Jump to content

థింపూ

వికీపీడియా నుండి
(ధింపు నుండి దారిమార్పు చెందింది)

థింపూ ( Tibetan script: ཐིམ་ཕུག།, Dzongkha :ཐིམ་ཕུ ) భూటాన్ లోని అతి పెద్ద నగరం, ఆ దేశ రాజధాని. పడమటి మధ్య భాగంలోని థింపూ జిల్లాలో గల ఈ నగరం చుట్టూ ఉన్న లోయ పేరు డ్జోంగ్ఖాగ్. 1961 నుండి థింపూ యే దేశ రాజధాని. 2005 నాటికి ఈ జిల్లా జనాభా 98,767 కాగా, నగరంలో జనాభా 79, 185.

థింపూలో మంచు


వాంగ్ చూ నది వలన ఏర్పడ్డ పడమటి లోయకి ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కు వరకు థింపూ నగరం వ్యాపించి ఉంది. అయితే ఇతర దేశ రాజధానులవలె థింపూకు విమానాశ్రయం లేదు. పారో విమానాశ్రయం నుండి థింపూకు క్యాబ్ ల ద్వారా ప్రయాణించవచ్చును.

థింపూ నగరంలో ఒక ప్రధాన రహదారి.

రాజకీయ, ఆర్థిక శక్తి గల థింపూ వ్యవసాయంలోను ముందుండటంతో దేశ GNP కి 45% తోడ్పడుతుంది. పర్యాటకం దేశ ఆదాయనికి అతి ముఖ్యమైనప్పటికీ ఈ రంగం వలన దేశ సంప్రదాయాలకి ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకొన్నది.

థింపూలో క్లాక్ టవర్

సాహిత్యంలో, మతంలో, పద్ధతుల్లో, జాతీయ వస్త్రధారణలో, సంగీతంలో, నృత్యంలో, ప్రకటనా రంగంలో థింపూ భూటాన్ సంస్కృతిని పుణికి పుచ్చుకుంటుంది.

చరిత్ర

[మార్చు]

1960 కి పూర్వం థింపూ పల్లెటూళ్ళ సమూహంగా ఉండేది. 1885 లో ఇప్పటి చాంగ్లిమిథాంగ్ మైదానంలో ఒక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఉగ్యెన్ వాంగ్చుక్ గెలుపొందాడు. అప్పటి నుండి ఈ మైదానం చాలా ప్రాముఖ్యత సంపాదించుకొన్నది. ఇందులో ఇప్పుడు క్రికెట్, ఫుట్ బాల్, విల్లంబుల పోటీలు నిర్వహింపబడతాయి. 1974 లో ఈ మైదానం పునర్నిర్మింపబడింది. వాంగ్చూ వంశస్థులు సంఘ శ్రేయోభిలాషులు కావటంతో దేశమంతా శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లినది. మూడవ రాజు జిగ్మే దోర్జీ వాంగ్చుక్ జమీందారీ వ్యవస్థను నిర్మూలించి, పన్ను విధానాలను మార్చి అభివృద్ధికి దోహదపడ్డాడు. 1952లో పునాఖా నుండి రాజధానిని థింపూకి మార్చారు. నాల్గవ రాజు జిగ్మే సింగ్యే వాంగ్చుక్ దేశాభివృద్ధికి భారతదేశం సహాయ సహకారాలను పొందాడు. 1961 లో థింపూ భూటాన్ రాజధానిగా ఏర్పడినది.

రాయల్ ఇన్స్యురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ భూటాన్ భవనము.
"https://te.wikipedia.org/w/index.php?title=థింపూ&oldid=3183037" నుండి వెలికితీశారు