Jump to content

తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి

వికీపీడియా నుండి
తెన్నేటి లక్ష్మీ నరసింహమూర్తి
అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు చిత్రం
జననం
తెన్నేటి లక్ష్మీ నరసింహమూర్తి

1966 ఏప్రిల్ 16
ఇతర పేర్లుతెన్నేటి మాస్టారు
విద్యఎం.ఎ (తెలుగు)

బి.ఇ.డి
విద్యాసంస్థఆంధ్ర విశ్వవిద్యాలయం
వృత్తితెలుగు భాషోపాధ్యాయుడు
క్రియాశీల సంవత్సరాలు2003 నుండి ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, రచయిత, వ్యాఖ్యాత, నటుడు, ఉపాధ్యాయుడు
జీవిత భాగస్వామిరమా ప్రతిభ
పిల్లలుసాయితేజ (కుమారుడు)
సాయిజ్యోత్స్న (కుమార్తె)
తల్లిదండ్రులువేంకట జానకి రామారావు
సుబ్బలక్ష్మి
2016 అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా 2016 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకుంటున్న తెన్నేటి మాస్టారు

తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి (తెన్నేటి మాస్టారు గా సుపరిచితులు) తెలుగు కవి, రచయిత[1], బహుభాషా కోవిదుడు, వ్యాఖ్యాత, నటుడు, "అక్షర కిరీటి" బిరుదాంకితులు. అతను పలు రంగాల్లో నిస్వార్థ సేలవందించే బహుముఖ ప్రజ్ఞాశాలి. అతను వృత్తి రీత్యా తెలుగు భాషోపాధ్యాయుడు. అతను గోదావరి సాహితీ సభ వ్యవస్థాపక అధ్యక్షుడు. అతను తరతరాల నుండి వారసత్వంగా వస్తున్న సాంస్కృతిక సాహిత్య కళారూపాలు, సంస్కృతీ సంప్రదాయాలు, వివిధ రూపాలలో సాహిత్య ప్రక్రియలను భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్నాడు.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

తెన్నేటి మాస్టారు ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా లోని నిడమర్రు మండలానికి చెందిన పెదనిండ్రకొలను గ్రామంలో వేంకట జానకి రామారావు, సుబ్బలక్ష్మి దంపతులకు 1966 ఏప్రిల్ 16న జన్మించాడు. బాల్యం నుంచి తెలుగు భాష, తెలుగు సాహిత్యం పై మక్కువ పెంచుకుని, భీమవరం ఓరియంటల్ కళాశాల యందు బి.ఏ. (ఓ.ఎల్.) చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఏ. చేసి, అనంతరం బి. యీడి, పట్టా కూడా పొందాడు. అతను సంస్కృతాంధ్ర పండితుడు, కవి, సంస్కృత అధ్యాపకునిగా, ప్రాచార్యునిగా పనిచేసిన బహుగ్రంథ కర్త భారతం శ్రీమన్నారాయణ వద్ద తెలుగు భాషలో పలు మెళుకువలు ఔపోసన పట్టాడు.

తెలుగులో యుగ ప్రవక్తలైన కందుకూరి, రాయప్రోలు, గురజాడ, శ్రీశ్రీ, మధునాపంతుల వారి సాహిత్య ప్రభావంతో తెన్నేటి వ్రాసే కవితలు, వ్యాసాలు, ఇతర రచనలు వివిధ పత్రికలలో ప్రచురించబడుతూనే ఉన్నాయి. పరోపకారం, సమాజ సేవ, సర్వ మతాలను సమ భావనతో చూడడం అతని ఆశయాలు, ఈ ఆశయాల సాధనకు పదును పెట్టి ఆలోచనలను సఫలీకృతం చేస్తూ సాహితీ రంగంలో తనదైన బాణీలో ఒక ముద్రను సొంతం చేసుకున్నాడు.

పశ్చిమ గోదావరి జిల్లా లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాలకోడేరు నందు తెలుగు భాషోపాధ్యాయునిగా సేవలందిస్తూనే మరో పక్క సమాజంలో విజ్ఞానాన్ని పెంపొందించటం కోసం, సామాజిక అవగాహన కల్పించడం కోసం ఎన్నో కథలు, నాటికలు, కవితలు వ్రాస్తూ ప్రముఖుల ప్రశంసలు పొందాడు.

