సూళ్లూరుపేట

వికీపీడియా నుండి
(సూళ్ళూరుపేట నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పట్టణం
నిర్దేశాంకాలు: 13°42′N 80°00′E / 13.7°N 80°E / 13.7; 80Coordinates: 13°42′N 80°00′E / 13.7°N 80°E / 13.7; 80
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండలంసూళ్ళూరుపేట మండలం
విస్తీర్ణం
 • మొత్తం16.04 కి.మీ2 (6.19 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం27,504
 • సాంద్రత1,700/కి.మీ2 (4,400/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1123
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)524121 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

సూళ్ళూరుపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా పట్టణం. ఈ పట్టణానికి సమీపంలో శ్రీహరికోట లోగల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఉంది.ఇది మునిసిపల్ టౌన్.

పేరు వ్యుత్పత్తి[మార్చు]

ఇక్కడ చెంగాలమ్మ గుడికి ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు మేకని కట్టి మూడు సార్లు గాలిలో తిప్పుతారు. సుళ్ళు తిరుగుతున్న నీటిలో దొరికిన దానికి గుర్తుగా ఇలా తిప్పటం జరుగుతున్నది కావున ఈ పట్టణానికి సూళ్లూరుపేట అనే పేరు వచ్చింది.

భౌగోళికం[మార్చు]

సూళ్ళూరుపేట రైల్వేస్టేషన్ రోడ్

చెన్నై నుండి 83 కి.మీ.ల దూరంలోనూ, నెల్లూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

రవాణా సౌకర్యాలు[మార్చు]

జాతీయ రహదారి 16 పై , చెన్నై - కోల్‌కాతా రైలు మార్గంపై ఈ పట్టణం వుంది.

పరిపాలన[మార్చు]

సూళ్లూరుపేట పట్టణ పరిపాలనను సూళ్లూరుపేట పురపాలక సంఘం నిర్వహిస్తుంది

విద్యా సౌకర్యాలు[మార్చు]

వి.ఎస్.ఎస్.చి.ప్రభుత్వ డిగ్రీ కళాశాల.

దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

చెంగాళమ్మ గుడి[మార్చు]

సూళ్ళూరుపేటచెంగాళమ్మ గుడి

ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన చెంగాళమ్మ గుడి ఉంది. తలపై నాగపడగ కలిగి ఎనిమిది చేతులతో ఉండే అమ్మవారు బహుళ ప్రసిద్ధి కలిగిన అమ్మవారు. స్థల పురాణం ప్రకారం కొన్ని వేల ఏళ్ళ పూర్వం ఈ ఊరిని శుభగిరి అని పిలిచేవారు. ఊరికి పశ్చిమంగా కాళంగి నది ప్రవహిస్తుండేది. కొందరు పశువుల కాపరులు ఈత కొరకు దిగగా అందులో ఒకడు సుళ్ళు తిగుతున్న నీటి ప్రవాహం లోనికి లాక్కుని పోతుండగా అసరాగా చేతులకు తగిలిన రాతిని పట్టుకోగా అది అతడిని ఆ సుళ్ళ ప్రవాహం నుండి బయట పడవేయగా అతడు తనతో పాటుగా ఆ రాతిని తీసుకొచ్చి మిగిలిన వారికి చూపి జరిగినది వారికి చెప్పాడు. చీకటి పడటంతో వాళ్ళు పొడవుగా ఉన్న ఆ శిలను అక్కడే పడుకోబెట్టి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం వచ్చి చూడగా పడుకోబెట్టిన రాయి దక్షిణాభిముఖంగా నిలబెట్టి ఉండటం, అది ఒక స్త్రీమూర్తి విగ్రహం అని మహిషాసురమర్ధనిలా ఉండటం గమనించారు. దానిని ఊరి పొరిమేరలలోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించగా ఎంతకూ కదలకపోవటం, ఆ రాత్రి ఊరి పెద్దకు కలలో కనిపించి తనను కదల్చవద్దని చెప్పడంతో అక్కడే ఒకపాక వేసి పూజలు చేయడం మొదలెట్టారు. కొంతకాలానికి గుడి నిర్మించిన తరువాత తలుపులు పెట్టేందుకు ప్రయత్నించగా అప్పుడు కలలో కనబడి నా దర్శనానికి ఏ సమయంలో వచ్చినా ఇబ్బంది కలుగకూడదు కనుక తలుపులు పెట్టవద్దని హెచ్చరించినదట. మరునాడు చూడగా తలుపులు చేయడానికి తెచ్చిన చెక్కలపై మొక్కలు మొలిచి కనిపించాయట. అప్పటి నుండి ఆ మొక్కలు ఆ ఆవరణలోనే పెరిగి పెద్దవై ప్రస్తుతం చెంగాళమ్మ వృక్షంగా పిలవడం జరుగుతున్నది. ఈ చెట్టును సంతానం కోరి దర్శించుకొనేవారు అధికం.

ఆలయ ప్రత్యేకత[మార్చు]

షార్ ప్రతి ప్రయోగానికి ముందు ప్రతి రాకెట్ చిన్న నమూనాను ఈ ఆలయంలో పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. దీనికి ఇస్రో ఛైర్మన్ హాజరవడం జరుగుతుంది.

సుళ్ళు ఉత్సవం[మార్చు]

సుళ్ళూరుపేటకు ఈ పేరు రావడంలో చెంగాళమ్మ గుడి పాత్ర ఉంది. అది ఎలాగంటే చెంగాలమ్మ గుడికి ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు మేకని కట్టి మూడు సార్లు గాలిలో తిప్పుతారు. సుళ్ళు తిరుగుతున్న నీటిలో దొరికిన దానికి గుర్తుగా ఇలా తిప్పటం జరుగుతుంది. ఇలా తిప్పడాన్ని "సుళ్ళు ఉత్సవం" అంటారు, అలాగ ఈ ఊరికి సూళ్ళురుపేట అని పేరు వచ్చింది.

ఇతరాలు[మార్చు]

ఇతర విశేషాలు[మార్చు]

చెన్నై కు మెరుగైన రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలు ఉన్నందున దీనిని కొన్నిసార్లు చెన్నై చుట్టుపక్కల వున్న ప్రాంతంగా పరిగణిస్తారు. ఇక్కడ ఉద్యోగపరంగా చాలామంది తమిళులు నివాసం ఉంటున్నారు. అధికశాతం జనాభాకు తమిళం తెలుసు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018

వెలుపలి లంకెలు[మార్చు]