తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల
రకం | క్రీడా పాఠశాల |
---|---|
స్థాపితం | 1993 |
డైరక్టరు | కె. నర్సయ్య |
విద్యాసంబంధ సిబ్బంది | 23 శిక్షకులు, 29 అకాడమీలు |
విద్యార్థులు | 409 (223 బాలురు, 186 బాలికలు) |
చిరునామ | రాజీవ్ గాంధీ రహదారి, హకీంపేట్, తెలంగాణ, 500078, భారతదేశం 17°33′22″N 78°32′41″E / 17.556021°N 78.5448606°E |
కాంపస్ | నగర శివారు ప్రాంతం, 206 ఎకరాలు (83.4 హెక్టార్లు) |
తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల తెలంగాణ ప్రభుత్వంకు చెందిన క్రీడా పాఠశాల. హైదరాబాదు సమీపంలో మెదక్ జిల్లా, ఎల్దుర్తి మండలం హకీంపేట్లో ఉన్న ఈ పాఠశాలలో క్రీడల శిక్షణతో పాటు పాఠాలు కూడా బోధిస్తారు. ఎస్.ఎఫ్.ఎ. హైదరాబాద్ ఛాంపియన్‌షిప్‌లో 2017లో భారతదేశంలోనే ఉత్తమ క్రీడా పాఠశాలగా గుర్తింపుపొందింది.[1][2][3] ఈ పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయంగా 100 పతకాలు, జాతీయ స్థాయి పోటీలలో 1800కి పైగా పతకాలు సాధించారు.[4] 2017లో తెలంగాణ ప్రభుత్వం నుండి క్రీడల విభాగంలో తెలంగాణ ఆవిర్భావ పురస్కారం అందుకుంది.[5]
ప్రాంగణం
[మార్చు]1993లో హకీంపేట వైమానిక దళం స్టేషన్ సమీపంలో ఉన్న తూముకుంట వద్ద 206 ఎకరాలలో ఈ పాఠశాల ప్రారంభమైంది.[6] కబడీ, విలువిద్య, జిమ్నాస్టిక్స్, జూడో, వాలీబాల్, ఫుట్‌బాల్, రోయింగ్, సెయిలింగ్, కయాకింగ్, కానోయింగ్, సెపాక్ తక్రావ్, ట్రాక్, ఫీల్డ్ అథ్లెటిక్స్ మొదలైన క్రీడలలో శిక్షణ ఇస్తారు.[7][8]
ఈ పాఠశాలలో జిమ్నాస్టిక్స్ కోసం ఇండోర్ స్టేడియం, 400 మీటర్ల ట్రాక్, ఆర్చరీ గ్రౌండ్, ఫుట్‌బాల్ గ్రౌండ్, వాలీబాల్ కోర్టులు, వెయిట్ లిఫ్టింగ్ హాల్, కండిషనింగ్ హాల్ ఉన్నాయి.
అడ్మిషన్స్
[మార్చు]ప్రతి సంవత్సరం మే నెలలో 40మంది విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. ఈ పాఠశాలలో 144 గదులతో హాస్టల్ సౌకర్యం ఉంది. 8 సంవత్సరాల వయస్సు విద్యార్థులను 4వ తరగతికి ఎంపిక చేస్తారు. వివిధ క్రీడలలో మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పరీక్షల ద్వారా ఎంపికలు జరుగుతాయి.[9] వారివారి ప్రతిభను బట్టి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ పాఠశాలలో 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు చదువుకోవచ్చు.
పతకాలు
[మార్చు]ఈ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు వివిధ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించారు.
- 2014-15 విద్యా సంవత్సరానికిగాను 17 మంది విద్యార్థులు పాల్గొని రెండు స్వర్ణం, మూడు రజితం, రెండు కాంస్య పతకాలతో మొత్తం ఏడు పతకాలు సాధించారు.
- 2015-16కు గాను 14 మంది విద్యార్థులు పాల్గొని 11 స్వర్ణం, 4 రజితంతో 14 పతకాలు సాధించారు.
- 2016-17కు గాను 11 మంది పాల్గొని ఒక స్వర్ణం, ఐదు రజితం, రెండు కాంస్యాలతో 8 పతకాలు సాధించారు.
- 2017-18లో 23 మంది పాల్గొని 12 స్వర్ణం, రెండు రజితం, రెండు కాంస్య పతకాలతో 16 పతకాలు సాధించారు
- 2018-19 సంవత్సరంలో ముగ్గురు విద్యార్థులు పాల్గొని ఒక రజితం, ఒక కాంస్య పతకం సాధించారు.
పూర్వ విద్యార్థులు
[మార్చు]- జి. సట్టి గీతం - 4x400 మీటర్లు (2004 & 2008 ఒలింపిక్స్)
- మనోజ్ - విలువిద్య
- డి. సాయి రాజ్ - థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో జరిగిన 2017 ఆసియా రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత
- రాగాల వెంకట రాహుల్ - 85 కిలోల వెయిట్ లిఫ్టింగ్, బంగారు పతక విజేత, కామన్వెల్త్ క్రీడలు - 2018
- వరుణ్ రాగాల - 78 కిలోల వెయిట్ లిఫ్టింగ్, బంగారు పతక విజేత, కామన్వెల్త్ క్రీడలు - 2018
- ఎర్ర దీక్షిత - కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ 2017, గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా[3]
గుర్తింపు
[మార్చు]కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ స్పోర్ట్స్ స్కూల్‌ను ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రంగా ప్రకటించింది.
మూలాలు
[మార్చు]- ↑ "TS Sports School sweeps SFA Hyderabad Championship". The Hans India. Retrieved 30 January 2020.
- ↑ AuthorTelanganaToday (18 November 2017). "Telangana Sports School bags two titles in Reliance football tourney". Telanganatoday.com. Retrieved 30 January 2020.
- ↑ 3.0 3.1 AuthorShiva Krishna Gundra (8 September 2017). "Deexitha delighted with surprise gold in Australia". Telanganatoday.com. Retrieved 30 January 2020.
- ↑ ఆంధ్రభూమి, హైదరాబాదు (8 July 2018). "క్రీడా పాఠశాలలో ముగిసిన ప్రవేశ ఎంపిక పోటీలు". andhrabhoomi.net. Archived from the original on 30 జనవరి 2020. Retrieved 30 January 2020.
- ↑ సాక్షి, తెలంగాణ (31 May 2017). "ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు". Sakshi. Archived from the original on 6 August 2017. Retrieved 27 September 2021.
- ↑ AuthorTelanganaToday (16 October 2020). "Physical education institute sought for Hyderabad". Telanganatoday.com. Retrieved 30 January 2020.
- ↑ "Telangana Sports School jr boys win". The Hans India. Retrieved 30 January 2020.
- ↑ AuthorShiva Krishna Gundra (25 March 2018). "Talent nurturing centres at Hyderabad". Telanganatoday.com. Retrieved 30 January 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, నిజామాబాదు (18 June 2019). "క్రీడా పాఠశాలలో ప్రవేశానికి పోటీలు." www.andhrajyothy.com. Archived from the original on 30 జనవరి 2020. Retrieved 30 January 2020.