దాదన చిన్నయ్య
స్వరూపం
దాదన చిన్నయ్య అనంతపురం జిల్లాకు చెందిన సాహిత్యవేత్త.
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు అనంతపురం జిల్లా, తాడిపత్రి తాలూకా, నారాయణరెడ్డి పల్లెలోని ఒక రైతు కుటుంబంలో బయ్యన్న, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యకళాశాలలో చదివి విద్వాన్ పట్టా పుచ్చుకున్నాడు. తరువాత రాజమండ్రిలో పండిత శిక్షణను పూర్తి చేశాడు. తరువాత గుంతకల్లులో ఎస్.జె.పి.హైస్కూలు, బాలుర పురపాలకోన్నత పాఠశాలలలో తెలుగు పండితునిగా 35 సంవత్సరాలు పనిచేసి 1990లో పదవీవిరమణ చేశాడు. అవధాని చక్రాల లక్ష్మీకాంతరాజారావుతో కలిసి "దాదన - చక్రాల కవులు" పేరుతో జంటకవిత్వం చెప్పాడు[1]
రచనలు
[మార్చు]- రత్నదీపులు
- శ్రీ బళ్ళారిదుర్గాంబికా శతకము
- శ్రీ ఆంజనేయ శతకము
- తెలుగు రవలు (చాటువులు)
- శ్రీ గురుగీత (ఆంధ్ర పద్యానువాదము)
- ఋషి సూక్తులు
- శ్రీమద్భాగవతము
- రఘు విజయం (పద్యకావ్యము)
- శ్రీ వాసవీ విజయం (సంగీత రూపకం)
- భువన విజయం
- కవిసార్వభౌమ శ్రీనాథ
- కసాపుర శ్రీ ఆంజనేయ సుప్రభాతం
- శ్రీ శ్రీనివాస కళ్యాణం
- శ్రీ వీరబ్రహ్మంగారి చరిత్ర
- మాయదాసు (నాటిక)
మూలాలు
[మార్చు]- ↑ దాదన, చిన్నయ్య. చక్రాల, లక్ష్మీకాంతరాజారావు (ed.). శ్రి గురుగీత (ప్రథమ ed.). గుంతకల్లు: శ్రీ భారతీసాహితీ సమితి. p. 5-6.