దిగుమర్తి బుచ్చి కృష్ణమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దిగుమర్తి బుచ్చి కృష్ణమ్మ స్వాతంత్ర్య సమరయోధురాలు, చిత్రకారిణి.[1][2]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

బుచ్చి కృష్ణమ్మ 1900, ఆగస్టు 21న వెంకటరమణరావు, లక్ష్మీదేవి దంపతులకు రాజమహేంద్రవరంలో జన్మించింది. రమణరావు ఆయుర్వేద వైద్యుడు, వీరేశలింగం అనుచరుడు. పాఠశాల విద్య ఎనమిద తరగతిలోనే ఆపేసిన బుచ్చి కృష్ణమ్మ హిందీ విశారదలో ఉత్తీర్ణులయింది.

చిత్రకళారంగం[మార్చు]

అన్న రామారావు మాదిరిగానే బుచ్చి కృష్ణమ్మకు చిత్రకళపై ఆసక్తి ఉంది. అన్నతోపాటు బొమ్మూరు వెళ్లి గోదావరి నేపథ్యంగా ప్రకృతి దృశ్యాలు చిత్రించేది. బొబ్బిలి, పెద్దాపురం జమీందార్ల కుమార్తెలకు చిత్రకళ, హిందీ నేర్పించేది.

ఈవిడ పెన్సిల్ స్కెచెస్, వాటర్ కలర్స్ తో వివిధ అంశాలపై చిత్రాలు చిత్రించింది.

మరణం[మార్చు]

బుచ్చి కృష్ణమ్మ 1991, జనవరి 2న మరణించారు.

మూలాలు[మార్చు]

  1. దిగుమర్తి బుచ్చి కృష్ణమ్మ, విశిష్ట తెలుగు మహిళలు. దామెర వేంకట సూర్యారావు. రీమ్ పబ్లికేషన్స్. p. 243. ISBN 978-81-8351-2824.
  2. శోభనాచల బ్లాగ్. "మన చిత్రకారులు – దామెర్ల సత్యవాణి, బుచ్చి కృష్ణమ్మ గార్లు". sobhanaachala.blogspot.in. Retrieved 30 April 2017.[permanent dead link]