తుమ్మగుంట (కనిగిరి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తుమ్మగుంట
రెవిన్యూ గ్రామం
తుమ్మగుంట is located in Andhra Pradesh
తుమ్మగుంట
తుమ్మగుంట
అక్షాంశ రేఖాంశాలు: 15°24′11″N 79°30′07″E / 15.403°N 79.502°E / 15.403; 79.502Coordinates: 15°24′11″N 79°30′07″E / 15.403°N 79.502°E / 15.403; 79.502 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకనిగిరి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,482 హె. (3,662 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,936
 • సాంద్రత130/కి.మీ2 (340/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08402 Edit this at Wikidata)
పిన్(PIN)523230 Edit this at Wikidata

తుమ్మగుంట, ప్రకాశం జిల్లా, కనిగిరి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 230.ఎస్.టి.డి.కోడ్ = 08402.

  • తుమ్మగుంట గ్రామానికి చెందిన శ్రీ మర్రి రమణయ్య,మల్లీశ్వరి దంపతులు నిరుపేద ముఠా కూలీలు. ఈ గ్రామం ఉన్న ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. అందులో ఫ్లోరైడు పీడిత ప్రాంతం. చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరగటం, గుల్లబారడం ఇక్కడ నిత్యకృత్యం. ఇలాంటి మట్టిలో, ఈ దంపతుల ఇంట ఒక మాణిక్యం పుట్టింది. ఆమె పేరు భాగ్యలక్ష్మి. ఎలాంటి వసతులులేకున్నా, నిరంతర కఠోర సాధనతో ఈమె పవర్ లిఫ్టింగులో, పట్టు సాధించింది. కనిగిరి, గుంటూరులలో శిక్షణ పొందుతున్న ఈమె, ఇంతవరకూ, 16 జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగు పోటీలలో పాల్గొని పతకాలు సాధించింది. తాజాగా ఈమె, 2014,మార్చి-1 నుండి కోయంబత్తూరులో జరుగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల స్థాయి పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనది. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,936 - పురుషుల సంఖ్య 960 - స్త్రీల సంఖ్య 976 - గృహాల సంఖ్య 389

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,244. ఇందులో పురుషుల సంఖ్య 582, మహిళల సంఖ్య 662, గ్రామంలో నివాస గృహాలు 251 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,482 హెక్టారులు.[2]

సమీప గ్రామాలు[మార్చు]

శంకవరం 3 కి.మీ,చాకిరాల 4 కి.మీ,చళ్లగిరిగల 7 కి.మీ,పునుగోడు 7 కి.మీ,దిరిసవంచ 9 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన హనుమంతునిపాడు మండలం,దక్షణానపెదచెర్లోపల్లి మండలం,పశ్చిమాన వెలిగండ్ల మండలం,తూర్పున మర్రిపూడి మండలం.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://www.onefivenine.com/india/villages/Prakasam/Kanigiri/Tummagunta

వెలుపలి లంకెలు[మార్చు]

[3] ఈనాడు ప్రకాశం; 2014,జనవరి-31; 8వ పేజీ