తుమ్మూరు (గ్రామీణ)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తుమ్మూరు (r)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం నాయుడుపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,372
 - పురుషుల సంఖ్య 3,178
 - స్త్రీల సంఖ్య 3,194
 - గృహాల సంఖ్య 1,708
పిన్ కోడ్ 524 126
ఎస్.టి.డి కోడ్ 08623

తుమ్మూరు (r), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నాయుడుపేట మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్ నం. 524 126., ఎస్.టి.డి. కోడ్ = 08623.

  • నాయుడుపేట పట్టణం బాగా విస్తరించటం వల్ల తుమ్మూరు ప్రస్తుతం పట్టణంలో ఒక భాగంగా మారిపోయింది.

గ్రామనామ వివరణ[మార్చు]

తుమ్మూరు గ్రామం పేరుకు అర్థం చెప్పే క్రమంలో ఒక పండిత లోక నిరుక్తి (ఫోక్ ఎటిమాలజీ) ఉంది. తుమ్మూరు అన్న పదానికి పురాణపురుషుడైన తుంబురునితో సంబంధం కల్పిస్తూన్న కథ ఒకటి ఉంది. ఆ కథ ప్రకారం స్వర్ణముఖీనదీ తీరాన ఉన్న ఈ గ్రామానికి పూర్వం నారద-తుంబురులు వచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కంచిలో వరదరాజస్వామి గరుడోత్సవం చూసేందుకు నారదుడు ఒక్కడే వెళ్ళాడు. తుంబురుడు ఈ గ్రామంలోనే ఆగి స్వర్ణముఖీనది ఒడ్డునున్న ఇసుకతో వరదరాజస్వామి ప్రతిమ తయారుచేసి ఇక్కడే పూజించాడనీ, అందుకే తుంబూరు అనే పేరు వచ్చిందనీ అంటారు. తుంబూరు అనే పేరు కాలక్రమేణా తుమ్మూరుగా మారినట్లుగా పండిత నిరుక్తి.[2]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ కరిమాణిక్యస్వామివారి ఆలయం;- ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ మాసం (మే నెల) లో పౌర్ణమి సందర్భంగా నిర్వహించెదరు.[3]

కోడ్స్[మార్చు]

  • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 6,372 - పురుషుల సంఖ్య 3,178 - స్త్రీల సంఖ్య 3,194 - గృహాల సంఖ్య 1,708

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 39
  3. ఈనాడు నెల్లూరు; మే-13,2014; 11వ పేజీ