తవ్వా ఓబుల్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తవ్వా ఓబుల్ రెడ్డి
My profile pic gandikota valley.jpg
Tavva Obul Reddy
జననంతవ్వా ఓబుల్ రెడ్డి
భారతదేశంబక్కాయపల్లె , ఖాజీపేట మండలం, కడప జిల్లా , ఆంధ్రప్రదేశ్
నివాసంమైదుకూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా
వృత్తిప్రభుత్వ ఉపాధ్యాయుడు
రచయిత
మతంహిందూ
తల్లిదండ్రులు
  • ఓబుల్ రెడ్డి (తండ్రి)
  • గంగమ్మ (తల్లి)

తవ్వా ఓబుల్ రెడ్డి కడప జిల్లాకు చెందిన రచయిత, పాత్రికేయుడు. వీరి కథలు ప్రముఖ దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. వీరు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఇరవై కిపైగా కథలు, యాభై కవితలు, వందలాది వ్యాసాలను రచించారు. వీరు రచించిన గండికోట పుస్తకానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ రచయిత పురస్కారం లభించింది. ఓబుల్ రెడ్డి రచనలు ప్రధానంగా రాయలసీమ యాసలో సాగుతాయి. ఎక్కువగా రైతు సంబంధిత కథలు రాస్తుంటారు.

నేపథ్యము[మార్చు]

ఓబుల్ రెడ్డి కడప జిల్లా ఖాజీపేట మండలం బక్కాయపల్లె గ్రామంలో జన్మించారు. తల్లిపేరు గంగమ్మ, తండ్రి పేరు ఓబుల్ రెడ్డి. వీరు తెలుగు భాషోద్యమ కారుడిగా, చరిత్ర పరిశోధకుడిగా వ్యవహరిస్తున్నారు. పత్రికలలో అనేక సామాజిక అంశాలపై వ్యాసాలు రాస్తూ ఉంటారు. గతంలో ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికలలో సబ్ ఎడిటర్, పాత్రికేయుడిగా పనిచేసారు.

రచనలు[మార్చు]

  • గండికోట చరిత్ర[1]

మూలాలు[మార్చు]

  1. Subramanyam, M. V. (2014-07-14). "'89 historic, heritage places identified in Kadapa district'". The Hindu (in ఆంగ్లం). ISSN 0971-751X. Retrieved 2020-11-23.

బయటి లంకెలు[మార్చు]