దుర్గావతి దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుర్గావతి దేవి
జననం(1907-10-07)1907 అక్టోబరు 7
మరణం1999 అక్టోబరు 15(1999-10-15) (వయసు 92)
ఘజియాబాద్ జిల్లా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, నవజవాన్ భారత్ సభ
ఉద్యమంభారత స్వాతంత్ర్యోద్యమం
జీవిత భాగస్వామిభగవతి చరణ్ వోహ్రా
పిల్లలుసచ్ఛీంద్ర వోహ్రా

దుర్గావతి దేవి (1907 అక్టోబరు 7 - 1999 అక్టోబరు 7) "దుర్గా భాభీ"గా సుపరిచితురాలు. ఆమె భారతీయ విప్లవ, స్వాతంత్ర్య సమరయోధురాలు. పాలక బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా సాయుధ విప్లవంలో చురుకుగా పాల్గొన్న కొద్దిమంది మహిళా విప్లవకారులలో ఆమె ఒకరు. ఆమె రైలు ప్రయాణంలో భగత్ సింగ్‌తో పాటు ఉండి అతడు సాండర్స్ హత్య తర్వాత మారువేషంలో తప్పించుకున్న సంఘటనలో ఆమె గుర్తింపు పొందింది. [1] ఆమె హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యురాలు, భగవతి చరణ్ వోహ్రా భార్య అయినందున, ఆ సంస్థ లోని ఇతర సభ్యులు ఆమెను బాభీ (అన్నయ్య భార్య) అని పిలిచేవారు. ఆమె భారతీయ విప్లవ వర్గాలలో "దుర్గా బాభీ"గా గుర్తింపు పొందింది.

జీవితం[మార్చు]

దుర్గావతి దేవికి పదకొండేళ్ల వయసులో భగవతి చరణ్ వోహ్రాతో వివాహం జరిగింది.

ఆమె నౌజవాన్ భారత్ సభలో చురుకైన సభ్యురాలు. లాహోర్‌లో 1926 నవంబరు 16 న కర్తార్ సింగ్ శరభ అమరవీరుల 11 వ వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని సభ నిర్ణయించినప్పుడు ఆమె ప్రాచుర్యంలోకి వచ్చింది. జెపి సాండర్స్ హత్య తర్వాత భగత్ సింగ్, శివరామ్ రాజగురు తప్పించుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.

63 రోజుల జైలు నిరాహార దీక్షలో జతీంద్రనాథ్ దాస్ మరణించిన తర్వాత లాహోర్ నుండి కలకత్తా వరకు జరిగిన అతని అంత్యక్రియలకు ఆమె నాయకత్వం వహించింది. మార్గమంతటా జరిగిన అంతిమయాత్రలో భారీ జనసమూహం చేరింది. [1]

విప్లవాత్మక కార్యకలాపాలు[మార్చు]

1929 అసెంబ్లీలో బాంబు విసిరిన సంఘటనలో భగత్ సింగ్ స్వయంగా లొంగిపోయిన తరువాత, దుర్గావతి దేవి హేలీని హత్య చేయడానికి ప్రయత్నించింది. కానీ అతను తప్పించుకున్నాడు. ఈ సంఘటనలో అతని సహచరులు చాలా మంది మరణించారు. ఆమెను పోలీసులు పట్టుకుని మూడేళ్లపాటు జైలులో ఉంచారు. ఆమె తన ఆభరణాలను కూడా 3000 రూపాయలకు అమ్మి ఆ సొమ్ముతో విచారణలో ఉన్న భగత్ సింగ్ తో పాటు అతని సహచరులను రక్షించడానికి ఖర్చు చేసింది. [2]

