అక్షాంశ రేఖాంశాలు: 18°32′13″N 79°01′27″E / 18.53694°N 79.02417°E / 18.53694; 79.02417

త్రిలింగ సంగమేశ్వరస్వామి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రిలింగ సంగమేశ్వరస్వామి దేవాలయం
భౌగోళికం
భౌగోళికాంశాలు18°32′13″N 79°01′27″E / 18.53694°N 79.02417°E / 18.53694; 79.02417
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారాజన్న సిరిసిల్ల జిల్లా
ప్రదేశంవిలాసాగర్, బోయినపల్లి మండలం
సంస్కృతి
దైవంసంగమేశ్వరస్వామి[1] (శివుడు) పార్వతీ దేవి[1]
వాస్తుశైలి
నిర్మాణ శైలులుకాకతీయ శైలీ

త్రిలింగ సంగమేశ్వరస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం మండలం, విలాసాగర్ గ్రామంలో ఉన్న దేవాలయం.[2] తూర్పు, ఉత్తర, దక్షిణ ముఖంగా ఉన్న ఒక దేవాలయంలో మూడు గర్భగుడులతో మూడు లింగాలు కలిగిన ఏకైక పురాతన శివాలయాలలో ఇది ఒకటి. ఈ దేవాలయం కరీంనగర్ పట్టణం నుండి 23 కిలోమీటర్ల దూరంలో, వేములవాడకు 23 కిలోమీటర్ల దూరంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

కాకతీయ రాజు రెండవ ప్రోల (సా.శ. 1115-1157) కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయంలో ప్రవేశ ద్వారం, లోపల మూడు గర్భగుడులతో మూడు వైపులా మూడు అంతరాలయంతో ఒక మండపం ఉంది. ప్రతి అంతరాళంలోని అంతర్గత గర్భాలయాల కొలతలు 8 అడుగుల 8 అంగుళాలు, 8 అడుగులు ఒకేలా ఉన్నాయి. ముఖ మండపం 24 అడుగులు, 24 అడుగులు కొలతలలో ఉంది. లోపలి మూడు గర్భగుడులలో 5 అడుగుల 5 అంగుళాల ఎత్తుతో (పాణిపట్టం, లింగం కలిపి) మూడు శివలింగాలు ఒకేవిధంగా ఉన్నాయి. ముఖ మండపంలో ఎడమ వైపున పార్వతీ దేవి, కుడి వైపున లక్ష్మీ గణపతి విగ్రహాలు ఉన్నాయి. ప్రతి లోపలి గర్భగుడిపై శిఖరం నిర్మించబడింది. ప్రతిదానికి పది మెట్లు ఉంటాయి. ప్రతి శిఖరం పైన కలశం నిర్మించబడింది.[3]

ఉత్సవాలు

[మార్చు]

ఇక్కడి ప్రాంగణంలో సీతారామచంద్రస్వామి దేవాలయం కూడా ఉండడంతో ఈ దేవాలయాన్ని హరిహర క్షేత్రం అని కూడా అంటారు.[4] శివతే, వైష్ణవతే పండుగలు రెండూ వేలాదిమంది భక్తులచే జరుపబడుతాయి. ఈ దేవాలయం మహాశివరాత్రి జాతర ప్రధానమైనదికాగా, శ్రీరామ నవమి రెండవ ప్రధాన పండుగ. మహాశివరాత్రి పండుగ సందర్భంగా మహా లింగార్చన, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం స్మార్త ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది. తరువాతి రోజున శివ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. హనుమాన్ జయంతి, గణేష్ నవరాత్రి, దేవి నవరాత్రోత్సవాలు, శ్రావణ మాసోత్సవం, కార్తీక మాసోత్సవం, గీతా జయంతి మొదలైన పండుగలు ఇక్కడ జరుపబడుతాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Welcome To Sri Sanghameshwara Temple". Sanghameshwara temple. Archived from the original on 2016-03-03. Retrieved 2021-09-04.
  2. "Sri Trilinga Sanghameshwara Swamy". vilasagar-temples (in ఇంగ్లీష్). Retrieved 2021-09-04.
  3. Pasha, Gouse. "All That You Need To Know About The Trilinga Sanghameshwara Temple In Telangana!". Chai Bisket (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-09-04. Retrieved 2021-09-04. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. C, Girish. "శ్రీ శ్రీ త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవాలయం". www.manatemples.in (in ఇంగ్లీష్). Archived from the original on 2021-09-04. Retrieved 2021-09-04. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)