దేవిప్రియ

వికీపీడియా నుండి
(దేవీప్రియ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దేవిప్రియ
జననంషేక్ ఖాజాహుస్సేన్
(1949-08-15)1949 ఆగస్టు 15
India గుంటూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం2020 నవంబరు 21(2020-11-21) (వయసు 71)
హైదరాబాదు
మరణ కారణంమధుమేహం
నివాస ప్రాంతంగుంటూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా
ఇతర పేర్లుఖాజాహుస్సేన్
వృత్తిపాత్రికేయుడు
రచయిత
మతంఇస్లాం
తండ్రిషేక్ హుస్సేన్ సాహెబ్
తల్లిషేక్ ఇమాం బీ

దేవిప్రియ లేదా ఖ్వాజా హుస్సేన్‌ ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు. దేవిప్రియ రచించిన 'గాలిరంగు' కవిత్వానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[1]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

దేవిప్రియ 1949 ఆగష్టు 15గుంటూరులో జన్మించాడు.[2] ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు షేక్ ఖాజాహుస్సేన్. తండ్రి పేరు షేక్ హుస్సేన్ సాహెబ్. తల్లి షేక్ ఇమాం బీ.[3] గుంటూరు లోని ఎ.సి.కాలేజీలో బి.ఏ. చదువుకున్నాడు.

కవిత్వ రచన

[మార్చు]

కాలేజీ రోజుల్లోనే కవిత్వం పట్ల ఆకర్షితుడై పద్యాలు, గేయాలు వ్రాయడం ప్రారంభించాడు. గుంటూరు కేంద్రంగా అవతరించిన పైగంబర కవులు బృందంలో దేవిప్రియ ఒకడు. పాత్రికేయుడుగా ప్రజావాహిని, నిర్మల, ప్రజాతంత్ర, జ్యోతి, మనోరమ మొదలైన పత్రికలలోనూ, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం, హైదరాబాద్ మిర్రర్ దినపత్రికలలోను పనిచేశాడు. వ్యంగ్య, విమర్శనాత్మకమైన ఇతని 'సమాజానందస్వామి', 'రన్నింగ్ కామెంటరీ' కార్టూన్ కవిత్వం ద్వారా తెలుగు పత్రికారంగంలో కొత్త ఒరవడిని సృష్టించాడు.

సినిమారంగం

[మార్చు]

సినిమా రంగంపై సాధికారమైన వ్యాసాలు వ్రాశాడు. దాసి, రంగులకల మొదలైన సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు వ్రాశాడు. ప్రజాగాయకుడు గద్దర్ ఆంగ్లంలో పూర్తి నిడివి డాక్యుమెంటరీ ఫిలిం మ్యూజిక్ ఆఫ్ ఎ బ్యాటిల్‌షిప్ పేరుతో నిర్మించి దర్శకత్వం వహించాడు.

స్వయంగా 'మనోరమ' వారపత్రిక నడిపారు. 'హైదారాబాద్‌ మిర్రర్‌' దినపత్రికకు వ్యవస్థాపక ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం 'హెచ్‌ఎం టివీ'లో సీనియర్‌ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 'ఉదయం' దినపత్రిక నాటి 'రన్నింగ్ కామెంట్రీ'ని 'హెచ్‌ఎంటివీ'లో దృశ్యీకరిస్తున్నారు.

రచనలు

[మార్చు]
  1. అమ్మచెట్టు (1979)
  2. సమాజానందస్వామి (1977)
  3. గరీబు గీతాలు (1992)
  4. నీటిపుట్ట (1990)
  5. తుఫాను తుమ్మెద (1999)
  6. రన్నింగ్ కామెంటరీ (3 సంపుటాలు) (2013)
  7. అరణ్య పురాణం
  8. పిట్ట కూడా ఎగిరిపోవలసిందే (2001)
  9. చేప చిలుక (2005)
  10. అధ్యక్షా మన్నించండి (సంపాదకీయాలు) (2010)
  11. గాలిరంగు (2011)
  12. గంధకుటి (2009)
  13. ఇన్షా అల్లాహ్ (పద్యకావ్యం)
  14. Poornamma the golden doll (అనువాదం)
  15. The Cobra Dancer (కె.జె.రావు జీవితకథ)

పురస్కారాలు

[మార్చు]

మరణం

[మార్చు]

ఐదు దశాబ్దాల పాటు ప్రముఖ పాత్రికేయుడిగా, కవిగా సేవలందించిన దేవిప్రియ కొంత కాలంగా మధుమేహంతో బాధపడుతూ 2020, నవంబరు 21వ తేదీన హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 సాక్షి (21 December 2017). "దేవిప్రియ కవిత్వానికి కేంద్ర సాహిత్య పురస్కారం". Retrieved 22 December 2017.
  2. పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు కరపుస్తకం నుండి
  3. అక్షరశిల్పులు- సయ్యద్ నశీర్ అహ్మద్
  4. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.
  5. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (14 July 2016). "'సమాజానికి నిజమైన వైద్యులు సాహితీవేత్తలే'". www.andhrajyothy.com. Archived from the original on 12 July 2020. Retrieved 12 July 2020.
  6. ఘనంగా సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం, తెలుగువాణి, తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ, ఏప్రిల్-ఆగస్టు 2016, హైదరాబాదు పుట. 42.
  7. విలేకరి (22 November 2020). "ప్రముఖ కవి దేవిప్రియ కన్నుమూత". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 22 November 2020.