ఆమె తన భర్తతో కలిసి, హెచ్‌.ఎస్‌.ఆర్‌.ఏ సభ్యుడైన విమల్ ప్రసాద్ జైన్‌కు ఢిల్లీలోని కుతుబ్ రోడ్‌లో 'హిమాలయన్ టాయిలెట్స్' అనే బాంబ్ ఫ్యాక్టరీని నడిపించడంలో సహాయపడింది. ఈ ఫ్యాక్టరీలో వారు పిక్రిక్ యాసిడ్, నైట్రోగ్లిజరిన్, ఫుల్మినేట్ ఆఫ్ మెర్క్యూరీని తయారు చేసేవారు. [2] సాండర్స్‌ను చంపిన రెండు రోజుల తర్వాత 1928 డిసెంబరు 19 న, సుఖ్‌దేవ్ సహాయం కోసం దేవిని పిలిచాడు, ఆమె చేయడానికి అంగీకరించింది. మరుసటి రోజు ఉదయం హౌరా ( కలకత్తా ) మార్గంలో లాహోర్ నుండి బటిండాకు బయలుదేరే రైలును పట్టుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఆమె భగత్ సింగ్ భార్యగా నటించి, తన కుమారుడు సచిన్‌ను తన ఒడిలో పెట్టుకుంది. అయితే రాజగురు సేవకునిగా నటించి వారి సామానును తీసుకువెళ్లాడు. ఎవరూ గుర్తించకుండా భగత్ సింగ్ తన గడ్డం తీసి, జుట్టును తక్కువగా కత్తిరించి పాశ్చాత్య దుస్తులు ధరించాడు. నిజానికి 1928 డిసెంబరు 19 రాత్రి భగత్ సింగ్, సుఖ్‌దేవ్ ఆమె ఇంటికి వచ్చినప్పుడు, సుఖ్‌దేవ్ భగత్ సింగ్‌ను కొత్త స్నేహితుడిగా పరిచయం చేశాడు. దేవి భగత్ సింగ్‌ను అస్సలు గుర్తించలేదు. అప్పుడు సుఖ్‌దేవ్ దేవికి నిజం చెప్పాడు. భగత్ సింగ్‌ని క్లీన్ షేవ్ చేసిన రూపాన్ని అతనికి బాగా తెలిసినప్పటికీ దేవి గుర్తించలేకపోతే, గడ్డం ఉన్న సిక్కును వెతుకుతున్నందున కచ్చితంగా పోలీసులు అతన్ని గుర్తించరు అని చెప్పాడు. [2] మరుసటి రోజు ఉదయం వారు ఇంటి నుండి బయలుదేరారు. స్టేషన్‌లో, భగత్ సింగ్, తన రహస్య గుర్తింపుతో, కాన్‌పూర్ (కాన్పూర్) కి మూడు టిక్కెట్లు కొన్నాడు. దేవి, తనకు రెండు ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు, రాజగురుకి మూడవ తరగతి టిక్కెట్టు ఒకటి కొన్నాడు. ఏదైనా ఊహించని సంఘటనను ఎదుర్కోవటానికి ఇద్దరూ తమతో పాటు లోడ్ చేసిన రివాల్వర్‌లను ఉంచుకున్నారు. వారిని పోలీసులు అనుమానించకుండా తప్పించుకుని రైలు ఎక్కారు. కాన్పూర్ వద్ద ప్రయాణాన్నిమార్పు చేస్తూ, వారు లక్నోకు రైలు ఎక్కారు. ఎందుకంటే హౌరా రైల్వే స్టేషన్‌లో సిఐడి అధికారులు సాధారణంగా లాహోర్ నుండి నేరుగా రైలులో వచ్చే ప్రయాణికులను పరీక్షించేది. లక్నోలో రాజ్‌గురు బెనారస్‌కు విడివిడిగా బయలుదేరాడు. భగత్ సింగ్, దేవి, ఆమె కుమారుడు హౌరాకు వెళ్లారు. దేవి కొన్ని రోజుల తర్వాత తన శిశువుతో లాహోర్ తిరిగి వచ్చింది. [3]

తరువాత జీవితంలో[మార్చు]

ఇతర స్వాతంత్ర్య సమరయోధుల వలె కాకుండా, భారత స్వాతంత్ర్యం తరువాత, దుర్గా ఘజియాబాద్‌లో నిశ్శబ్ద అజ్ఞాతంలో ఉండి సాధారణ పౌరురాలుగా జీవించడం ప్రారంభించింది. తర్వాత ఆమె లక్నోలో పేద పిల్లల కోసం ఒక పాఠశాలను ప్రారంభించింది.

1999 అక్టోబరు 15 న 92 సంవత్సరాల వయస్సులో దుర్గావతి దేవి ఘజియాబాద్‌లో మరణించింది. [1]

రాకీష్ ఓంప్రకాష్ మెహ్రా యొక్క 2006 చిత్రం రంగ్ దే బసంతిలో ఆమె పాత్రకు సంబంధించిన చిన్న సూచన కనిపించింది, అక్కడ సోహా అలీ ఖాన్ ఆమె పాత్రను పోషించింది. [2] 2014 ఇండియన్ ఎపిక్ టీవీ ఆంథాలజీ టెలివిజన్ సిరీస్, అదృశ్య ఏడవ ఎపిసోడ్ దుర్గావతి గురించి వివరించబడింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "The Tribune...Sunday Reading". Tribuneindia.com. Retrieved 9 November 2012.
  2. 2.0 2.1 2.2 2.3 "Children of Midnight Durgawati Devi: The Fearless Lady!". YoungBites. Major Kulbir Singh. 11 January 2018. Retrieved 19 June 2019.
  3. Bakshi, S. R. (1988). Revolutionaries and the British Raj. Atlantic Publishers. p. 61.

బాహ్య లింకులు[మార్చు]