సాహితీ ప్రస్థానం

[మార్చు]

తెలుగంటే, అమ్మ, అక్షరం ఆయుధంగా, రక్తదానం, ఓ సైనికుడా, ప్లాస్టిక్ భూతం, డబ్బు భలే జబ్బు, విశ్వ మానవ ప్రేమ, నాన్న కోసం వగైరా 2000 వరకు కవితలు వ్రాశాడు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఛిన్నాభిన్నమైనా మానవ సంబంధాలు మాత్రం పటిష్టంగా ఉండాలనే లక్ష్యంతో సంతానం, కొడుకు, రధయాత్ర, సీతాకళ్యాణం, శివతాండవం, ఉగాది స్పెషల్, ధనలక్ష్మి ఐ లవ్ యూ, సింహతలాటం, నాయనమ్మ గారి ఊరు, వంటి కథలు సుమారు 80 వరకు వ్రాశాడు.

విదేశీ నాగరికతకు బలవంతంగా ఆకర్షింపబడుతోన్న యువతరం చేసే వికార చేష్టలను నిరసిస్తూ, అనుకరణనే నాగరికత పేరుతో ఆరాధించే నవతరం కోసం వినోదం, విజ్ఞానం, వికాసం, చక్కని భాషలో సమీక్షల రూపంలో వృద్ధ దేవోభవ, వాతావరణ కాలుష్యం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, జాతీయ పతాకం, గాంధీ మార్గం, ఉపాధ్యాయుల పాత్ర, తాంబూలం, గ్రంథాలయాలు, మన పూరి పేర్ల చరిత్ర, అమ్మ కు వందనం, వంటి వ్యాసాలే కాక కందుకూరి, స్వామి వివేకానంద, అల్లూరి, గుఱ్ఱం జాషువా, చిలకమర్తి, నెహ్రూ, బి.ఆర్.అంబేడ్కర్, ఇందిరా గాంధీ, చింతలపాటి సీతారామ చంద్ర వరప్రసాద మూర్తి రాజు వంటి ప్రముఖులను గూర్చిన జీవిత చరిత్రలు వ్యాసాలను సుమారుగా 600 వరకూ వ్యాసాలను రాసాడు.

సంస్కృతిని పెంచే కథలు

[మార్చు]

భారతీయ సంస్కృతిని పెంచేందుకు హృదయాన్ని హత్తుకునే విధంగా సంతానం, శాస్త్రం, ప్రతిభ, ఉగాది స్పెషల్, వందో పెళ్లి చూపులు వంటివి 100కథలు. రాసారు. సమాజాన్ని చైతన్య పరచడానికి సుమారు 500 వ్యాసాలు రాసారు.

కళా సాహితీ రంగాల్లో

[మార్చు]

తెన్నేటి పలు సాహితీ రూపాలు, నాటికలు రూపొందించడంతో పాటు ఆయా పాత్రల్లో నటించి మెప్పించారు. విముక్తి, ఇదెక్కడి న్యాయమండి బాబో, సారా హఠావో సమాజ్ బచావో, నేనూ చదువుకుంటా వంటి తదితర నాటికలు బహుళ ప్రాచుర్యం పొందాయి. కైలాసంలో కోర్టులో శివుడు, భువన విజయంలో శ్రీకృష్ణ దేవరాయలు, ఇంద్ర సభలో ఇంద్రుడు, బృహస్పతి, శ్రీనాధుడు, పోతన తదితర పాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. పలువురు కవులు, కళాకారులను గణపవరం రప్పించి నాటికలు, సాహితీ రూపాలు, అష్టావ ధానాలు, శతావధానాలు, సహస్రావధానాల్లో పృచ్చకునిగా వ్యవహరించారు.

