దాట్ల దేవదానం రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాట్ల దేవదానం రాజు
పుట్టిన తేదీ, స్థలందాట్ల దేవదానం రాజు
(1954-03-20) 1954 మార్చి 20 (వయసు 69)
జక్రియ నగర్ , యానాం,పుదుచ్చేరి రాష్ట్రం.
వృత్తిరచయిత , అభ్యుదయవాది
పౌరసత్వంభారతీయుడు
జీవిత భాగస్వామిఉదయభాస్కరమ్మ
సంతానండి.వి.యస్. రాజు,
శశికాంత వర్మ,
శిరీష

దాట్ల దేవదానం రాజు ప్రముఖ కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది. ఈయన అనేక కథలు, కవితా సంపుటాలు వ్రాసారు. ఈ కథా, కవితా సంపుటాలే కాకుండా ‘యానాం చరిత్ర’ వంటి గ్రంథాలను వెలువరించారు. శిల్పంలోని మెళకువల్ని ఆకళింపుచేసుకుని, వస్తువును హృద్యమైన కథగా మలచడంలో ప్రత్యేక శైలిని స్వంతం చేసుకున్నారు.[1] కుందుర్తి ఆంజనేయులు గారి శతజయంతి సందర్భంగా ఫ్రీవెర్స్ ఫ్రంట్ పురస్కారాన్ని 2022లో అందుకున్నారు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన తూర్పుగోదావరి జిల్లా లోని కోలంక ఒక వ్యవసాయ కుటుంబంలో 1954 మార్చి 20 న జన్మించారు.[1] ఈయన తల్లిదండ్రులు సూర్యనారాయణమ్మ, వెంకటపతిరాజు.వారి తల్లిదండ్రులకు ఈయన కంటే ముందు పుట్టిన 11 మంది పుట్టిన రెండు మూడు నెలల్లో చనిపోవడం జరిగింది.పిఠాపురం మిషనరీ హాస్పటల్లో డా:వైణిగమ్మ అమృతహస్తాల్లో ఆయన బతికి బట్ట కట్టగలిగారు.డా:వైణిగమ్మ గారే దేవుడిచ్చిన దానం "దేవదానం" అని నామకరణం చేసారు.దానికి కుల వాచకం "రాజు" చేర్చారు వారి తల్లిదండ్రులు. ఈయన ప్రాథమిక విద్యను కోలంకలో పూర్తి చేశారు.ఇంటర్మీడియట్ను రామచంద్రాపురంలోనూ, డిగ్రీని యానాం లోనూ చదివారు. ఆయన ఎకనమిక్స్, తెలుగు ప్రధానాంశాలలో ఎం.ఎను పూర్తిచేశారు. ఎంఇ.డిపూర్తి చేసిన తదుపరి తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలంలో కోలంక, ఇంజరం, పిల్లంక, నీలపల్లి గ్రామాల్లో ఉపాధ్యాయునిగా పనిచేసారు.[3][4]

సాహిత్యాభిలాష[మార్చు]

చిన్నతనంలో వారి ఇంటికి గురుతుల్యులైన వ్యక్తి వచ్చి వివిధ కథలను వినిపిస్తూ ఉండేవారు. అప్పటినుండి ఆయనకు కథల పట్ల ఆసక్తి పెరిగింది. తర్వాత పదవ తరగతిలో "టామ్‌ సాయర్", "హకిల్ బెరిఫిన్" వంటి కథలను చదివేవారు. యానాం కాలేజీ లోని తెలుగు అధ్యాపకులు శ్రీమతి కందర్ప వెంకటలక్ష్మీ నరసమ్మ గారి ప్రోత్సాహంతో చిన్న చిన్న కథలను వ్రాయడం మొదలుపెట్టారు. ఆయన మొదటి కథ "పేకాట బాగోతం" ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించారు. పిల్లల చదువుల నిమిత్తం ఆయన కోలంక నుండి యానాంకు మకాం మార్చారు. అచట శిఖామణితో పరిచయం ఆయనను కవిని చేసింది. అచట నెలనెలా జరిగే మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి స్మారక సభల్లో కవి సమ్మేళనం జరిగేది. దాని కోసం ప్రతినెలా ఒక కవిత వ్రాసేవారు. ఆ కవితలకు పత్రికలు ప్రోత్సాహమివ్వడంతో ఆయన పూర్తిస్థాయి కవిగా మారిపోయారు.2002 లో "దాట్ల దేవదానం రాజు కథలు" ప్రచురించారు. 2006 లో "సరదాగా కాసేపు" అనే రాజకీయ వ్యంగ్య కథను ప్రచురించారు.[3]

రచయిత్రి రంగనాయకమ్మ గారి "రామాయణ విషవృక్షం" చదివాక ఆయన ఆలోచనా దృక్పథంలో మార్పువచ్చింది. హేతువాద దృష్టి, ప్రశ్నించే తత్వం, సమాజ పరిణామాన్ని పరిశీలించడం అలవాటయ్యాయి.

