Jump to content

తాటికొండ రమేశ్

వికీపీడియా నుండి
తాటికొండ రమేశ్‌

పదవీ కాలం
2021 మే 21 – 2024 మే 21

వ్యక్తిగత వివరాలు

జననం 10 డిసెంబర్ 1962
గోవిందరాజుల గుట్ట, వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
వృత్తి ప్రొఫెసర్

తాటికొండ రమేశ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌. ఆయన 2021, మే 21న వరంగల్‌ లోని కాకతీయ విశ్వవిద్యాలయము వైస్‌చాన్సలర్‌గా నియమితుడయ్యాడు. ఆయన ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగనున్నాడు.[1][2][3][4]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

తాటికొండ రమేశ్‌ 1962, డిసెంబరు 10న వరంగల్ జిల్లా, వరంగల్ నగరంలోని గోవిందరాజులగుట్టలో జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం, హైస్కూల్‌, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు వరంగల్లోనే పూర్తి చేశాడు. ఆయన 1987లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ సోషియాలజీ, 1990లో ఎంఫిల్‌, 2009 సంవత్సరంలో పీహెచ్‌డీ పూర్తి చేశాడు.[5]

వృత్తి జీవితం

[మార్చు]

తాటికొండ రమేశ్‌ 1992లో కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని నిర్మల్‌ పీజీ సెంటర్‌లో సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియామకమయ్యాడు. ఆయన కేయూ సోషియాలజీ విభాగాధిపతిగా, ఆర్ట్స్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌గా, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీ చైర్మన్‌గా, సోషల్‌ సైన్స్‌ డీన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. రమేశ్‌ కేయూ అకడమిక్‌ ఆడిట్‌ డీన్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో సమయంలోనే కాకతీయ విశ్వవిద్యాలయము వైస్‌చాన్సలర్‌గా నియమితుడయ్యాడు.[6]ఆయన పర్యవేక్షణలో 8మంది పీహెచ్‌డీ పూర్తి చేశారు.[7]

వైస్‌చాన్సలర్‌గా భాద్యతలు

[మార్చు]

తాటికొండ రమేశ్‌ 2021, మే 23న కాకతీయ విశ్వవిద్యాలయము 14వ వైస్ చాన్సలర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[8][9][10]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (22 May 2021). "10 వర్సిటీలకు సారథులు". Namasthe Telangana. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  2. "After two years, 10 Telangana state universities finally get new Vice-Chancellors". The New Indian Express. 23 May 2021. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  3. TV9 Telugu, TV9 (22 May 2021). "Universities Vice Chancellors: తెలంగాణలో యూనివర్సిటీల కొత్త వీసీల నియమాకం.. ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్ - telangana government announced universities new vice chancellors". TV9 Telugu. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Eenadu (23 May 2021). "TS News: 10 వర్సిటీలకు కొత్త వీసీలు". EENADU. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  5. Namasthe Telangana, వరంగల్ (22 May 2021). "కేయూ వీసీగా తాటికొండ రమేశ్‌". Namasthe Telangana. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  6. TV9 Telugu (23 May 2021). "కాకతీయ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా ఓరుగల్లు వాస్తవ్యుడు.. ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ నియామకం - Kakatiya University to get new vice chancellor PROFESSOR Thatikonda Ramesh". TV9 Telugu. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Sakshi (22 May 2021). "TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం". Sakshi. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  8. Telangana Today (23 May 2021). "Prof T Ramesh takes charge as 14th Vice-Chancellor of Kakatiya University". Telangana Today. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  9. Eenadu, Warangal (23 May 2021). "మూడింటిపై దృష్టి". EENADU. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  10. Andhrajyothy (23 May 2021). "కేయూ వీసీగా రమేశ్‌ బాధ్యతల స్వీకరణ". www.andhrajyothy.com. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.