తాడిగిరి పోతరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాడిగిరి పోతరాజు
జననంతాడిగిరి పోతరాజు
(1937-05-02) 1937 మే 2
భారతదేశం అత్తిలి గ్రామం ,తాడికొండ మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియా
మరణం2015 జనవరి 09
కరీంనగర్
మరణ కారణముఅనారోగ్యం
నివాస ప్రాంతంకోతుల నడుమ గ్రామం ,ఎల్కతుర్తి మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ఇండియా
వృత్తిఅధ్యాపకుడు
రచయిత
మతంహిందూ
భార్య / భర్తకాత్యాయని
పిల్లలు3 కుమార్తెలు, 1 కుమారుడు
తండ్రిరాయపరాజు
తల్లిసారమ్మ

తాడిగిరి పోతరాజు తొలితరం విప్లవ కథారచయిత[1].

జీవిత సంగ్రహం[మార్చు]

ఇతడు 1937 మే 2వ తేదీన సారమ్మ, రాయపరాజు దంపతులకు జన్మించాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ దగ్గరలోని ఎల్కతుర్తి మండలం కోతుల నడుమ ఇతని స్వగ్రామం. పోతరాజుకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఇతడు భారతి, విద్యుల్లత, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, స్వాతి, రచన, విశాలాంధ్ర, జ్యోతి, విపుల, నవ్య, చుక్కాని, పుస్తకం, యువ, చినుకు, ప్రతిభ, సృజన పత్రికల్లో కథలు రాశాడు. పలు కథలకు బహుమతులు అందుకున్నాడు. విప్లవ రచయితల సంఘం (విరసం), ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఎపిసిఎల్‌సి) లో ఈయన కొంతకాలం పనిచేశాడు. అత్యవసర పరిస్థితి కాలంలో ఇతడు జైలుకు వెళ్లాడు. కరీంనగర్, హుజూరాబాద్‌లలో ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేసి 1995లో ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశాడు. 1969 తెలంగాణ ఉద్యమంలోను, 1970 నక్సల్బరీ పోరాటంలోను, 1975 ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలోను ప్రత్యక్షంగా పాల్గొన్నాడు.[2] 1958 నుంచి ఇతడు కథారచన చేస్తున్నాడు. 1962లో ఇతని నవలిక పావురాలు భారతి పత్రికలో అచ్చయింది. ఇతడు రచించిన గాజుకిటికీ కథ ప్రముఖ కథారచయిత త్రిపుర ప్రశాలు పొందింది. పోతరాజు మట్టిబొమ్మలు అనే నవల కూడా రాశాడు. 2010లో ఇతని కథాసంకలనం కేటిల్ విడుదలైంది. ఇతడు 2015, జనవరి 9వ తేదీ కరీంనగర్లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు[3].

రచనలు[మార్చు]

కథలు[మార్చు]

 1. అతను ఇకలేడు
 2. అమ్మ[4]
 3. ఆరోహక గీతం
 4. ఆశల వాన
 5. ఇంకా తెల్లవారలేదు
 6. ఉదయించని ఉదయం
 7. ఎండమావులు
 8. ఎర్రబుట్ట
 9. ఐదు నిమషాలు
 10. కెటెల్
 11. గాజుకిటికి
 12. గృహోన్ముఖుడు[5]
 13. చితినెగళ్ళు
 14. చేదునిజం
 15. జిల్లేళ్లు
 16. నిరవధిక నిరీక్షణ[6]
 17. నెమిసిస్
 18. పరాజితులు
 19. పావురాలు[7]
 20. పావులు
 21. పెళ్ళికాని తల్లి
 22. బోయలు
 23. బ్లాక్‌ అండ్‌ వైట్‌
 24. భస్నాలాలో తొలిపొద్దు
 25. మయసభ
 26. ముప్పయి-నిమషాలు
 27. ముష్టివాళ్లు
 28. రాజు-రాణి
 29. రెప్పలు...
 30. లోయలు
 31. వాన
 32. వాన వెలిసింది
 33. వి.ఐ.పి[8]
 34. విలాపాగ్నులు
 35. శకలాల క్రింద
 36. శిక్ష[9]
 37. శెలవు
 38. సముద్రం
 39. సర్టిఫికేటు నవ్వింది
 40. సృష్టి
 41. స్నేహానికి వడ్డీ
 42. హిస్టీరామా

కథాసంపుటాలు[మార్చు]

 1. కెటిల్ (ఎమర్జెన్సీ కథలు)
 2. గాజుకిటికీ

నవలలు[మార్చు]

 1. మట్టిబొమ్మలు

నాటికలు[మార్చు]

 1. త్యాగశీలి

మూలాలు[మార్చు]

 1. ఎడిటర్ (09-01-2015). "విప్లవ కథారచయిత తాడిగిరి పోతరాజు మృతి". వన్ ఇండియా. Retrieved 9 January 2015. Check date values in: |date= (help)
 2. ఎడిటర్ (10-01-2015). "'గాజు కిటికీ' పోతరాజు మృతి". ఆంధ్రజ్యోతి. Retrieved 10 January 2015. Check date values in: |date= (help)
 3. ఎడిటర్ (జనవరి 09, 2015). "ఉద్యమనేత పోతరాజు అస్తమయం". నమస్తే తెలంగాణ. Retrieved 9 January 2015. Check date values in: |date= (help)
 4. తాడిగిరి, పోతరాజు. "అమ్మ". కథానిలయం. కథానిలయం. Retrieved 9 January 2015.
 5. తాడిగిరి, పోతరాజు (డిసెంబరు 1959). "గృహోన్ముఖుడు". భారతి. 36 (12): 13–24. Retrieved 10 January 2015. Check date values in: |date= (help)
 6. తాడిగిరి, పోతరాజు. "నిరవధిక నిరీక్షణ". కథాజగత్. కోడీహళ్లి మురళీమోహన్. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 9 January 2015.
 7. తాడిగిరి, పోతరాజు (ఆగస్టు 1962). "పావురాలు". భారతి. 39 (8): 30–43. Retrieved 10 January 2015.
 8. తాడిగిరి, పోతరాజు (మార్చి 1968). "వి.ఐ.పి". భారతి. 45 (3): 27–32. Retrieved 10 January 2015.
 9. తాడిగిరి, పోతరాజు (సెప్టెంబరు 1966). "శిక్ష". భారతి. 43 (9): 19–28. Retrieved 10 January 2015. Check date values in: |date= (help)