తులసిదళం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తులసిదళం
తులసిదళం పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: యండమూరి వీరేంద్రనాధ్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం(కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: విజయవాడ
విడుదల: 1981
పేజీలు: 352


తులసి దళం అత్యంత ప్రజాదరణ పొందిన యండమూరి వీరేంద్రనాథ్ నవల. ఆంధ్రభూమి వారపత్రికలో 1980లో సీరియల్‌గా వచ్చింది. తరువాత సినిమాగా కూడా నిర్మించబడింది. ఈ నవల విడుదలైన సమయం నుండి అనేక సార్లు ప్రచురితమై యండమూరి రచనలలో కెళ్ళా అత్యధికంగా అమ్మబడుపోయిన నవలలో ఒకటి. కన్నడంలో కూడా ఇతోధికంగా జనాదరణ పొందింది.


తులసి అనే పాప ఒక ఆస్తిపరుని కుమార్తె. అతనిపై కక్ష కట్టిన కొందరి కుతంత్రం వల్ల ఆ బిడ్డపై కాష్మోరా అనే దుష్ట శక్తి ప్రయోగమౌతుంది. ఇందులో కాద్రా అనే మాంత్రికుడి పట్టుదల ఉంది. అందువల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురైన ఆ పాప రోజురోజుకూ మరణానికి దగ్గరవుతుంది. ఆ బిడ్డను రక్షించుకొనే క్రమంలో నలుగురు మనుషుల ప్రయత్నం ఈ కథలో చాలా పట్టుగా చెప్పబడింది. ఇస్మాయిల్ అనే సాధకుడు చేతబడికి విరుగుబడి చేయిస్తాడు. ఆధునిక ధృక్పథం కల తులసి తండ్రి చేతబడిని నమ్మి అందుకు విరుగుడు చేయించడానికి తంటాలు పడుతాడు. వారి శ్రేయోభిలాషి అబ్రకదబ్ర (అబ్బూరి కేదారేశ్వరరావు) అతనికి సాయపడతాడు. సంప్రదాయాలను నమ్మే తులసి తల్లి, క్రమంగా వైజ్ఞానిక ధృక్పథంలో ఆలోచించసాగింది.


పాఠకులు ఎంతో ఆసక్తిగా వచ్చేవారం కోసం ఎదురు చూసిన ధారావాహికలలో ఇది ఒకటి. రచయిత వైజ్ఞానిక విశ్లేషణను, తాంత్రిక విధానాలను సమాంతరంగా చూపడానికి ప్రయత్నించాడు గాని చివరకు ఎటూ తేల్చకుండా నిర్ణయాన్ని వదిలేశాడు. ఈ నవలతో 'కాష్మోరా' అనే మాట ఆంధ్రదేశంలో పరిచయమై అనేక వ్యంగ్య సందర్భాలలో వాడబడింది. ఈ నవలకు పొడిగింపుగా యండమూరి వీరేంద్రనాథ్ 'తులసి', 'కాష్మోరా' అనే నవలలు వ్రాశాడు. విలియం పీటర్ బ్లాట్టీ వ్రాసిన "ది ఎక్జార్సిస్ట్" (The Exorcist) కు తులసీదళం నవలకు పోలికలు ఉండటాన్ని యండమూరి ఒప్పుకున్నా, కథనాన్ని నడిపించిన శైలి, శిల్పంలో భేష్ అనిపించుకున్నాడు.[1]


ఈ నవలను మరియు దానిని అనుకరిస్తూ వచ్చిన అనేక రచనలను విమర్శకులు "క్షుద్ర సాహిత్యం" అని తెగనాడారు.[2] వ్యంగ్యంగా "వేపమండలు" అనే నవల కూడా వచ్చింది.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=తులసిదళం&oldid=2137296" నుండి వెలికితీశారు