ఉత్తమ ఉపాధ్యాయుడిగా

[మార్చు]

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా 2008లో అప్పటి కలెక్టర్ జయలక్ష్మి చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. పలు సాహిత్య సాంస్కృతికల వేదికలపై సన్మానాలు అందుకున్నారు. గాంధేయవాది చింతలపాటి మూర్తిరాజు సారధ్యంలో నిర్వహించిన సర్వోదయ సమ్మేళానికి 'గాంధీయం' సావనీర్ రూపకర్తగా వ్యవహరించారు. 'గోదావరి సాహితీ ప్రభ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.వి.యస్. రాజుతో కలసి 60ఏళ్ళ స్వాతంత్య్ర ఉత్సవంలో భాగంగా 'వత్రోత్సవ సాక్షిగా' కవితా మాలికను, 'మాతెలుగు తల్లికి మల్లెపూదండ' ప్రచురించారు. రుద్రరాజు ఫౌండేషన్ కార్యదర్శిగా, ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ జిల్లా, అధ్యక్షుడిగా, ఆంధ్ర పద్య కవితా సదస్సు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

ప్రతి వ్యక్తిలోనూ అంతర్గతంగా వున్న సృజనాత్మ క శక్తిని వెలికి తీయడం, వాటికి మెరుగులు దిద్దటం సృజనాత్మక కళల పట్ల ఆసక్తి యున్న విద్యార్థినీ విద్యార్థులకు తగు తర్ఫీదునివ్వటం, వారికి సాహిత్యం పై అభిలాష పెంచడం, మంచి కళాకారులుగా సమాజానికి ఉపయోగపడే ఉన్నత భావాలు కల వ్యక్తులుగా తీర్చిదిద్దే విధంగా బాల కవి సమ్మేళనాలు, భువన విజయాలు, పద్యాల పోటీలు, సాహితీ సభలు మొదలైనవి ఏర్పాటు చేయడం, కథలు, కవితలు, బొమ్మలతో కూడిన లిఖిత మ్యాగజైన్ ను రూపొందించటం పలు రకాలుగా పిల్లలను ప్రోత్సహించే మాష్టారుగా గుర్తింపు పొందాడు.

రచనలపై పరిశోధనలు

[మార్చు]
  • తెన్నేటి మాస్టారు వ్రాసిన కవిత్వంపై  డాక్టర్ పులపర్తి శ్రీనివాసరావు " తెన్నేటి లక్ష్మీ నరసింహ మూర్తి కవిత్వం పై పరిశోధన" కవితా వాహిని" అనే పుస్తకాన్ని, శ్రీమతి కొలిపాక అరుణ "తెన్నేటి లక్ష్మీ నరసింహ మూర్తి కథలు - పరిశీలన "హాస్య వాహిని " అనే పుస్తకాన్ని ప్రచురించారు.
  • విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయం లో తెన్నేటి లక్ష్మీ నరసింహ మూర్తి నాటికల పై పరిశోధన (పి.హెచ్ డి)చేసి "తెన్నేటి లక్ష్మీ నరసింహ మూర్తి నాటికలు - పరిశోధన" అనే సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి  జి.వివేకానంద స్వామి డాక్టరేట్ పొందారు.[3]
  • విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయం లో తెన్నేటి లక్ష్మీ నరసింహ మూర్తి కవిత్వం   పై పరిశీలన (పి.హెచ్ డి) చేసి "తెన్నేటి లక్ష్మీ నరసింహ మూర్తి కవిత్వం - పరిశీలన" అనే సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి  మేకల శ్రీనివాసరావు డాక్టరేట్ పొందారు.

రచనలు

[మార్చు]

కవితా సంపుటులు

[మార్చు]
  1. "తెన్నేటి తరగలు"కవితా సంపుటి (నవంబర్ 2003)
  2. “అక్షర గోదావరి" కవితా సంపుటి (మే 2007)
  3. "తల్లీ నిన్ను తలంచి" కవితా సంపుటి (జనవరి 2011)
  4. "కవితా గోదారి"కవితా సంపుటి (డిశంబరు 2012)
  5. "వాస్తవమ్మీ పలుకు తెన్నేటి పలుకు" మినీ కవితలు  (అక్టోబరు 2018)
  6. "కవితల కొలువు" కవితలు (ఫిబ్రవరి 2019) కవితా సంపుటి
  7. "కవితా కిరణాలు" కవితలు (ఏప్రియల్ 2022) కవితా సంపుటి
  8. "నూటాపదార్లు" కవితలు (ఆగస్టు 2023) కవితా సంపుటి

నాటికల సంపుటులు

[మార్చు]
  1. "నేనూ సదూకుంటా",
  2. "నేనూ రైతునవుతా",

వ్యాస సంపుటులు

[మార్చు]
  1. "తేనెలూరు తెలుగు మనది",
  2. "జ్యోతి కిరణాలు",
  3. "బాలతరంగాలు",
  4. " స్ఫూర్తి కిరణాలు "

కథా  సంపుటులు,

[మార్చు]
  1.   "రథయాత్ర"
  2.   "సింహ తలాటం""
  3.   " తెన్నేటి కతలు"

మొదలైన స్వీయ రచనలను పదిహేడు పుస్తకాలు ప్రచురించినారు.