2012 నవంబరు 10 తేదీన"కథాయానాం" పేరిట 100 మంది కథకుల్ని యానాం ఆహ్వానించి ఏ.సి. బోట్లో వర్థమాన కథ గురించి చర్చాగోష్ఠి నిర్వహించారు[5]. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి లబ్దప్రతిష్తులైన కథకులు హాజరయ్యరు.ఈ సంవత్సరం నుండి ప్రతి ఏటా ఒక కవినీ,ఒక కథకుడ్ని దాట్ల దేవదానం రాజు పేరిట 10వేలు తో సత్కరిస్తున్నారు.[6][3]

రచనలు[మార్చు]

  • వానరాని కాలం (1997) కవితా సంపుటి
  • గుండె తెరచాప (1999) కవితా సంపుటి
  • మట్టికాళ్ళు (2002) కవితా సంపుటి
  • దాట్ల దేవదానం రాజు కధలు(2002) కధా సంపుటి[1]
  • ముద్రబల్ల (2004) దీర్ఘకవిత
  • లోపలి దీపం (2005) కవితా సంపుటి
  • సరదాగా కాసేపు (2006) రాజకీయ వ్యంగ్య కధనాలు
  • యానాం చరిత్ర (2007)[1][7]
  • నదిచుట్టూ నేను (2007) కవితా సంపుటి
  • నాలుగో పాదం (2010) దీర్ఘ కవిత [8]
  • నాన్ గామ్ పాదమ్ (2010) (తమిళ అనువాదం)
  • కవితా సంపుటి- యానాం కథలు (2012)
  • కథాసంపుటి - నాల మతే పాదం(మలయాళ అనువాదం,ఎల్.ఆర్.స్వామి )(2012)
  • యానాం కథలు [9][10]
  • ప్రత్యేక సంచిక: ఉదయిని 60 సంత్సరాలు నిండిన సందర్భంగా
  • రహస్య మిత్రుడు - కథానిక[11]
  • కథల గోదారి (కథలు) [12][13]
  • కళ్యాణ పురం (కథా సంపుటి) [14]

సంపాదకుదు[మార్చు]

  • దూరానికి దగ్గరగా (వంతెన కవితలు)
  • సూరయ శాస్త్రీయం

అవార్డులు[4][మార్చు]

  1. వానరాని కాలం - ‘సరసం అవార్డు’ 1997
  2. ‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు; 1999
  3. ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ 2000
  4. ‘మట్టికాళ్ళు-ఆంధ్ర సారస్వత సమితి అవార్డు’ 2003
  5. ‘కళైమామణి’అవార్డు (పుదుచ్చేరి ప్రభుత్వం) 2003
  6. ‘రీజెన్సీ కళావాణి పురస్కారం’2004
  7. ‘ఉగాది ఉత్తమ కవి పురస్కారం’ YOHVO (2008)
  8. ‘తెలుగు రత్న’ అవార్డు (పుదుచ్చేరి ప్రభుత్వం) 2009
  9. సర్ ఆర్థర్ కాటన్ జలనిధి పుర్స్కారం (2010)
  10. గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాలు (2012) [15]
  11. కొ.కు సాహిత్య మనిహార్ పురస్కరం (2013)
  12. రాష్ట్రస్థాయి ఉత్తమ కథా పురస్కారం (2013,
  13. డాక్టర్ పరుచూరి రాజారామ్ సాహితీ పురస్కారం (2022) [4].

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "టోపీ". సారంగ (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-05-22. Archived from the original on 2020-10-21. Retrieved 2022-05-28.
  2. "ఫ్రీవెర్స్ ఫ్రంట్ ప్రతిభా పురస్కారాలు". వసుంధర అక్షరజాలం. 2022-05-08. Retrieved 2022-05-28.
  3. 3.0 3.1 3.2 "గోదావరి". thegodavari.com. Archived from the original on 2021-01-27. Retrieved 2022-05-28.
  4. 4.0 4.1 4.2 "దేవదానంరాజుకు సాహితీ పురస్కారం -" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-11. Retrieved 2022-05-28.
  5. Reporter, Staff (2013-01-29). "'Stories captured Yanam milieu'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-05-28.
  6. telugu, NT News (2022-05-15). "ఆవిష్కరణ సభ". Namasthe Telangana. Retrieved 2022-05-28.
  7. "యానాం చరిత్ర | Sundarayya Vignana Kendram". sundarayya.org. Retrieved 2022-05-28.
  8. "ఆలోచింపచేసే 'నాలుగోపాదం' – దాట్ల దేవదానం రాజు – పుస్తకం.నెట్". pustakam.net. Retrieved 2022-05-28.
  9. రాజు, దాట్ల దేవదానం (2012). యానాం కథలు. పాలపిట్ట బుక్స్.
  10. "Datla Devadanam Raju - Indian Novels Collective" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-05-28.
  11. "రహస్య మిత్రుడు – సారంగ". magazine.saarangabooks.com. Retrieved 2022-05-28.
  12. "కథల గోదారి".
  13. "దాట్ల దేవదానం రాజు | సంచిక - తెలుగు సాహిత్య వేదిక" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-05-28.
  14. "తాపీ ధర్మారావు రచనలపై విశ్లేషణ | సోపతి | www.NavaTelangana.com". m.navatelangana.com. Retrieved 2022-05-28.
  15. "దాట్ల దేవదానం రాజు | ప్రస్థానం". prasthanam.com. Retrieved 2022-05-28.

ఇతర లింకులు[మార్చు]