తిరువారూర్ వైద్యనాథన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరువారూర్ వైద్యనాథన్
వ్యక్తిగత సమాచారం
జననం (1963-05-11) 1963 మే 11 (వయసు 60)
తిరువారూర్ , తమిళనాడు, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిమృదంగ వాద్య కళాకారుడు
వాయిద్యాలుమృదంగం
వెబ్‌సైటుtiruvarurvaidy.com

తిరువారూర్ వైద్యనాథన్ (తమిళం: திருவாரூர் வைத்தியநாதன்) ఒక భారతీయ మృదంగ వాద్య కళాకారుడు.

విశేషాలు[మార్చు]

ఇతడు 1963, మే 11న తమిళనాడు రాష్ట్రం తిరువారూర్ పట్టణంలో ఒక మృదంగ కళాకారుల కుటుంబంలో జన్మించాడు. ఇతడు తన తాత తిరువారూర్ కుంజు అయ్యర్, బాబాయి తిరువారూర్ నాగరాజన్‌ల వద్ద మృదంగం నేర్చుకున్నాడు. తరువాత ఈ విద్యలో మెలకువలను కారైకుడి మణి వద్ద అభ్యసించాడు.[1]

ఇతడు శ్రీలంక, యు.ఎ.ఇ., ఖతర్, సౌదీ అరేబియా, ఒమన్, సింగపూర్, మలేసియా, బ్రిటన్, అమెరికా వంటి 20కు పైగా దేశాలను సందర్శించి సంగీత కచేరీలలో పాల్గొన్నాడు.

ఇతడు ప్రక్కవాద్యంగా మృదంగ వాద్య సహకారం అందించిన అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసులలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మహారాజపురం సంతానం, కె.వి.నారాయణస్వామి, డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎల్.వసంతకుమారి, టి.ఎన్.కృష్ణన్, ఉప్పలపు శ్రీనివాస్, టి.వి.శంకరనారాయణన్, కె. జె. ఏసుదాసు, ఎన్.రవికిరణ్, సుధా రఘునాథన్, అరుణా సాయిరాం మొదలైన వారున్నారు.

పురస్కారాలు[మార్చు]

వివాదాలు[మార్చు]

#మీటూ ఉద్యమంలో భాగంగా తన శిష్యురాళ్ళతో, తోటి కళాకారిణులతో ఇతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల పర్యవసానంగా మద్రాసు సంగీత అకాడమీ 2018 డిసెంబరులో జరిగిన సంగీతోత్సవాలలో ఆరోపణలు ఎదుర్కొన్న 6గురు కళాకారులతో పాటు ఇతడి సంగీత కచేరీలను కూడా రద్దు చేసింది.[2][3][4]

మూలాలు[మార్చు]

  1. "Tiruvarur Vaidyanathan Profile." Tiruvarur Vaidyanathan. Priyalal, n.d. Web. <http%3A%2F%2Fwww.tiruvarurvaidy.com%2Fprofile.php>.
  2. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 828: Argument map not defined for this variable: LayDate.
  3. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 828: Argument map not defined for this variable: LayDate.
  4. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 828: Argument map not defined for this variable: LayDate.