బిరుదులు

[మార్చు]
  1. "నవసాహితీ విశారద" సాహితీ స్రవంతి, చీరాల (18-12-2005)
  2. "సాహితి కిరీటి"కళాలయ సాంస్కృతిక సంస్థ, పాలకొల్లు (05-01-2006)
  3. "అక్షర కిరీటి" రుద్రరాజు ఫౌండేషన్, గణపవరం (12-08-2006) )
  4. "సాహిత్య సేవారత్న" గుఱ్ఱం జాషువా స్మారక కళా పరిషత్, దుగ్గిరాల (25-03-2007)
  5. "సాహితి వల్లభ" సిరిమువ్వు, తాడేపల్లిగూడెం (01-11-20 07)
  6. "కవిరత్న" చర్ల గణపతి శాస్త్రి సమితి. విశాఖ (01-01-2008)
  7. "సాహితీ చైతన్య" బౌద్ధ ధర్మప్రచార ట్రస్ట్, ఏలూరు (18-07-2008)
  8. "సాహితి విద్యారత్న" గుఱ్ఱం జాషువా స్మారక కళా పరిషత్, దుగ్గిరాల (18-02-2009)
  9. "సాహితి సభాస్రమాట్, బౌద్ధ ధర్మప్రచార ట్రస్ట్ ఏలూరు (1-11-2010)
  10. "కళా శైలుషుడు" కాట్రగడ్డ పబ్లికేషన్స్, పెదపాడు (04-03-2011)
  11. "సాహితి కళా మిత్ర"  శ్రీసాహితీ చైతన్య సమాఖ్య, నిడదవోలు (31-03-2014)
  12. "సాహితి కళారత్న కిరీటి" శ్రీ సాయి యువసేన, కైకరం (05-11-2014)
  13. "అమృత మూర్తి” కవి బ్రహ్మ శ్రీ తిక్కనామాత్య సాహిత్య, కవి, రచయితల సంఘం & పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ (27-07-2014)
  14. "ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్మారక అవార్డు' పశ్చిమ గోదావరి జిల్లా రంగస్థల వృత్తి కళాకారుల సంఘం. (10-08-2014)
  15. "కవి శేఖర" శ్రీ పెద్దింట్లమ్మ వారి భక్త బృందం దెందులూరు, పశ్చిమ గోదావరి జిల్లా. (10-03-2015)
  16. "కవితా కిరీటి" మదర్ థెరిస్సా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, విశాఖపట్నం వారిచే (19-03-2017)
  17. "కవిసింహ" రుద్రరాజు ఫౌండేషన్, గణపవరము వారిచే  ( 25-12-2018)
  18. "కవిశేఖర" సీనియర్ సిటిజన్ మాసపత్రిక మచిలీపట్నం (02-09-2020)
  19. "ఆచార్య దేవ" "అమృతోత్సవ జీవన సాఫల్య పురస్కారం -2023" శ్రీ రుద్రరాజు ఫౌండేషన్ గణపవరం వారి  (25-12-2023)
  20. "కవితామార్తాండ" బిరుదుతో "బెస్ట్ నంది అవార్డు 2024" రితికా ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే 2024 మే 26, విజయవాడలో...

