Jump to content

తుంగభద్ర ఆనకట్ట

వికీపీడియా నుండి
(తుంగభద్ర జలవిద్యుత్ కేంద్రం నుండి దారిమార్పు చెందింది)
తుంగభద్ర డ్యామ్

తుంగభద్ర ఆనకట్టను కృష్ణా నదికి ఉపనదియైన తుంగభద్ర నదిపై నిర్మించారు.[1][2]ఆనకట్ట కర్నాటకలోని హోస్పేట్ పట్టణానికి సమీపంలో ఉంది. ఇది ఒక బహుళార్ధసాధక ఆనకట్ట, ఇది నీటిపారుదలకు, విద్యుత్ ఉత్పత్తికి, వరదలను నియంత్రించేందుకు ఇంకా తదితర సేవలకు ఉపయోగపడుతుంది. దీని నిర్మాణం 1943లో ప్రారంభమైనప్పుడు అప్పటి హైదరాబాద్ రాష్ట్రం, అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీల యొక్క ఒక ఉమ్మడి ప్రాజెక్టు. తరువాత 1953లో దీని నిర్మాణం పూర్తయిన తరువాత ఇది కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల యొక్క ఉమ్మడి ప్రాజెక్టుగా మారింది. ఈ ఆనకట్ట యొక్క ప్రధాన ఆర్కిటెక్ట్ డాక్టర్ తిరుమలై అయ్యంగార్, ఇతను మద్రాస్ కు చెందిన ఒక ఇంజనీరు.

కర్నాటకలోని బళ్లారి, రాయచూరు, ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు, అనంతపూర్ జిల్లాలకు నీటిని అందించేందుకు వీలుగా ఈ డ్యాం నుంచి లోలెవల్, హైలెవల్, లెఫ్ట్ బాంక్ కెనాల్స్ నిర్మించారు. ముఖ్యంగా లోలెవల్స్ అంటే ఎల్ ఎల్ సి కెనాల్ ను కర్నూలు జిల్లాకు తాగునీరు అందించేందుకు నిర్మించారు. ఖరీఫ్, రబీ సీజన్ లో ఎల్‌ఎల్‌సి కాలువ కింద సుమారు లక్షా 52 వేల ఎకరాల ఆయకట్టు ఉంది, 200 గ్రామాలకు తాగునీరు కూడా అందుతుంది.

సాంకేతిక వివరాలు

[మార్చు]

ఈ ఆనకట్ట తుంగభద్ర నదిపై, పూర్తి రిజర్వాయర్ స్థాయి ( ఎఫ్.ఆర్.ఎల్) 498 మీటర్ల ఎం.ఎస్.ఎల్ వద్ద, స్థూల నిల్వ సామర్థ్యం 101 వేల మిలియన్ క్యూబిక్ అడుగుల (టిఎంసి) తో, 378 చదరపు కిలోమీటర్ల నీటి విస్తృత ప్రాంతాన్ని కలిగిన ఒక పెద్ద జలాశయాన్ని సృష్టించింది.[3][4] ఈ ఆనకట్ట దాని లోతైన పునాది పైన 49.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. పూర్తిగా కర్నాటక రాష్ట్రంలో నీటిపారుదలకు రిజర్వాయర్ సరఫరా నీటిని వెలువరించేవి ఎడమ కాలువలు.కర్నాటకకు, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాలకు నీటిపారుదల సౌకర్యానందించేందుకు తక్కువ స్థాయిలో ఒకటి, అధిక స్థాయిలో మరొకటి రెండు కుడి బ్యాంకు కాలువలు నిర్మించబడ్డాయి.

తుంగభద్ర జలవిద్యుత్ కేంద్రం

[మార్చు]

తుంగభద్రా నదిపై గల ఆనకట్టవద్ద నిర్మింపబడిన జలవిద్యుత్ కేంద్రం ఇది. ఆనకట్టవద్ద ఒకకేంద్రం, తుంగభద్ర కాలువపై హంపి వద్ద మరొకటిగా నిర్మించిన ఈ కేంద్రాల పదకాన్ని ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టి 80-20 నిష్పత్తిలో ప్రాజెక్ట్ ఖర్చును భరించాయి. విద్యుత్ వినియోగంలో కూడా అదే నిష్పత్తిలో వాడుకొనటం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ 1957 నుండి పని చేయడం ప్రారంభమయినది. ఇక్కడి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కడప, అనంతపూర్, చిత్తూరు జిల్లాలలో వినియోగిస్తున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. https://en.wikipedia.org/wiki/Tungabhadra_Dam
  2. "Map of Krishna River basin" (PDF). Archived from the original (PDF) on 2017-08-06. Retrieved 2014-11-07.
  3. "KWDT-1 and KWDT-2 reports". Archived from the original on 2006-05-19. Retrieved 2014-11-07.
  4. Blue Print for Godavari River Water Utilization in Andhra Pradesh

బయటి లింకులు

[మార్చు]