తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2013)
సాహితీ పురస్కారాలు (2013) | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలు | |
వ్యవస్థాపిత | 1990 | |
మొదటి బహూకరణ | 1990 | |
క్రితం బహూకరణ | 2012 | |
బహూకరించేవారు | తెలుగు విశ్వవిద్యాలయం | |
నగదు బహుమతి | ₹ 20,116 | |
Award Rank | ||
2012 ← సాహితీ పురస్కారాలు (2013) → 2014 |
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తారు.[1]
1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[2]
పురస్కార గ్రహీతలు
[మార్చు]2013 సంవత్సర సాహితీ పురస్కారానికి 10 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి. 2016, జూలై 13న తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. సత్తిరెడ్డి, డా. జుర్రు చెన్నయ్య పాల్గొన్నారు.[3][4]
క్రమ
సంఖ్య |
గ్రంథం పేరు | గ్రంథకర్త పేరు | ప్రక్రియ | దాత |
---|---|---|---|---|
1 | శ్రీ చరణ శరణాగతి | ఆచార్య రావికంటి వసునందన్ | పద్య కవిత | |
2 | గాలిరంగు | దేవిప్రియ | వచన కవిత | |
3 | - | - | గేయ కవిత | |
4 | చింటుగాడి కథలు | పైడిమర్రి రామకృష్ణ | బాల సాహిత్యం | |
5 | పేగు కాలిన వాసన | ఎ.ఎన్. జగన్నాథ శర్మ | కథానిక | |
6 | వొయినం | జాజుల గౌరి | కథా సంపుటి, నవల | |
7 | సాహిత్యవీధి | డా. శ్రీరంగా చార్య | నవల, సాహిత్య విమర్శ | |
8 | గుణనిధి | డా. కొట్టే వెంకటాచార్యులు | నాటకం/నాటిక | |
9 | మాల్గుడి కథలు | ఆచార్య సి.మృణాళిని | అనువాదం | |
10 | తెలివాహ గోదావరి | డా. సంగనభట్ల నర్సయ్య | వచన రచన | |
11 | నిర్జన వారధి | కొండపల్లి కోటేశ్వరమ్మ | రచయిత్రి ఉత్తమ గ్రంథం |
ఇవికూడా చూడండి
[మార్చు]- తెలుగు విశ్వవిద్యాలయం
- తెలుగు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారాలు (2012)
- తెలుగు విశ్వవిద్యాలయం - ప్రతిభా పురస్కారాలు (2017)
- తెలుగు విశ్వవిద్యాలయం - సాహితీ పురస్కారాలు (2017)
- విశిష్ట పురస్కారాలు
- రంగస్థల యువ పురస్కారం
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, హైదరాబాదు (18 June 2019). "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు". Archived from the original on 18 June 2019. Retrieved 12 July 2020.
- ↑ "తెలుగువర్సిటీ సాహితీ పురస్కారాలకు సూచనలు". EENADU. 2022-07-31. Archived from the original on 2022-08-06. Retrieved 2023-01-27.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (14 July 2016). "'సమాజానికి నిజమైన వైద్యులు సాహితీవేత్తలే'". www.andhrajyothy.com. Archived from the original on 12 July 2020. Retrieved 12 July 2020.
- ↑ ఘనంగా సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం, తెలుగువాణి, తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ, ఏప్రిల్-ఆగస్టు 2016, హైదరాబాదు పుట. 42.