పురస్కారాలు

[మార్చు]
  1. 2009 జనవరి 18 : ఎన్.టి.ఆ ర్ కళానికేతన్ గ్రేటర్ విశాఖపట్టణం వారిచే "ఎన్.టి.ఆర్. విశిష్ట సాహితీ పురస్కారం"
  2. 2010 నవంబరు 18: విశ్వశాంతి సేవా సమితి ఒంగోలు వారిచే "విశ్వశాంతి సాహితీ పురస్కారం"
  3. 2010 డిసెంబరు 18 : రాయలసీమ రంగస్థలి తిరుపతి వారి చే "శ్రీకృష్ణదేవరాయ సాహితీ పురస్కారం
  4. 2012 డిసెంబరు 27,28,29: 4 వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా "పశ్చిమ గోదావరి జిల్లా సాహితీవేత్త పురస్కారం"
  5. 2015 ఆగస్టు 29 : రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు వారిచే "తెలుగు భాషా పురస్కారం"
  6. 2016 ఆగస్టు 4: ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా వారిచే “శ్రీ దుర్ముఖి ఉగాది సాహితీ పురస్కారం
  7. 2016 ఫిబ్రవరి 10 : గాంధీ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా సర్వోదయ మండలి వారిచే " గాంధీ స్మారక అవార్డు 2016"
  8. 2016 సెప్టెంబరు 5 : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2016 ను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సన్మానించాడు.
  9. 2016 నవంబరు 20 : గణపవరం శాఖా గ్రంథాలయం వారిచే "విశిష్ట వ్యక్తి పురస్కారం
  10. 2019 నవంబరు 01 : ఆంధ్రప్రదేశ్ అవతరణ 64 వ దినోత్సవ వేడుకల సందర్భంగా గణపవరం శ్రీ కన్యకా పరమేశ్వరి వర్తక సంఘం వారిచే "విద్యారంగ పురస్కారం"
  11. 2020 ఫిబ్రవరి 16 : మంచిర్యాల జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన జాతీయ బహు భాషా కవి సమ్మేళనంలో. "భాషా శ్రీ పురస్కారం 2020″
  12. 2022 మే 28 : విజయవాడలో అఖిల భారత తెలుగు అకాడమీ (రి) బెంగళూరు వారు నిర్వహించిన శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలలో " తెలుగు భాషా సత్కారం 2022”
  13. 2022 ఆగస్టు 14: గణపవరం శ్రీ కన్యకా పరమేశ్వరి వర్తక సంఘం వారు నిర్వహంచిన అజాదీ కా అమృతోత్సవాల వేడుకలలో “శ్రీ రాజరాజ నరేంద్రుని పట్టాభిషేక సహస్రాబ్ది పురస్కారం- 2022"
  14. 2022 ఆగస్టు 29 : శ్రీ గిడుగు వేంకట రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వారు నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ వేడుకలలో "తెలుగు భాషా దినోత్సవ ప్రతిభా పురస్కారం 2022"
  15. స్పందన ఈదా ఇంటర్నేషనల్ వారిచే "గురు స్పందన పురస్కారం 2022"
  16. 2023 మార్చి 19 : కర్ణాటక తెలుగు రచయితల  సమాఖ్య (రి) వారు బెంగళూరు నందు నిర్వహించిన ఉగాది వేడుకలలో " శోభకృత్ ఉగాది జాతీయ సాహిత్య పురస్కారం
  17. 2023 డిసెంబరు 10 :  తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ వారిచే "శోభకృత్ తెలుగు వెలుగు మహానంది జాతీయ పురస్కారం 2023"
  18. 2024 : ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం తూర్పు గోదావరి జిల్లా వారిచే   "శ్రీ పడాల రామారావు స్మారక పురస్కారం - 2024"
  19. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారిచే "ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ కవి పురస్కారం 2024" "
  20. ఆల్ ది బెస్ట్ అకాడమీ హైదరాబాద్ వారిచే "గురుబ్రహ్మ అవార్డు 2024".
  21. 2024 ఏప్రిల్ 14 :శ్రీ విరాట్ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ వారిచే "తెలుగు వెలుగు ఉగాది జ్ఞాన బుద్ధ జాతీయ గౌరవ పురస్కారం - 2024" (14.04.2024)

మూలాలు

[మార్చు]
  1. Ltd, Nasadiya Tech Pvt. "Telugu stories : కథలు మరియు కవితలు చదవండి". telugu.pratilipi.com. Retrieved 2024-10-10.
  2. కథా కిరణాలు - మన తెలుగు కథకులు, పైడిమర్రి రామకృష్ణ, పైడిమర్రి కమ్యూనికేషన్స్, ఖమ్మం, 2002.
  3. "Tenneti Lakshminarasimha Murthy Naatikalu Pariseelana – Andhra University Digital Library" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-10.