ధృవవిజయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధృవవిజయం
(1936 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్తజల్లు పుల్లయ్య
రచన బలిజేపల్లి లక్ష్మికాంతం
తారాగణం మాస్టర్ నరసింహస్వామి,
టి. వెంకటేశ్వర్లు,
ఎ. నరసింహరావు,
పి.హేమలత,
లలిత
సంగీతం ప్రభల సత్యనారాయణ
కళ అడవి బాపిరాజు
నిర్మాణ సంస్థ ఈస్టిండియా ఫిల్మ్స్
విడుదల తేదీ మే 8, 1936
భాష తెలుగు

చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో 1936లో ఈస్ట్‌ ఇండియా ఫిలిం కంపెనీ పతాకంపై తెలుగులో ధ్రువ విజయము, సతీ అనసూయ అనే రెండు సినిమాలు కలిసి రూపొందించి జతగా మే 8, 1936న విడుదల చేశారు. పెద్ద నటీనట వర్గంతో 'ధ్రువ విజయము', పిల్లలతో 'సతీ అనసూయ' నిర్మించారు. అప్పట్లో ఒకే టిక్కెట్‌పై రెండు సినిమాలు కలిసి చూపించే పద్ధతికి శ్రీకారం చుట్టారు. టిక్కెట్టు వెల రెండు అణాలు ('బేడ').

ఈ సినిమాకు రేలంగి వెంకట్రామయ్య ప్రొడక్షన్‌ మేనేజర్‌గా వ్యవహరించారు. కళ అడవి బాపిరాజు, సంగీతం : ప్రభల సత్యన్నారాయణ. 'జో అచ్యుతానంద జో జో ముకుంద' అనే అన్నమాచార్య కీర్తన ఈ చిత్రంలో ప్రప్రథమంగా వినిపించారు. మాటలు, పాటలు రికార్డుల రూపంలో రావడం ఈ చిత్రంతోనే ప్రారంభం అయింది. రికార్డులు సన్‌ రికార్డింగ్‌ కంపెనీవారు విడుదల చేశారు.[1]

నటవర్గం[మార్చు]

  • మాస్టర్ నరసింహస్వామి
  • టి. వెంకటేశ్వర్లు
  • ఎ. నరసింహరావు
  • హేమలత
  • లలిత
సి.పుల్లయ్య

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: చిత్తజల్లు పుల్లయ్య
  • రచన: బలిజేపల్లి లక్ష్మికాంతం
  • సంగీతం: ప్రభల సత్యనారాయణ
  • కళ: అడవి బాపిరాజు
  • నిర్మాణ సంస్థ: ఈస్టిండియా ఫిల్మ్స్

పాటలు[మార్చు]

  1. ఆనందించితిగా కుమార నే ధీనిధానా నీ ధీరతపమునకు
  2. ఏల ఈ సాహసము సరేశా బాలుడంచున్ తలపకుమా
  3. కడుపున గన్న సుతుని నిన్ గాన విడిచి (పద్యం)
  4. జయ కమలానాథ సకల భువన జీవనా దేవా
  5. తమ్మునికంటె నెంతమమతన్ నను జూచితివమ్మ (పద్యం)
  6. దయలేదా అనుజా నాపై భయదాటవికే పాలైనావో
  7. దేవ సకల దనుజ హారి దీన జనోద్దారీ నిత్యానంద
  8. ధన్యుడనైతిని మౌనీంద్రా నే ఆ దనుజహరినిన్
  9. ధృతి సోహమ్మతి నిర్వికల్పక సమాధినే (పద్యం)
  10. నారాయణ గోవిందా హరి నీ నామమే కీర్తింతున్ శ్రీహరి
  11. నీదుప్రేమాంకమున నిల్వనీడలేని ఈ అభాగ్యపు (పద్యం)
  12. పాలనసేయగదే దయానిధే కాలహరణ మిది ఏలా
  13. భక్తవత్సలు డా పరాత్పరుడు హరియె నన్ను బాలింప (పద్యం)
  14. మధుసూదన శ్యామహరే గౌరీ మము కావవె
  15. శరణం భవ కరుణామయ గురు దీనదయళో
  16. సచరాచరాములైనజగము లేకార్నవ ప్రళయ మైనను (పద్యం)
  17. స్మరింతున్ శ్రీరమానాథా సదా నీ దివ్యనామమునే
  18. హే వాసుదేవా నాపై ఇకనైనా దయరాదా దీనజనా

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సతీ అనసూయ @75 - ఆంధ్రప్రభ మే 4, 2011[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=ధృవవిజయం&oldid=3722900" నుండి వెలికితీశారు