Jump to content

తెలంగాణ యువ నాటకోత్సవం

వికీపీడియా నుండి
తెలంగాణ యువ నాటకోత్సవంలో జ్యోతి ప్రకాశనం చేస్తున్న మామిడి హరికృష్ణ, మల్లేశ్ బలస్ట్, వెంకట్ గోవాడ తదితరులు

తెలంగాణ యువ నాటకోత్సవం అనేది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్తాధ్వర్యంలో 2017, జనవరి 27 నుండి 29 వరకు హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియం నిర్వహించిన నాటకోత్సవం. నూతన తెలంగాణ రాష్ట్రంలో నాటకరంగ ఉనికిని చాటడంకోసం, తెలంగాణలోని యువ నాటక రచయితల, దర్శకుల, కళాకారుల, సాంకేతిక నిపుణుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఈ నాటకోత్సవం నిర్వహించబడింది.[1]

ప్రదర్శించిన నాటికలు

[మార్చు]
తేది నాటిక పేరు సంస్థ మూలం రచయిత అనువాదం/నాటకీకరణ దర్శకత్వం
27.01.2017 బాకీ ఇతిహాస్ ప్రగతి యూత్, నల్లగొండ బాకీ ఇతిహాస్ (నాటకం) బాదల్ సర్కార్ ఎం.వి. ఆదిలక్ష్మీ పి. కొండల్ రెడ్డి
దావత్ పాప్‌కార్న్ థియేటర్, హైదరాబాద్ ది ఫ్రీ లంచ్ (కథ) రవీంద్రనాథ్ టాగూర్ తిరువీర్ తిరువీర్
భూమడు పీపుల్స్ ఆర్ట్ థియేటర్, వరంగల్ భూమడు (కథ) పెద్దింటి అశోక్ కుమార్ చిర్రా రాజేష్ కన్నా చిర్రా రాజేష్ కన్నా
28.01.2017 గ్యారా కద్దూ బారా కొత్వాల్ సంహిత థియేటర్, ఖమ్మం గ్యారా కద్దూ బారా కొత్వాల్ (కథ) సురవరం ప్రతాపరెడ్డి సి.హెచ్. నటరాజ్ టి. సత్యనారాయణచారి
మూగమనసులు జాబిల్లి కల్చరల్ సొసైటీ, నిజామాబాద్ - మల్లేశ్ బలష్టు - మల్లేశ్ బలష్టు
గొల్ల రామవ్వ క్రియేటీవ్ థియేటర్, ఖమ్మం గొల్ల రామవ్వ (కథ) పి.వి. నరసింహారావు అజయ్ మంకెనపల్లి అజయ్ మంకెనపల్లి
చాయ్ ఏది బే మంచ్ థియేటర్, హైదరాబాద్ - శ్రీకాంత్ బాణాల - శ్రీకాంత్ బాణాల
29.01.2017 చింత బరిగె స్కీం[2] ఫరెవర్ ఫెంటాస్టిక్ థియేటర్, సూర్యాపేట - ఖాజా పాషా - సురభి రమేష్
హాలాహలం రైస్, హైదరాబాద్ - మారయ్య మల్లం - ఎం. అరుణ్ కుమార్
రచ్చబండ గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ రచ్చబండ (కథ) రావుల పుల్లాచారి రావుల పుల్లాచారి వెంకట్ గోవాడ
రేపటి కథ మైత్రి థియేటర్స్, గోదావరిఖని జూస్టోరి ఎడ్వర్డ్ ఫ్రాంక్లిన్ ఆల్బి సి.హెచ్. నటరాజ్ జి. వనరాజ్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ. "నగరంలో నేడు". Retrieved 2 March 2017.[permanent dead link]
  2. వి6 న్యూస్. "తెలంగాణ యాసలో.. చింత బరిగె". Archived from the original on 4 February 2017. Retrieved 2 March 2017.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)