా ప్రాముఖ్యత సాధించింది. తిరుమల్ "అత్యున్నత దేవత"గా కీర్తించబడ్డాడు. అతని దివ్య కమల పాదాలు అన్ని చెడులను దహించి మోక్షాన్ని ఇవ్వగలవు అంటూ ఈ సమయంలో వచ్చిన సాహిత్యం అభిప్రాయపడింది. సంగం అనంతర కాలంలో, ఆళ్వార్లు అని పిలువబడే భక్తకవులు విష్ణు ఆరాధనను మరింత కీర్తించారు. [9] [10]

ఇక తమిళులకు అత్యంత అభిమాన దేవుడు మురుగన్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తమిళులు మురుగన్ అని పిలుచుకుంటారు. ఈయనను యుద్ధానికి సంబంధించిన దేవుడిగా కీర్తించారు. మురుగన్ ఎప్పుడూ యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంటాడు అని వీరి సాహిత్యంలో అభివర్ణించారు. [11] శివన్(శివుడు) కూడా సర్వోన్నత దేవుడిగా కనిపిస్తాడు. [11] మురుగన్ [12] , శివుడు [13]ల నివాసాల గురించి ఈ సంగం సాహిత్యంలో వర్ణించిన విషయాలు, సింధు లోయ నాగరికతకు సంబంధించిన వృక్ష, జంతుజాలాలతో సరిపోవడం విశేషం.[14] [15] సంగం సాహిత్యంలో మానసిక స్థితి, వాతావరణం, ప్రదేశాలపై ఆధారపడి ప్రకృతి వర్ణనలను 5రకాలుగా చేశారు. ఈ వర్ణనలకు ఒక్కోదానికి ఒక్కో దేవుడితో ముడిపెట్టారు. విష్ణువు/తిరుమల్ ని అడవులు/ముల్లై లతోనూ, మురుగన్ ను కొండలు/కురింజిలతోనూ, ఇంద్రుడు/వెంతన్ ను మైదానాలతోనూ, కొట్రవై/అమ్మవారిని ఎడారి/పళైలతోనూ, వరుణుడు/కడలన్ ను తీరప్రాంతాలు/నైతల్ లతోనూ ముడిపెట్టారు తొల్కాప్పియం గ్రంధంలో.

కంబన్ రాసిన రామావతారం లేదా కంబ రామాయణం సుమారు 11,000 చరణాల గ్రంధం. [16] [17] రామ-అవతారం లేదా రామ-కథై అని మొదట్లో పిలవబడే ఈ గ్రంధం దేవాలయాల పవిత్ర ప్రాంగణాలలో చదవడం కోసం వైష్ణవ ఆచార్య నాథముని సమయంలో అంగీకరించబడింది. [18] కంబ రామాయణం వాల్మీకి సంస్కృత ఇతిహాసానాకి మౌఖిక అనువాదం కాదు, ఇందులో రాముని కథను తిరిగి తనదైన శైలిలో చెప్పారు కంబన్. [18]

రంగనాయకి మందిరం ఎదురుగా ఉన్న హాలులో కంబరు కంబ రామాయణం పఠించి, అందరికీ వినిపించేవారని ప్రజలు నమ్ముతారు.

ఇది కూడ చూడండి

[మార్చు]

ప్రస్తావనలు

[మార్చు]
  1. Tamil Virtual University
  2. See Sumathi Ramasamy, Passions of the Tongue, 'Feminising language: Tamil as Goddess, Mother, Maiden' Chapter 3.
  3. (Ramaswamy 1998)
  4. Kailasapathy, K. (1979), "The Tamil Purist Movement: A Re-Evaluation", Social Scientist, vol. 7, no. 10, pp. 23–51, doi:10.2307/3516775, JSTOR 3516775
  5. See Hart, The Poems of Ancient Tamil: Their Milieu and their Sanskrit Counterpart (1975)
  6. Hardy, Friedhelm (2015-01-01). Viraha Bhakti: The Early History of Krsna Devotion (in ఇంగ్లీష్). Motilal Banarsidass. p. 156. ISBN 978-81-208-3816-1.
  7. Clothey, Fred W. (2019-05-20). The Many Faces of Murukan: The History and Meaning of a South Indian God. With the Poem Prayers to Lord Murukan (in ఇంగ్లీష్). Walter de Gruyter GmbH & Co KG. p. 34. ISBN 978-3-11-080410-2.
  8. Padmaja, T. (2002). Temples of Kr̥ṣṇa in South India: History, Art, and Traditions in Tamilnāḍu (in ఇంగ్లీష్). Abhinav Publications. p. 27. ISBN 978-81-7017-398-4.
  9. Ramesh, M. S. (1997). 108 Vaishnavite Divya Desams (in ఇంగ్లీష్). T.T. Devasthanams. p. 152.
  10. Singh, Nagendra Kr; Mishra, A. P. (2005). Encyclopaedia of Oriental Philosophy and Religion: A Continuing Series-- (in ఇంగ్లీష్). Global Vision Publishing House. p. 34. ISBN 978-81-8220-072-2.
  11. 11.0 11.1 Kanchan Sinha, Kartikeya in Indian art and literature, Delhi: Sundeep Prakashan (1979).
  12. Mahadevan, Iravatham (2006). A Note on the Muruku Sign of the Indus Script in light of the Mayiladuthurai Stone Axe Discovery. harappa.com. Archived from the original on 2006-09-04.
  13. Steven Rosen, Graham M. Schweig (2006). Essential Hinduism. Greenwood Publishing Group. p. 45.
  14. Basham 1967
  15. Frederick J. Simoons (1998). Plants of life, plants of death. p. 363.
  16. Legend of Ram By Sanujit Ghose
  17. Gopal, Madan (1990). K.S. Gautam (ed.). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. p. 212.
  18. 18.0 18.1 Rays and Ways of Indian Culture By D. P. Dubey

బాహ్య లింకులు

[మార్చు]