దిలేశ్వర్ కమైత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిలేశ్వర్ కమైత్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019
ముందు రంజీత్ రంజన్
నియోజకవర్గం సుపాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1946-02-02) 1946 ఫిబ్రవరి 2 (వయసు 78)
లక్ష్మినియా, త్రివేణిగంజ్, సుపాల్, బీహార్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్ (యునైటెడ్)
తల్లిదండ్రులు కుషో కమైత్, ముషర్నియా దేవి
జీవిత భాగస్వామి బీనా దేవి
సంతానం 3 కుమారులు, కుమార్తెలు 4
నివాసం భాగల్‌పూర్‌, బీహార్‌
వృత్తి రాజకీయ నాయకుడు

దిలేశ్వర్ కమైత్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సుపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

దిలేశ్వర్ కమైత్ జేడీయూ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో త్రివేణిగంజ్ శాసనసభ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సుపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రంజన్‌పై 2,66,853 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

దిలేశ్వర్ కమైత్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సుపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీయూ పార్టీ అభ్యర్థి చంద్రహాస్ చౌపాల్‌పై 1,69,803 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Supaul". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  2. TV9 Bharatvarsh, TV9 (5 June 2024). "कौन है सुपौल से जीत की हैट्रिक लगाने वाले दिलेश्वर कामैत? इतनी है नेटवर्थ". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. TimelineDaily (30 April 2024). "JD(U) Nominates Incumbent MP Dileshwar Kamat To Retain Supaul Seat" (in ఇంగ్లీష్). Retrieved 5 August 2024.