Jump to content

దక్షిణ గోవా జిల్లా

వికీపీడియా నుండి
South Goa జిల్లా
దేశంభారతదేశం
రాష్ట్రంGoa
ముఖ్య పట్టణంMargão
మండలాలుSalcete, Mormugão, Quepem, Canacona, Sanguem, Dharbandora
Government
 • లోకసభ నియోజకవర్గాలుSouth Goa
విస్తీర్ణం
 • మొత్తం1,966 కి.మీ2 (759 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం6,39,962
 • జనసాంద్రత330/కి.మీ2 (840/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత85.53%
 • లింగ నిష్పత్తి980
ప్రధాన రహదార్లుNational Highway 17, National Highway 4A
Websiteఅధికారిక జాలస్థలి

గోవా రాష్ట్రం లోని రెండు జిల్లాలలో " సౌత్ గోవా " లేదా దక్షిణ గోవా ఒకటి. కొంకణి భూభాగంలోని జిల్లాలలో సౌత్ గోవా ఒకటి. జిల్లా ఉత్తర సరిహద్దులో నార్త్ గోవా, తూర్పు, దక్షిణ సరిహద్దులో కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా పడమటి సరిహద్దులో అరేబియా సముద్రం ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

1510లో సౌత్ గోవా ప్రాంతంలో పోర్చుగీసు కాలనీ స్థాపినచబడింది. 17 - 18 శతాబ్ధాలలో ఆ కాలనీ ప్రస్తుత సరిహద్దుల వరకు విస్తరించబడింది. 1961 డిసెంబర్ 19 లో గోవా భారతదేశంతో విలీనం చెయ్యబడింది. అలోగే మరొక రెండు పోర్చుగీసు భూభాగాలతో చేర్చి కేంద్రపాలిత ప్రాంతంగా రూపొందించబడింది. అలాగే 1965లో గోవా ఒకేఒక జిల్లాగా రూపొందినచబడింది. 1987 మే 30న గోవాకు రాష్ట్ర అంతస్తు ఇస్తూ రెండు జిల్లాలుగా విభజించబడింది. డయ్యూ, డామన్ మాత్రం కేంద్రపాలిత ప్రాంతంగా మిగిలిపోయింది. గోవా నార్త్ గోవా, సౌత్ గోవా అనే రెండు విభాగాలుగా విభజించబడింది.

నిర్వహణ

[మార్చు]

సౌత్ గోవా జిల్లాకు కలెక్టర్‌గా ఆర్.మిహర్ వర్ధన్ నియమించబడ్డాడు.[1] ఒక్కో తాలూకాకు ఒక్కో డిప్యూటీ కలెక్టర్, మామ్లాత్దార్లు నియమించబడ్డారు. మార్గావ్ జిల్లా కేంద్రంగా ఉంది.[2]

విభాగాలు

[మార్చు]
Talukas of Goa. Talukas in orange shades denote South Goa district.

సౌత్ గోవా జిల్లా కేంద్రం మారిగావ్. జిల్లా మార్గావ్, మర్మగోవా (వాస్కోడిగామా), క్యూపెం 3 ఉప విభాగాలుగా విభజించబడి ఉంది. అలాగే మర్మగోవా, సాల్సిటే (మార్గావ్), క్యూపెం, కంకోనా (చౌడి), సంగ్యూం, ధర్బండోరా అనే 6 తాలూకాలుగా విభజ్ంచబడ్డాయి. ప్రత్యేకమైన జిల్లా కార్యాలయాల భవనాలు మార్గావ్‌లో ఇంటర్‌సిటీ బస్టాండ్ పక్కన ఉన్నాయి. సాంఘిక కార్యకర్త, మునుపటి మంత్రి అయిన మాథనీ సాల్దంహా తరువాత ఆయన పేరును జిల్లాకార్యాలయాలకు పెట్టారు.[3]

గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 639,962 [4]
ఇది దాదాపు మొంటెగ్రో దేశజనసంఖ్యతో సమానం [5]
అమెరికాలోని వెర్మాంట్ నగర జనసంఖ్యకు సమం [6]
640 భారతదేశ జిల్లాలలో 515
1చ.కి.మీ జనసాంద్రత 326
2001-11 కుటుంబనియంత్రణ శాతం 8.63%
స్త్రీ పురుష నిష్పత్తి 980:1000
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 85.53% [4]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

సౌత్ గోవా జిల్లాలో కొంకణి మాతృభాష కలిగిన ప్రజలు అత్యధికంగా ఉన్నారు. తరువాత స్థానంలో మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్నారు. జిల్లాలో ఆంగ్లం, హిందీ భాషను అర్ధం చేసుకునే ప్రజలు అధికంగా ఉన్నారు. పోర్చుగీసు భాషను మాట్లాడే వారు అర్ధం చేసుకునే వారు స్వల్పసంఖ్యలో ఉన్నారు. కన్నడం, గుజరాతీ, బెంగాలీ, మలయాళ భాషలను మాతృభాషగా కలిగిన ప్రజలు ఆయా భాషలను మాట్లాడుతుంటారు.

విద్య

[మార్చు]

దక్షిణ గోవాలో ప్రముఖ కళాశాలలు అనేకం విద్యా సంస్థలు ఉన్నాయి :

  • పార్వతీభాయి ఛౌకులే కాలేజ్ మార్గావ్‌లో ఉంది.[7]
  • మహిళల కార్మెల్ కాలేజీ [8] న్యూవెంలో ఉంది.
  • జి.ఆర్ లా కరే కాలేజ్ [9] మార్గావ్‌లో ఉంది.
  • ఇంజనీరింగ్ Padre Conceicao కాలేజ్ ( పి.సి.సి.ఇ ) [10] వెర్నాలో ఉంది.
  • డాన్ బాస్కో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ [11] ఫతోర్డాలో ఉంది.
  • రోసరీ కాలేజ్ ఆర్ట్స్, కామర్స్ [12] న్యూవెంలో ఉంది.
  • ఎం.ఇ.ఎస్ కాలేజ్ [13] వాస్కోడగామాలో ఉంది .
  • శ్రీ మల్లికార్జున కాలేజ్ [14] కనాకోనాలో ఉంది.
  • సి.ఇ.ఎస్ కాలేజ్ [15] కంకోలింలో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. http://southgoa.nic.in/collectorate.htm
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-28. Retrieved 2014-05-10.
  3. http://timesofindia.indiatimes.com/city/goa/South-Goa-collectorate-named-after-Matanhy/articleshow/20358438.cms
  4. 4.0 4.1 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Montenegro 661,807 July 2011 est. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "2010 Resident Population Data". United States Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Vermont 625,741
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-25. Retrieved 2014-05-10. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-06. Retrieved 2014-05-10. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-28. Retrieved 2014-05-10. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-15. Retrieved 2014-05-10.
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-29. Retrieved 2014-05-10. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  12. http://rosarycollege.org/about/
  13. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-07-21. Retrieved 2014-05-10.
  14. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-04-19. Retrieved 2014-05-10.
  15. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-27. Retrieved 2014-05-10. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

వెలుపలి లింకులు

[మార్చు]