తిమ్మ‌రుసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిమ్మరుసు
Thimmarusu poster.jpg
దర్శకత్వంశరణ్‌ కొప్పిశెట్టి
కథా రచయితశరణ్‌ కొప్పిశెట్టి
నిర్మాతమ‌హేశ్ కోనేరు, శృజ‌న్ యెర‌బోలు
తారాగణంసత్యదేవ్ కంచరాన, ప్రియాంక జ‌వాల్క‌ర్
నిర్మాణ
సంస్థలు
ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌
విడుదల తేదీ
30 జూలై 2021
దేశంభారతదేశం
భాషతెలుగు

తిమ్మరుసు ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా.[1] మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలో స‌త్య‌దేవ్ అడ్వ‌కేట్ పాత్ర‌లో నటించాడు. ఈ చిత్రంలో ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్‌ గా నటించింది. శ్రీ చరణ్‌ పాకాల సంగీతాన్ని అందించాడు.[2]ఈ సినిమాను 2021 మే 21న విడుదల చేయాలనుకున్నారు, కరోనా కారణంగా సినిమా విడుదలను వాయిదా వేసి [3], 30 జూలై 2021న విడుదల చేశారు.

క‌థ‌[మార్చు]

రామచంద్రం అలియాస్‌ రామ్‌(సత్యదేవ్‌) రావ్ అసోసియేట్స్ అనే త‌న కంపెనీ ద్వారా ఎన్నో కేసుల‌ను వాదించిన నిజాయితీపరుడైన లాయర్‌. పెద్ద కేసును ఛేదించి న్యాయవాదిగా తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నంలో ఉంటాడు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన క్యాబ్‌ డ్రైవర్‌ మర్డర్‌ కేసును రీఓపెన్‌ చేస్తాడు. ఈ హత్యలో నిందుతుడిగా 22 ఏళ్ల కుర్రాడు (అంకిత్ కొయ్య) ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తాడు. ఈ కేసును రీఓపెన్‌ చేయించిన రామ్‌కు ప్రత్యర్థుల నుంచి అడుగడుగున అడ్డంకులు ఎదురవుతుంటాయి. అస‌లు క్యాబ్ డ్రైవ‌ర్‌ని చంపి వాసుని ఆ కేసులో ఇరికించిందెవ‌రు? వాళ్ల‌ని రామ్ ఎలా బ‌య‌టికి తీసుకొచ్చాడు? అనేదే మిగతా సినిమా కథ.[4][5]

నటవర్గం[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: యూవీ క్రియేషన్స్‌
  • నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి
  • సంగీతం: శ్రీచరణ్ పాకాల
  • సినిమాటోగ్రఫీ: అప్పు ప్రభాకర్‌
  • ఎడిటర్‌ : తమ్మి రాజు

మూలాలు[మార్చు]

  1. The Hans India (5 December 2020). "First Look of Satyadev's 'Thimmarusu' released" (in ఇంగ్లీష్). Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
  2. నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ (31 March 2021). "స‌త్య‌దేవ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!". Namasthe Telangana. Archived from the original on 31 మార్చి 2021. Retrieved 31 March 2021.
  3. Andhrajyothy (8 May 2021). "'తిమ్మరుసు' ఓటీటీలో రానుందా..?". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
  4. EENADU (30 July 2021). "Thimmarusu Review: రివ్యూ: తిమ్మరుసు - satyadev thimmarusu telugu movie review". Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.
  5. Andrajyothy (30 July 2021). "'తిమ్మరుసు' రివ్యూ". Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.
  6. "Talented actor Satya Dev kicks off the regular shoot of 'Thimmarusu' - Times of India". The Times of India. Retrieved 31 March 2021.
  7. "Satyadev and Priyanka Jawalkar's BTS picture from the sets of 'Thimmarusu' is unmissable - Times of India". The Times of India. Retrieved 31 March 2021.

బయటి లంకెలు[మార్చు]