దేవి గ్రంథం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవి గ్రంథం సజిని
దేవి గ్రంథం సజిని
జననం
దేవి గ్రంథం (సజిని)

మే 31, 1984
ఇతర పేర్లుసజిని
వృత్తినటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు,
క్రియాశీల సంవత్సరాలు1996 - ప్రస్తుతం

దేవి గ్రంథం (సజిని) దక్షిణ భారత చలనచిత్ర నటి. 1996లో శ్రీకాంత్ హీరోగా నటించిన లవ్ గేమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దేవి, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాలలో నటించింది.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

దేవి, 1984, మే 31న రాజారావు, రాజలక్ష్మీ దంపతులకు విజయవాడలో జన్మించింది. తండ్రి జనతా దళ్ నాయకుడు. బి.ఏ. రాజకీయశాస్త్రం చదువు మధ్యలోనే మానేసింది.

కళారంగం[మార్చు]

ఏడేళ్ల వయసునుండే కళారంగంలోకి అడుగుపెట్టింది. 12 సంవత్సరాల వరకు విజయవాడ ఆకాశవాణిలో పనిచేసింది. 500లకు పైగా స్టేజి కార్యక్రమాలలో పాల్గొంది.

సినిమారంగం[మార్చు]

1996లో శ్రీకాంత్ హీరోగా నటించిన లవ్ గేమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఎర్రసూరీడు, సరదాల సంసారం, అమ్మ దుర్గమ్మ, భలే పోలీస్, పీపుల్స్ భరతక్క, తారాశశాంకం, ఓ స్త్రీ రేపురా, పోలీసు వాళ్లు, ఆవారాగాడు వంటి 25 తెలుగు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. నాగజోడి, మాంత్రికుడు, అధికారి, అశ్విని వంటి 25 కన్నడ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. మణివర్ణ తువాల్‌, చందన మారంగల్‌, ప్రేమశిల్పి, డ్రైవింగ్‌ స్కూల్‌, ఇన్‌ ఎనికి పుట్టు కుటన్‌, సౌందర్య వంటి 70 మలయాళ సినిమాలలో హీరోయిన్ గా నటించింది.[1]

రాజకీయరంగం[మార్చు]

1996లోనే రాజకీయాల్లోకి ప్రవేశించింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల తరపున సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. 2018 నుండి జనసేన పార్టీ నుండి రెండు తెలుగు రాష్ట్రాల లో నాయకురాలు గా కొనసాగుతూ ప్రజల సేవా కార్యా క్రమాలు నిర్వహిస్తున్నారు.

మూలాలు[మార్చు]

  1. MalayalaSangeetham.Info. "Sajini". en.msidb.org. Retrieved 31 May 2017.