Jump to content

తెలుగు రక్షణ వేదిక

వికీపీడియా నుండి

తెలుగు రక్షణ వేదిక తెలుగు కనపడాలి - తెలుగు వినపడాలి, తెలుగు రచించాలి - తెలుగు రుచించాలి అన్న నినాదంతో ఏర్పాటైన సంస్థ. తెలుగు భాష ఉన్నతి కోసం, తెలుగు సాహిత్య పరిరక్షణ కోసం 2008, సెప్టెంబరు 25న సంపాదకులు, కవి, రచయితైన పొట్లూరి హరికృష్ణ దీనిని ప్రారంభించారు.[1]

కార్యవర్గం

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

తెలుగు భాష, తెలుగు సాహిత్యం, సంస్కృతి సంప్రదాయాల రక్షణలో భాగంగా వచన, రచన, పద్య, గద్య వివిధ భాష-సాహిత్య ప్రకియలో సేవలందిస్తున్న కవులు-కళాకారులను, తెలుగు జాతి తెలుగు ఖ్యాతి సామాజిక నిర్మాణంలో భాగంగా వివిధ రంగాలలో విశిష్టసేవలను అందిస్తున్న సృజనలను-చైతన్యుల సేవలను ప్రశంసిస్తూ సన్మానిస్తూ తెలుగు రక్షణ వేదిక అభినందిస్తుంది.

  1. తెలుగురత్న పురస్కారం
  2. కళారత్న పురస్కారం
  3. ఎన్.టి.ఆర్. పురస్కారం
  4. కవిరత్న పురస్కారం
  5. కవితాశ్రీ పురస్కారం
  6. ఉగాది పురస్కారాలు

ప్రపంచస్థాయి కవిసమ్మేళనం

[మార్చు]

అనంతపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో 2017, అక్టోబరు 14,15వ తేదీల్లో తెలుగు రక్షణ వేదిక ప్రపంచ కవిసమ్మేళనాన్ని నిర్వహించింది. ప్రపంచ సాహితీ చరిత్రలో తొలిసారిగా 33 గంటలా 44 నిముషాలా 55 సెకన్లపాటు ఈ కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని 12 రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా కవులు, రచయితలు హాజరై వచన కవిత్వం, పద్యకవిత్వం, నానీనాలు, శతకాలు, వివిధ సాహిత్య పక్రియలపై కవులు తమ కవితలను వినిపించారు. నిర్విరామంగా 33 గంటలా 44 నిముషాలా 55 సెకన్లపాటు జరిగే ఈ కవిసమ్మేళనం ప్రపంచసాహితీ చరిత్రలో రికార్డు కవిసమ్మేళనంగా నమోదు అయింది.[2][3]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు ఆర్కైవ్స్ (7 August 2017). "తెలుగుభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిది". Archived from the original on 15 ఆగస్టు 2017. Retrieved 29 October 2017.
  2. "కవితా గానంతో పులకించిన అనంత". andhrabhoomi.net. Archived from the original on 2023-02-12. Retrieved 2023-02-12.
  3. ప్రజాశక్తి (12 October 2017). "14,15 తేదీల్లో అనంతపురం వేదికగా ప్రపంచస్థాయి కవిసమ్మేళనం". Retrieved 29 October 2017.