Jump to content

తార్సర్ సరస్సు

అక్షాంశ రేఖాంశాలు: 34°8′24″N 75°8′53″E / 34.14000°N 75.14806°E / 34.14000; 75.14806
వికీపీడియా నుండి
తార్సర్ సరస్సు
తార్సర్ సరస్సు is located in Jammu and Kashmir
తార్సర్ సరస్సు
తార్సర్ సరస్సు
ప్రదేశంఅరు,అనంతనాగ్ జిల్లా,కాశ్మీరు లోయ,జమ్మూ కాశ్మీరు,భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు34°8′24″N 75°8′53″E / 34.14000°N 75.14806°E / 34.14000; 75.14806
సరస్సులోకి ప్రవాహంమంచు కరగటం
వెలుపలికి ప్రవాహంలిడర్ నది
గరిష్ట పొడవు2 కిలోమీటర్లు (1.2 మై.)
గరిష్ట వెడల్పు0.8 కిలోమీటర్లు (0.50 మై.)
ఉపరితల వైశాల్యం2 కి.మీ2 (0.77 చ. మై.)
ఉపరితల ఎత్తు3,795 మీటర్లు (12,451 అ.)
ఘనీభవనండిసెంబర్ నుండి మార్చి

తార్సర్ సరస్సు జమ్మూ కాశ్మీర్ లోని కాశ్మీర్ లోయలో గల అనంతనాగ్ జిల్లాలోని అరు ప్రాంతంలో ఉంది. తార్సర్-మార్సర్ సరస్సులు కాశ్మీర్ లోయలో గల అత్యంత ప్రసిద్ధమైన జంట సరస్సులు. [1][2]

ప్రత్యేకత

[మార్చు]

మార్సర్ సరస్సు నుండి ఈ సరస్సు 4,000 మీటర్ల(13,000 అడుగులు) ఎత్తులో ఉన్న పర్వతంతో వేరు చేయబడి ఉంటుంది. ఈ రెండు సరస్సుల సామీప్యత, సారూప్య భౌతిక లక్షణాల కారణంగా, రెండు సరస్సులను జంట సోదరీమణులు అని పిలుస్తారు. ఈ రెండు సరస్సులు అనేక సంవత్సరాలుగా ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా పేరు పొందాయి. ఇది తార్సర్-మార్సర్ ట్రెక్ అనే పేరుతో కాశ్మీర్ లోయలో అత్యంత ప్రసిద్ధమైన ట్రెక్‌లలో ఒకటిగా ప్రసిద్ది చెందింది. 16 వ శతాబ్దపు కశ్మీరీ పాలకుడు యూసుఫ్ షా చాక్ తన కవిత్వంలో ఈ జంట సరస్సులను పేర్కొన్నాడు. [3][4] ఈ సరస్సు నుండి వచ్చిన ప్రవాహం దీనికి తూర్పున 15 కిమీ దూరంలో ఉన్న లిడర్‌వాట్ వద్ద లిడర్ నదిలో కలుస్తుంది.[4][5]

భౌగోళికం

[మార్చు]

శీతాకాలంలో, తార్సర్ సరస్సు గడ్డకడుతుంది, భారీ మంచుతో కప్పబడి ఉంటుంది. ఇది వేసవిలో కూడా తేలియాడే మంచును కలిగి ఉంటుంది. ఈ సరస్సు చుట్టూ అనేక రకాల పూల మొక్కలు వికసించి ఉంటాయి. హెడీసరం అని పిలువబడే పువ్వులు వసంత ఋతువు చివరలో సరస్సు చుట్టూ ఉన్న ప్రాంతమంతటా కనిపిస్తాయి.

పక్షులు

[మార్చు]

ఇక్కడికి వేసవికాలంలో అనేక రకాల వలస పక్షులు వస్తాయి వీటిలో బార్-హెడ్ గీస్, లామర్‌గేయర్‌లు, హిమాలయన్ డేగలు, బ్లాక్ బుల్బుల్స్ ముఖ్యమైనవి.[6][7]

ప్రయాణం

[మార్చు]

తార్సర్ సరస్సు జూన్ నుండి సెప్టెంబర్ మధ్య గల వేసవి సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. శీతాకాలంలో, భారీ మంచు కారణంగా ట్రెక్‌లు మూసివేయబడతాయి. దీనిని శ్రీనగర్ నుండి అనంతనాగ్, పహల్గామ్ మీదుగా అరు ట్రెక్కింగ్ క్యాంప్‌కు వెళ్లే 102 కిమీల రోడ్డు ద్వారా చేరుకోవచ్చు.

మరో మార్గం గందర్‌బల్ గుండా వెళుతుంది. ఈ మార్గం సింద్ వ్యాలీలోని సర్‌ఫ్రా వద్ద ప్రారంభం అవుతుంది. ఈ ట్రెక్ నిటారుగా ఉన్న కారణంగా, అరు-లిడ్డెర్వాట్ ట్రెక్ ద్వారా సరస్సును చేరుకోవడం, సర్ఫ్రా సింద్ వ్యాలీ ట్రెక్ ద్వారా తిరిగి రావడం ఉత్తమం.

ఇంకో మార్గం శ్రీనగర్ మీదుగా ఉంది. ఈ మార్గం మార్సర్ సరస్సు వరకు ఉంటుంది. అక్కడి నుండి 4200 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాన్ని దాటి తార్సర్ సరస్సును చేరుకోవచ్చు.[8]

మూలాలు

[మార్చు]
  1. Dr Shiv Sharma (2008). India—A Travel Guide. Diamond Pocket Books (P) Ltd. pp. 209–. ISBN 9788128400674.
  2. Parmanand Parashar (2004). Kashmir The Paradise Of Asia. Sarup & Sons, 2004. p. 97. ISBN 9788176255189. Retrieved 17 December 2012.
  3. S. Maqbul Ahmad (1984). Historical geography of Kashmir: based on Arabic and Persian sources from A.D. 800 to 1900. Ariana Pub. House, 1984. p. 155. ISBN 9788176487863. Retrieved 16 December 2012.
  4. 4.0 4.1 S. L. Sadhu (2004). Eng Hali (15). Sahitya Akademi. p. 28. ISBN 9788126019540.
  5. "Pahalgam page JKTDC". jktdc.in. Archived from the original on 2013-01-26. Retrieved 2012-12-06.
  6. S. R. Bakshi (1997). Kashmir: History and People Volume 1 of Kashmir Through Ages. Sarup & Sons. pp. 6–. ISBN 9788185431963. fish alpine lakes kashmir tarsar.
  7. Michael Shaw (2008). In Search of Time Wasted: Peregrinations from Seil Island. AuthorHouse. pp. 117–. ISBN 9781434344434.
  8. "Tarsar Marsar Twin Lakes Pahalgam Trek By Kashmir Treks". Kashmir Treks (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-11-07.