తెలంగాణ యువ నాటకోత్సవం - 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ యువ నాటకోత్సవంలో 2017 అక్టోబరు 21న ప్రదర్శించిన నాటికలకు వచ్చిన ప్రేక్షకులు

తెలంగాణ యువ నాటకోత్సవం - 2 అనేది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్తాధ్వర్యంలో 2017, అక్టోబరు 20 నుండి 22 వరకు హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన నాటకోత్సవం.[1][2] నూతన తెలంగాణ రాష్ట్రంలో నాటకరంగ ఉనికిని చాటడంకోసం, తెలంగాణలోని యువ నాటక రచయితల, దర్శకుల, కళాకారుల, సాంకేతిక నిపుణుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో తెలంగాణ రంగస్థల సమాఖ్య 2017, జనవరి 27 నుండి 29 వరకు తెలంగాణ యువ నాటకోత్సవం పేర మొదటి నాటకోత్సవాన్ని నిర్వహించింది.

సత్కారాలు

[మార్చు]

ముగింపు కార్యక్రమం

[మార్చు]

యువ నాటకోత్సవ ముగింపు కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కెవి రమణాచారి, తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షులు రసమయి బాలకిషన్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ముఖ్యమంత్రి ఓఎస్డి దేశపతి శ్రీనివాస్లు పాల్గొన్నారు. తెలంగాణ యువ నాటకోత్సవం ప్రదర్శించిన నాటికల పుస్తకాన్ని ఆవిష్కరించారు.[4][5][6]

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ యువ నాటకోత్సవంలో 2017 అక్టోబరు 22న ప్రదర్శించిన అంధకార నగరం నాటికలోని ఒక దృశ్యం

ప్రదర్శించిన నాటికలు

[మార్చు]
తేది నాటిక పేరు సంస్థ రచయిత దర్శకత్వం
20.10.2017 అంధకార నగరం సహృదయ కల్చరల్ గ్రూప్ భారతేంద్రు హరిశ్చంద్ర (హిందీమూలం,
డా. కోట్ల హనుమంతరావు (స్వేచ్ఛానువాదం)
డా. అంథోని రాజ్
సందేశం వెంకటగిరి థియేటర్ ఎం. పవన్ కుమార్ ఎం. పవన్ కుమార్
ఇంటర్వ్యూ అసోసియేషన్ ఆఫ్ రూరల్ థియేటర్ సి.హెచ్.విద్యాసాగర్ రావు డా. విజయరాఘవ
21.10.2017 మట్టవ్వ మానవతా కల్చరల్ అసోసియేషన్ చొప్పదండి సుధాకర్ తుపాకుల మొగులయ్య
వినాశి స్మైలీ థియేటర్ అంజిబాబు అంజిబాబు
స్వామి కళ్యాణం పోపుడబ్బా థియేటర్ శ్రీకాంత్ బాణాల రాకేష్ రెడ్డి యాస
22.10.2017 కనక్తారా సురభి నాటక సమాజం చందాల కేశవదాసు జయచంద్రవర్మ (పర్యవేక్షణ)
ఊసరవెల్లి మనం ఫౌండేషన్ ప్రభాకర్ సింగపంగ ప్రభాకర్ సింగపంగ
అన్నదాత సుఖీభవ అమెచ్యూర్ ఆర్ట్స్ అకాడమీ వడ్డెపల్లి నర్సింగరావు జి.వి. బాబు
సర్దార్ సర్వాయి పాపన్న ప్రియనటనం, హైదరాబాద్ సి.హెచ్. నటరాజ్ సి.హెచ్. నటరాజ్

చిత్రమాలిక

[మార్చు]

ఈ ఉత్సవంలో ప్రదర్శించిన నాటికలలోని కొన్ని దృశ్యాలు:

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. THE HANS INDIA, Home, Telangana (19 October 2017). "A platform for young theatre artistes". V Sateesh Reddy. Retrieved 7 December 2017.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  2. మైక్ టీవి. "తెలంగాణ యువ నాటకోత్సవం – 2". mictv.in. Archived from the original on 17 October 2017.
  3. తెలంగాణ న్యూస్. "రవీంద్రభారతిలో తెలంగాణ యువ నాటకోత్సవం -2 ప్రారంభం". www.telangananewz.com. Retrieved 7 December 2017.[permanent dead link]
  4. నాటకరంగానికి ప్రభుత్వ సహకారం, సాక్షి, హైదరాబాద్, 23 అక్టోబర్ 2017, పుట. 20.
  5. పాత్రల్లో ఒదిగి... ప్రశంసలందుకొని..., నమస్తే తెలంగాణ, హైదరాబాద్, 23 అక్టోబర్ 2017.
  6. కేంద్ర పురస్కారాలు అందుకునేలా కష్టపడాలి, ఈనాడు, హైదరాబాద్, 23 అక్టోబర్ 2017.