తల్లా పెళ్ళామా
స్వరూపం
(తల్లా? పెళ్లామా? నుండి దారిమార్పు చెందింది)
తల్లా పెళ్ళామా (1970 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నందమూరి తారక రామారావు |
---|---|
నిర్మాణం | నందమూరి త్రివిక్రమరావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, చంద్రకళ, శాంతకుమారి, సత్యనారాయణ, మాష్టర్ హరికృష్ణ |
సంగీతం | టి.వి.రాజు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి |
గీతరచన | సి.నారాయణ రెడ్డి |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ కంబైన్స్ |
భాష | తెలుగు |
తల్లా పెళ్ళామా సినిమా ఎన్టీ రామారావు దర్శకత్వం, సమర్పణలో, ప్రధాన పాత్రల్లో ఆయనతో పాటుగా, చంద్రకళ, శాంతకుమారి, సత్యనారాయణ, శ్రీధర్ తదితరులు నటించిన 1970 నాటి తెలుగు సాంఘిక చిత్రం.
థీమ్స్, ప్రభావాలు
[మార్చు]తెలంగాణా ప్రాంతంలో 1969లో ప్రత్యేక తెలంగాణా కోసం జై తెలంగాణ ఉద్యమం జరగగా, 1970లో ఆంధ్ర ప్రాంతంలోనూ విభజన కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం జరిగింది. ఈ రెండు ఉద్యమాలూ ఆంధ్రప్రదేశ్ విభజన కోరుకోగా, దీన్ని వ్యతిరేకిస్తూ సమైక్యతకు మద్దతుగా సినిమాలో పాటను పెట్టారు. తెలుగు వారు సమైక్యంగా ఉండాలని ఉద్బోధిస్తూ సాగే "తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది" పాటను సి.నారాయణరెడ్డి రాస్తే, సినిమాలో సన్నివేశాన్ని కల్పించి మరీ చేర్చారు.[1]
పాటలు
[మార్చు]- ఓ బంగారు గూటిలోని చిలకా పేద ముంగిట్లో వాలేనని ఉలుకా - ఘంటసాల, పి.సుశీల , రచన: సి నారాయణ రెడ్డి
- కాలం ఈ కాలం ఒక బూ కలికాలం జట్టులాగ చెట్టులా పట్టు చిక్కక - ఎల్. ఆర్. ఈశ్వరి,రచన: సి నారాయణ రెడ్డి
- తాగితే తప్పేముంది అఫ్‌కోర్స్ తాగితే ఒకనాడు తప్పు మరి నేడో - ఘంటసాల, ఎన్.టి. రామారావు , రచన: సి నారాయణ రెడ్డి
- తెలుగు జాతి మనది నిండుగ వెలుగుజాతి మనది - ఘంటసాల, ఎన్.టి. రామారావు బృందం, రచన: సి నారాయణ రెడ్డి
- బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యం ఇది తూచా తప్పక జరిగే నవీన కాలజ్ఞానమిది - పి.సుశీల బృందం , రచన: కొసరాజు
- మమతలెరిగిన నా తండ్రి మనసు తెలిసిన ఓ నాన్న నాన్నమ్మ వచ్చావా - పి. శాంతకుమారి, రచన: సి నారాయణ రెడ్డి
- నువ్వు నవ్వు తున్నావు , మహామద్ రఫీ , ఎస్ జానకి బృందం
- మనిషి జన్మకు జ్ఞాన కాంతికి ,(పద్యం) ఘంటసాల, రచన: సి నారాయణ రెడ్డి.
మూలాలు
[మార్చు]- ↑ "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 18 August 2015.
"నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)