దేవిడి ఇక్బాల్ ఉద్-దౌలా
దేవిడి ఇక్బాల్ ఉద్-దౌలా | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | రాజభవనం |
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
దేవిడి ఇక్బాల్ ఉద్-దౌలా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ఒక రాజభవనం.[1] నిజాం రాజుల వారసత్వ కట్టడం. నిజాం ప్రభువు సర్ వికార్ ఉల్ ఉమ్రా (ఇక్బాల్ ఉద్-డౌలా)కు చెందిన దేవిడి.[2] ఈ చారిత్రక నిర్మాణం ప్రస్తుతం కూలిపోయే స్థితిలో ఉంది.[3][4] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
చరిత్ర
[మార్చు]ఈ భవనాన్ని నిజాం రాజు నవాబ్ ఫక్రుద్దీన్ నిర్మించాడు. యూరోపియన్ దేశాలకు చెందిన చేతివృత్తుల వారు ఈ నిర్మాణాన్ని పూర్తి చేసారు. '20వ శతాబ్దం ప్రారంభంలో నిజాం రాజు బేగంపేటలోని పైగా ప్యాలెస్‌కి నివాసం మార్చిన తర్వాత ఈ రాజభవనం నిరుపయోగంగా మారిందని' ఒమర్ ఖలిది రాసిన 'ఏ గైడ్ టు ఆర్కిటెక్చర్ ఇన్ హైదరాబాద్, డెక్కన్, ఇండియా'లో రాయబడింది.[5]
నిర్మాణం
[మార్చు]ఈ భవనంలో నాలుగు తొట్టెలు, ఒక సెంట్రల్ సిస్టర్న్, అనేక గదులు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను కలిగివున్నాయి. జెనానా, స్లీపింగ్ క్వార్టర్స్, డైనింగ్, డ్రాయింగ్ రూమ్‌లు, ఆఫీసులు కూడా ఉన్నాయి. లోపలి భాగంలోని తలుపుల చుట్టూ, పై భాగంలోనూ, ఒక గది నుఏండి మరో గదికి వెళ్ళే ద్వారా తోరణంకి వివిధ ఆకృతుత్లో డిజైనులు చెక్కబడి ఉన్నాయి.[6]
ప్రస్తుతం
[మార్చు]ఈ భవనం సినిమా షూటింగులకు తరచుగా ఉపయోగిస్తుంటారు. షూటింగ్ చేసేటపుడు రోలింగ్ క్రేన్లు, ఇతర భారీ పరికరాల బరువుల వల్ల భవన ప్రధాన ప్రాంగణం శిథిలమైపోయి, పగిలిపోయింది. భవనం గోడ పక్కన ఒక చెత్త డబ్బా ఉంచబడింది. ఆహారం కోసం వచ్చిన ఎలుకలు ఆ గోడలను త్రవ్వి నాశనం చేస్తున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ rasia (2018-06-21). "Iqbal-ud-Dowla Devdi on the verge of destruction". The Siasat Daily – Archive (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-21.
- ↑ "Monumental apathy: Iqbal-ud-Dowla Devdi lies in a shambles in Old City - Times of India". The Times of India. Retrieved 2021-08-21.
- ↑ "Iqbal-ud-Dowla Devdi on the verge of destruction – The Siasat Daily". The Siasat Daily (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2018-06-21. Retrieved 2021-08-21.
- ↑ Imam, Syeda (2008-01-01). The Untold Charminar: Writings on Hyderabad (in ఇంగ్లీష్). Penguin Books. ISBN 9780143103707.
- ↑ Nov 29, TNN / Updated:; 2016; Ist, 13:13. "Monumental apathy: Iqbal-ud-Dowla Devdi lies in a shambles in Old City | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-21.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ Khan, Asif Yar (2017-07-18). "Hyderabad: Paigah marvels cry for attention". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2021-08-21.