Jump to content

తిక్కా ఆకుమచ్చ తెగులు

వికీపీడియా నుండి

వేరుశనగ పంటలో ముఖ్యంగా తిక్కా ఆకుమచ్చ తెగులు పంటను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. ఈ తెగులు సర్కొస్పోర అరచిడికోల అనే శిలీంద్రం ద్వారా పంటẾకు వ్యాపిస్తుంది. ఈ తిక్క ఆకుమచ్చ తెగులు 2 రకాలు.[1]

వేరుశెనగ పైరుకు తెగులు

ముందుగా వచ్చే ఆకు మచ్చ తెగులు

[మార్చు]

లక్షణాలు

[మార్చు]

వేరుశెనగ పైరుకు ముందుగా ఈ ఆకుమచ్చ తెగులు సోకుతుంది. కాబట్టి దీనిని ముందుగా వచ్చే ఆకు మచ్చ తెగులు అంటారు . పైరుపై ఈ తెగులు విత్తిన 30 రోజులు తరువాత కనిపిస్తుంది. మొదట ఆకుల పైన చిన్న చిన్న మచ్చలు ఏర్పడును . ఇవి పెరిగి గుండ్రటి 1-10 మిల్లీ మీటర్ల ల వ్యాసం గల గోధుమ వర్ణంగల నల్లటి మచ్చలు ఏర్పడతాయి . ఈ మచ్చ చుట్టూ పసుపు పచ్చని వలయం ఉన్న మచ్చలు ఆకుల పై భాగాన నిర్దిష్టంగా కనిపించును . ఈ శిలీంద్రపు బీజాలు మచ్చపై భాగాన పెరగడం చేత మచ్చలకు నలుపు వర్ణం ఏర్పడును . ఈ మచ్చలు ఆకు అంతటా వ్యాపించి ఆకులు ఎండి రాలిపోవును . ఈ శిలీంధ్రం ఆకు తొడిమె, కాండపు భాగాన్ని కూడా ఆశిస్తుందిి.

ఆలస్యంగా వచ్చే ఆకు మచ్చ తెగులు

[మార్చు]

లక్షణాలు

[మార్చు]

ఈ తెగులు పంట విత్తిన 40-45 రోజుల తరువాత వేరుశనగ పైరు పై ఈ తెగులు లక్షణాలు కనపడతాయి . ఆకులపైన నిర్దరితమైన చిన్న చిన్న మచ్చలు ఏర్పడి అవి పెరిగి గుండ్రంగా మారి నలుపు లేదా ముదురు గోధుమ వర్గానికి మారును . సామాన్యంగా ఈ మచ్చల చుట్టూ పసుపు పచ్చని పలయాలు ఉండవు . ఆకు, అడుగు భాగాన శిలీంధ్ర బీజాల పెరుగుదల వలన నల్లటి మచ్చలు అగుపడును . ఈ మచ్చలలో శిలీంద్రబీజాల వలయాలుగా ఉండును . ఈ శిలిద్ధం ఆకు తొడిమె, కాండాన్ని కూడా ఆశించును . ఈ ఆకు మచ్చ తెగులు వాతావరణంలో అధిక తేమ కలిగి ఉండి ఉష్ణోగ్రత 26-30సెం.గ్రే, ఉన్నపుడు, వేరుశనగ తరువాత వేరుశనగ వేసినప్పుడు, తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.[2]

వ్యాప్తి

[మార్చు]

ఇది విత్తనాలలోను, పంట అవశేషాలలో జీవిస్తుంది . గాలి ద్వారా ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది .

యాజమాన్య పద్ధతులు

[మార్చు]

1.ఆరోగ్యవంతమైన విత్తనానాన్ని ఎన్నుకోవాలి.

2.విత్తనం విత్తేముందు బీజామృతంతో విత్తనశుద్ధి చేయాలి.

3.తెగులును తట్టుకొనే రకాలైన వేమన, నవీన్, తిరుపతి - 3 వంటి రకాలను విత్తుకోవాలి

నివారణ

[మార్చు]

సేంద్రియ నివారణ

[మార్చు]

1. 6లీ. పుల్లటి మజ్జిగను 100 లీ. నీటిలో కలిపి ఎకరా పొలంలో పిచికారి చేయాలి.

2.4లీ. శొంఠి పాల కషాయాన్ని 200 లీ. నీటికి కలిపి ఎకరా పొలంలో పిచికారి చేయాలి.

రసాయన నివారణ

[మార్చు]

1.కార్బండిజం, మాంకోజెట్ ను పొలం పై పిచికారి చేయాలి.[3]

మూలాలు

[మార్చు]
  1. "తెగుళ్ల నివారణ". వ్యవసాయ శాఖ తెలంగాణ. Archived from the original on 2021-05-16. Retrieved 2021-05-23.
  2. "వేరు శనగకు వైరస్ తెగులు". ప్రజా శక్తి jan 2, 2020.
  3. వివిధ పంటలకు వచ్చే చీడ పీడలు వాటి యాజమాన్య పద్ధతులు. ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయం.