Jump to content

దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం

వికీపీడియా నుండి
దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం
దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం లోని దేశాలు
దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం లోని దేశాలు
దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం లోని దేశాలు
సభ్యదేశాలు
Establishment 2006
 -  స్థానం 12 వ సార్క్ సమావేశం, ఇస్లామాబాద్, పాకిస్తాన్ 
 -  తేదీ 2004 జనవరి 6 
 -  In force 2006 జనవరి 1 

దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం (సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా -SAFTA) అనేది, ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం, అనుసంధానాలను పెంపొందించే లక్ష్యంతో ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం, భూటాన్, మాల్దీవులు, శ్రీలంకల మధ్య 2004 లో కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందంతో ఈ దేశాల్లోని 160 కోట్ల మంది ప్రజల మధ్య స్వేచ్ఛా-వాణిజ్య ప్రాంతాన్ని ఏర్పడింది.[1]

2016 నాటికి అన్ని వాణిజ్య వస్తువులపై కస్టమ్స్ సుంకాలను సున్నాకి తగ్గించడం ఈ ఒప్పందపు ప్రధాన లక్ష్యాలలో ఒకటి. SAFTA ప్రకారం, దక్షిణాసియా లోని అభివృద్ధి చెందుతున్న దేశాలు (భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక) 2007 తో ముగిసిన రెండేళ్ల వ్యవధిలో మొదటి దశలో తమ సుంకాలను 20 శాతానికి తగ్గించాలి. 2012 లో ముగిసిన చివరి ఐదేళ్ల దశలో, వరుసగా ప్రతి ఏటా సుంకాన్ని తగ్గిస్తూ 20 శాతం సుంకాన్ని సున్నాకి తగ్గించాయి. ఈ ప్రాంతంలోని అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాలలో ఈ సుంకాలను సున్నాకి తగ్గించడానికి మరో మూడు సంవత్సరాల అదనపు వ్యవధి ఉంటుంది. భారత పాకిస్తాన్‌లు 2009లో ఈ ఒప్పందాన్ని అనుమోదించగా, సార్క్‌లో ఎనిమిదవ సభ్య దేశమైన ఆఫ్ఘనిస్తాన్, 2011 మే 4 న SAFTA ప్రోటోకాల్‌ను అనుమోదించింది [2]

చరిత్ర

[మార్చు]

సప్త (SAPTA)

[మార్చు]

1993 డిసెంబరులో కొలంబోలో జరిగిన SAARC ఆరవ శిఖరాగ్ర సమావేశంలో, 1997 నాటికి సౌత్ ఏషియన్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అరేంజ్‌మెంట్ (SAPTA)ని స్థాపించడానికి ఒక ఒప్పందాన్ని రూపొందించడానికి ఇంటర్-గవర్నమెంటల్ గ్రూప్ (IGG) ఏర్పాటును ఆమోదించారు.[3]

సాఫ్టా (SAFTA)

[మార్చు]

సార్క్ (ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక) సభ్యదేశాల పరస్పర వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికీ, రాయితీల మార్పిడి ద్వారా సార్క్ ప్రాంతంలో ఆర్థిక సహకారం కొనసాగించడానికీ ఈ ఒప్పందంపై 2004 లో సంతకం చేసారు. 2006 జనవరి 1 నుండి ఇది అమలు లోకి వచ్చింది.

12వ సార్క్ సదస్సులో 2004 జనవరి 6 న SAFTA ఒప్పందం కుదిరగా, ఎనిమిది ప్రభుత్వాలూ ఒప్పందాన్ని అనుమోదించిన తర్వాత, 2006 జనవరి 1 న అమల్లోకి వచ్చింది.[4]

SAFTA ప్రాథమిక సూత్రాలు క్రింది విధంగా ఉన్నాయి:

  1. అన్ని దేశాలకు సమానంగా ప్రయోజనం చేకూర్చేందుకు, వారి సంబంధిత స్థాయి ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి, వారి బాహ్య వాణిజ్య నమూనా, వాణిజ్య సుంక విధానాలు, వ్యవస్థలను పరిగణనలోకి తీసుకుని మొత్తం పరస్పర పరస్పర ప్రయోజనాలు ;
  2. క్రమానుగత సమీక్షల ద్వారా దశలవారీగా టారిఫ్ సంస్కరణల చర్చలు, మెరుగుపరచడం, వరుస దశల్లో విస్తరించడం;
  3. తక్కువ అభివృద్ధి చెందిన కాంట్రాక్టింగ్ రాష్ట్రాల ప్రత్యేక అవసరాలను గుర్తించడం, వారికి అనుకూలంగా సుస్థిరమైన చర్యలపై ఒప్పందం;
  4. అన్ని ఉత్పత్తులు, తయారీ వస్తువులను వాటి ముడి, సెమీ-ప్రాసెస్డ్, ప్రాసెస్ చేసిన రూపాల్లో చేర్చడం.

2011లో, ఆఫ్ఘనిస్తాన్ SAFTAలో చేరింది. [5]

దేశాల మధ్య మధ్యకాలిక, దీర్ఘకాలిక ఒప్పందాల వంటి ఉమ్మడి ఒప్పందాలను ప్రోత్సహించడం, పెంచడం SAFTA ఉద్దేశం. దేశాలు నిర్వహించే వాణిజ్యంతో కూడిన ఒప్పందాలు, నిర్దిష్ట ఉత్పత్తులకు సంబంధించి సరఫరా, దిగుమతి హామీ మొదలైనవి. ఇది జాతీయ సుంకాల రాయితీ, నాన్-టారిఫ్ రాయితీ వంటి సుంకాల రాయితీలపై ఒక ఒప్పందం ఉంటుంది.

ఒప్పందం లోని ప్రధాన లక్ష్యం, ఈ ప్రాంతంలో పోటీని ప్రోత్సహించడం, పాల్గొన్న దేశాలకు సమాన ప్రయోజనాలను అందించడం. దేశాల మధ్య పారదర్శకతనూ సమగ్రతనూ తీసుకురావడం ద్వారా దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం దీని లక్ష్యం. సుంకాన్ని, అడ్డంకులను తగ్గించడం ద్వారా సార్క్ దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకార స్థాయిని పెంచడానికి, సార్క్ దేశాలలో తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు (LDCs) ప్రత్యేక ప్రాధాన్యతను అందించడానికి, మరింత ప్రాంతీయ సహకారం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి కూడా SAFTA ఏర్పడింది. సార్క్ సభ్య దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కూడా కొనసాగిస్తుంది.

ఒప్పందం లోని భాగాలు

[మార్చు]

SAFTAలో చేరి ఉన్న సాధనాలు క్రిందివి:

  • వాణిజ్య సరళీకరణ కార్యక్రమం
  • మూలం యొక్క నియమాలు
  • సంస్థాగత ఏర్పాట్లు
  • సంప్రదింపులు
  • రక్షణ చర్యలు
  • అంగీకరించబడే ఏదైనా ఇతర సాధనం. [6]

వాణిజ్య సరళీకరణ కార్యక్రమం

[మార్చు]

వాణిజ్య సరళీకరణ కార్యక్రమం ప్రకారం, కాంట్రాక్టు దేశాలు తప్పనిసరిగా టారిఫ్ తగ్గింపు షెడ్యూల్‌ను అనుసరించాలి. నాన్-లీస్ట్ డెవలపింగ్ దేశాలు ఇప్పటికే ఉన్న టారిఫ్ నుండి 20% వరకు తగ్గాలి. తక్కువ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పటికే ఉన్న టారిఫ్ నుండి 30% తగ్గింపు ఉండాలి. కానీ సున్నితమైన వస్తువుల జాబితాపై కాంట్రాక్టు దేశాలు చర్చించి, ఆపై వర్తకం చేయాలి కాబట్టి ట్రేడ్ లిబరలైజేషన్ పద్ధతి సున్నితమైన జాబితాకు వర్తించదు. కాంట్రాక్టు దేశాల మధ్య ఉమ్మడి ఒప్పందంలో, సున్నితమైన జాబితా, తక్కువ అభివృద్ధి చెందిన కాంట్రాక్టు దేశాలకు అనుకూలంగా ఉంటుంది. SAFTA మినిస్టీరియల్ కౌన్సిల్ (SMC) జాబితాను కుదించే ఉద్దేశంతో ప్రతి నాలుగేళ్లకోసారి సున్నితమైన జాబితాను సమీక్షించేందుకు చర్చిస్తుంది.

సున్నితమైన అంశాల జాబితా

[మార్చు]

సున్నితాంశాల జాబితా అనేది, ప్రతి సభ్యదేశం లోనూ పన్ను రాయితీ లేని వస్తువుల జాబితా. బంగ్లాదేశ్‌కు SAFTA కింద అతి తక్కువ అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి 1,233 ఉత్పత్తులుండగా, తక్కువ అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి 1,241 ఉన్నాయి. బంగ్లాదేశ్ ఈ జాబితాను తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు (LDCలు) సంబంధించి 246, LDCయేతర దేశాలకు సంబంధించి 248 తగ్గిస్తుంది.[7] భారతదేశ జాబితాలో LDCలకు సంబంధించి 25, LDCయేతర సభ్యులకు సంబంధించి 695 అంశాలు ఉన్నాయి. అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, తమ జాబితాను 46 కి తగ్గిస్తున్నట్లు ఢాకాలో ప్రకటించాడు. భూటాన్‌లో ఎల్‌డిసిలు ఎల్‌డిసియేతరల కోసం 150 ఐటమ్‌లు ఉండగా, ఆ జాబితాను కుదించే ఆలోచన దానికి లేదు. నేపాల్‌లో ఎల్‌డిసిలకు 1,257, నాన్‌ఎల్‌డిసిలకు 1,295 ఉన్నాయి. నేపాల్ దాని మునుపటి జాబితా 1295 నుండి 259 తగ్గించింది. ఇప్పుడు అది 1036గా ఉందని వాణిజ్య, సరఫరాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి తెలిపారు.[8] మాల్దీవుల జాబితాలో మొత్తం ఏడు SAFTA దేశాలకు సంబంధించి 681 అంశాలున్నాయి. పాకిస్తాన్ తన సున్నితమైన జాబితాలో 1,169 ఉండగా,[9] దాన్ని 20% తగ్గించి 936కి సవత్రించింది. శ్రీలంక ప్రతికూల జాబితాలో 1,042 ఉండగా, ఆఫ్ఘనిస్తాన్ జాబితాలో 1,072 అంశాలున్నాయి.

SAFTA దుర్వినియోగం

[మార్చు]

నేపాల్ ద్వారా పామాయిల్‌ను భారతదేశంలోకి తరలించడానికి వ్యాపారులు SAFTAని ఉపయోగిస్తారు. వంటనూనెల వాణిజ్య సంస్థ అయిన సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA), దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద నేపాల్ నుండి పామాయిల్, సోయానూనె పరోక్ష సోర్సింగ్‌ను నిలిపివేయడానికి మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వాన్ని కోరింది. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దుకు వ్యతిరేకంగా ప్రధాన మంత్రి మహతీర్ మొహమ్మద్ తీసుకున్న చర్యలకు స్పందనగా మలేషియా పామాయిల్ దిగుమతులను ఆపడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యను అతిక్రమించడానికి ఈ పరోక్ష మార్గం సహాయపడింది. నేపాల్ ద్వారా పామాయిల్‌ను భారతదేశానికి పంపడానికి మలేషియాకు ఈ మార్గం సహాయపడింది. భారతదేశపు మొత్తం వంటనూనెల దిగుమతుల్లో దాదాపు మూడింట రెండు వంతుల వాటా పామాయిల్‌దే. భారతదేశం, ఇండోనేషియా మలేషియాల నుండి పామాయిల్‌ను కొనుగోలు చేస్తుంది, అయితే సోయానూనె ప్రధానంగా అర్జెంటీనా, బ్రెజిల్‌ల నుండి దిగుమతి అవుతుంది. ఉక్రెయిన్ నుండి పొద్దుతిరుగుడు నూనెను దిగుమతి చేసుకుంటుంది.[10]

ఇవి కూడా చూడండి

[మార్చు]

 

మూలాలు

[మార్చు]
  1. "South Asian Free Trade Area (SAFTA)". www.doc.gov.lk. Department of Commerce, Government of Sri Lanka. Archived from the original on 2023-02-19. Retrieved 2022-02-28.
  2. SAARC (2 November 2011). "SAFTA protocol". SAARC. Archived from the original on 7 అక్టోబరు 2011. Retrieved 2 November 2011.
  3. "FTA Analysis: A Comparative Analysis of Tariff Concessions offered by Sri Lanka to India under Various agreements signed by India & Sri Lanka". www.fieo.org. Federation of Indian Export Organisations. Retrieved 2022-02-28.
  4. Center, Asia Regional Integration. "South Asian Free Trade Area Free Trade Agreement". aric.adb.org. Retrieved 2018-03-02.
  5. Afghanistan Customs Department – South Asian Free Trade Area (SAFTA)
  6. A complete agreement of SAFTA
  7. BANGLADESH MAKES BIG CUT IN SAFTA
  8. "NEPAL CUTS ITS SENSITIVE LIST". Archived from the original on 2014-12-28. Retrieved 2024-08-11.
  9. PAKISTAN CUTS ITS SENSITIVE LIST
  10. "Traders use SAFTA to reroute palm oil through Bangladesh, Nepal: SEA". domain-b.com. 23 October 2019. Retrieved 2022-02-27.