తెలిదేవర భానుమూర్తి

తెలిదేవర భానుమూర్తి (1953 జనవరి 16 - 2026 ఏప్రిల్ 29), తెలుగు కవి, కథకుడు, కాలమిస్ట్, సీనియర్ పాత్రికేయుడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]భానుమూర్తి 1953 జనవరి 16న భువనగిరిలో జన్మించాడు. తెలిదేవర వెంకట్రావు, సీతమ్మ ఇతని తల్లిదండ్రులు. ఇతడు యాదగిరిగుట్ట, ఆర్మూర్, భువనగిరి లలో చదువుకొన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పి.జి. డిగ్రీ తీసుకొన్నాడు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్నేహితులతో కలిసి ఈయన నల్లగొండ జైల్లో ఉన్నాడు. అప్పటి నుంచే ఈయన తెలంగాణ బాసలో కవితలు రాయడం మొదలు పెట్టాడు. ఆ కవితలను ఊరోలు అనే పేరుతో అరసం ఓ సంకలనంగా తెచ్చింది. ఉదయం దినపత్రికలో తెలంగాణ బాసలో రాజకీయ వ్యంగ్య రచనలకు శ్రీకారం చుట్టాడు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వంపై, చంద్రబాబు ప్రభుత్వంపై సంధించిన వ్యంగ్య బాణాలు 335 పలుకుబడి పుస్తకరూపంలో వెలువడ్డాయి. ఉదయం వారపత్రికలో 'చల్నేదో బాల్ కిషన్ శీర్షికన ఇతడు రాసిన వ్యంగ్య, హాస్య రచనలు ఆదే పేరుతో విశాలాంధ్ర ప్రచురణాలయం పుస్తకంగా వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ మాస పత్రికలో ఇతడు రాసిన హాస్య రచనలు గిల్లిదండ అనే పేరుతో పుస్తకంగా వచ్చింది. ఆక్సిజన్ బార్, నెమీక, గులేర్ అనే కథా సంపుటాలు ఇతని కలం నుంచి వెలువడ్డాయి.
రచనలు
[మార్చు]- ఊరోల్లు – కవితా సంకలనం
- నెమ్లీక – కథా సంపుటి
- గిల్లిదండ – ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో ప్రచురితమైన హాస్య రచనల సంకలనం
- చల్నేదో బాల్ కిషన్ – ఉదయం వారపత్రికలో వచ్చిన వ్యంగ్య, హాస్య రచనలు
- ఆక్సిజన్ బార్ – కథా సంపుటి
- పలుకుబడి – రాజకీయ వ్యంగ్య రచనల సంకలనం
- గులేర్ – 33 కథలతో కూడిన కథా సంపుటి
- లత్కోర్ సాబ్ – నవల[2]
ఇతను రచించిన వందలాది కథలలో నుండి వివిధ పత్రికలలో ప్రచురితమై విశేష ప్రజాదరణ పొందిన కొన్ని ముఖ్యమైన కథలు [3]
- ఎంత బాగుండు – ప్రస్థానం (త్రైమాసిక పత్రిక)
- ఎంత పనాయే – వార్త (ఆదివారం సంచిక)
- ఎక్కడున్నావో – వార్త (ఆదివారం)
- ఎన్కౌంటర్ – వార్త (ఆదివారం)
- కబ్జా – ప్రజాసాహితీ (మాసపత్రిక)
- చాటింపు – ఇండియా టుడే (వారపత్రిక)
- టామీ – వార్త (ఆదివారం)
- డ్రామా – వార్త (ఆదివారం)
- తలాక్ – వార్త (ఆదివారం)
- తెల్ల కాగితం – ఆంధ్రప్రభ (వారపత్రిక)
- దీవెన – ఆంధ్రప్రభ (వారపత్రిక)
- దొంగేవాడురో – ఆర్టీసీ ప్రస్థానం (మాసపత్రిక)
- నిండా మునిగిండ్రు – వార్త (ఆదివారం)
- పోలీస్ భాయ్ – వార్త (ఆదివారం)
- బద్నాం – వార్త (ఆదివారం)
- బాగోతం – వార్త (ఆదివారం)
- మంత్రి కుర్చీ – వార్త (ఆదివారం)
- మంగళార్తి – వార్త (ఆదివారం)
- సేవ్ రాక్స్ – వార్త (ఆదివారం)
అభిప్రాయం
[మార్చు]"తెలిదేవరకు సొంత శైలి. సొంత నడక, స్వంతకం ఉంది. ఇది విశిష్ట లక్షణం. ఎంత చిన్న వాక్యాన్ని చూచినా భానుమూర్తిదని గుర్తు పట్టగలం." - దాశరథి రంగాచార్య
మరణం
[మార్చు]తెలిదేవర భానుమూర్తి 73 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో హైదరాబాదు మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూసాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ by. "తెలిదేవర భానుమూర్తి (Telidevara Bhanumurthy) – తెలుగు రచయిత" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2025-12-06. Retrieved 2026-04-29.
- ↑ "రాజకీయాలపై ఎక్కుపెట్టిన అస్త్రం! – సారంగ". magazine.saarangabooks.com. Retrieved 2026-04-29.
- ↑ "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2026-04-29.
- ↑ ABN. "సీనియర్ రచయిత తెలిదేవర భానుమూర్తి కన్నుమూత". Andhrajyothy Telugu News. Retrieved 2026-04-30.