దూరమానము

దూరమానం అనగా దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలను ఒక రకమైన ప్రమాణం నుండి వేరొక విధమైన ప్రమాణానికి మార్చే విధానం. దీనిని దైర్ఘ్య మానం అని కూడా అంటారు. ప్రమాణాలు ముఖ్యంగా సి.జి.ఎస్, ఎఫ్.పి.ఎస్, ఎం.కె.ఎస్ అనే మూడు రకాలైనవి ఉంటాయి. ప్రతీ ప్రమాణంలో పొడవు, ద్రవ్యరాశి, కాలం అనబడే మూల ప్రమాణాలు ఉంటాయి. సి.జి.ఎస్ విధానంలో పొడవుకు సెంటీ మీటరు, ద్రవ్యరాశికి గ్రాము, కాలానికి సెకను ప్రమాణాలుగా ఉంటాయి. ఎఫ్.పి.ఎస్ విధానంలో పొడవుకు అడుగు, ద్రవ్యరాశికి పొండు, కాలానికి సెకను ప్రమాణాలుగా ఉంటాయి. ఎం.కె.ఎస్. విధానంలో పొడవుకు మీటరు, ద్రవ్యరాశికి కిలోగ్రాము కాలానికి సెకను ప్రమాణాలుగా ఉంటాయి. కాలానుగుణంగా భౌతిక శాస్త్ర అభివృద్ధి జరిగిన తరువాత ఇతర భౌతిక రాశులకు కూడా ప్రమాణాలను సృష్టించవలసిన అవసరం వచ్చింది. అందువలన ఎం.కె.ఎస్ విధానంలో పొడవు, ద్రవ్యరాశి, కాలాలతో పాటు ఉష్ణోగ్రత, కాంతి తీవ్రత, విద్యుత్ ప్రవాహం మొదలైన రాశుల ప్రమాణాలను చేర్చి ఎస్.సి (ఇంటర్నేషనల్ సిస్టం ఆఫ్ యూనిట్స్) ప్రమాణం వాడుకలోకి వచ్చింది.[1]
పొడవుకు సంబంధింది దూరమానంలో అతి చిన్న ప్రమాణాలతో పాటు పెద్ద ప్రమాణాలు కూడా వాడుకలో ఉన్నాయి. వాటిని ఒక రూపం నుండి వేరొక రూపంలోనికి మార్చడమే దూరమానం.
వివిధ దూరమానాలు
[మార్చు]మెట్రిక్ వ్యవస్థలో దూరమానాలు
- 10 మిల్లీ మీటర్లు - 1 సెంటీ మీటరు
- 10 సెంటీ మీటర్లు - 1డెసీ మీటరు
- 10 డెసీ మీటర్లు - 1మీటరు
- 10మీటర్లు - 1డెకా మీటరు
- 10డెకా మీటర్లు - 1హెక్టా మీటరు
- 10హెక్టా మీటర్లు - 1కిలో మీటరు
మెట్రిక్ వ్యవస్థ పూర్వలగ్నాలు
[మార్చు]| మెట్రిక్ పూర్వలగ్నాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పై పట్టిక ఆధారంగా వివిధ ప్రమాణాలను ఎస్.ఐ ప్రమాణాలకు మార్చిడి చేయవచ్చును.
- యెక్టో మీటరు = 10-24 మీటర్లు
- జెప్టో మీటరు = 10-21 మీటర్లు
- అట్టో మీటరు = 10-18 మీటర్లు
- ఫెమ్టో మీటరు = 10-15 మీటర్లు
- పీకో మీటరు = 10-12 మీటర్లు
- నానో మీటరు = 10-9 మీటర్లు
- మైక్రో మీటరు = 10-6 మీటర్లు
- మిల్లీ మీటరు = 10-3 మీటర్లు
- సెంటీ మీటరు = 10-2 మీటర్లు
- డెసి మీటరు = 10-1 మీటర్లు
- డెకా మీటరు = 10 మీటర్లు
- హెక్టా మీటరు = 102 మీటర్లు
- కిలో మీటరు = 103 మీటర్లు