ధృవ నక్షత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధృవ నక్షత్రం
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.నాగేశ్వరరావు
తారాగణం వెంకటేష్
సంగీతం పార్ధసారధి
నిర్మాణ సంస్థ శ్రీ ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ధ్రువ నక్షత్రం 1989 లో వచ్చిన తెలుగు సినిమా. వఒ. నాగేశ్వరరావు దర్శకత్వంలో, శ్రీ ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. అశోక్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో వెంకటేష్, రజనీ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.[2]

భారతి దేవి ( శారద ) ఒక వితంతువు, ఆమె ముగ్గురు పిల్లలు -ఇద్దరు కుమారులు ధ్రువ కుమార్, నరేంద్ర, ఒక కుమార్తె సరోజ లతో ఒక పట్టణంలో నివసిస్తుంది. వారు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఇంటి ఓనరు భారతి దేవితో చెడుగా ప్రవర్తిస్తూ, ఆమె డబ్బు మొత్తాన్ని దోచుకుంటూంటాడు. ధ్రువ కుమార్ ఓనరును కొట్టి ఇంటి నుండి పారిపోతాడు. 25 సంవత్సరాల తరువాత, ధ్రువ కుమార్ ( వెంకటేష్ ) బొంబాయిలో లారీ డ్రైవరుగా పనిచేస్తూ, ఆంధ్ర నుండి ఉద్యోగం కోసం బొంబాయికి వచ్చిన లలిత ( రజని ) తో ప్రేమలో పడతాడు.

లక్ష్మీపతి ( సత్యనారాయణ ), మట్టిగడ్డల మాణిక్యాలరావు ( నూతన్ ప్రసాద్ ) బొంబాయిలో పెద్ద గ్యాంగ్‌స్టర్లు, స్మగ్లర్లు. ఇద్దరూ ప్రత్యర్థులు. రోడ్డు పక్కన జరిగే పోరాటంలో, ధ్రువ కుమార్ మాణిక్యాలరావు అక్రమంగా రవాణా చేస్తున్న వస్తువులను పట్టుకుంటాడు. మాణిక్యాలరావు స్మగ్లింగ్ కేసులో ధ్రువ కుమార్‌ను ఇరికించి పోలీసులకు పట్టిస్తాడు, తనతో కలిసి పనిచేస్తే వదిలింపిస్తానని ఆఫర్ ఇస్తాడు. కాని ధ్రువ కుమార్ ఒప్పుకోడు. తన స్నేహితుడు శివాజీ (శివ కృష్ణ) సహాయంతో లలితతో సహా బొంబాయి నుండి పారిపోయి, హైదరాబాద్ చేరుకుంటాడు, అక్కడ అతన్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు సమర్పిస్తారు. అక్కడ తన తల్లి భారతి దేవిని చూసి ఆమెను గుర్తు పడతాడు. తనతో కలిసి పనిచేయడానికి ఒప్పుకోవడంతో లక్ష్మీపతి ధ్రువ కుమార్ ను విడిపించుకుంటాడు.

కస్టమ్స్ ఆఫీసర్ అయిన తన సోదరుడు నరేంద్ర ( భాను చందర్ ), సోదరి సరోజ ( రోహిణి ) ద్వారా ధ్రువ కుమార్ తన కుటుంబాన్ని కలవడానికి ప్రయత్నిస్తాడు. కాని భారతీ దేవి అతన్ని అంగీకరించదు. నరేంద్ర, మాణిక్యాలరావు తమ్ముడు మోహన్ రావు (బాలాజీ) సన్నిహితులు, మాణిక్యాలరావు తన తమ్ముడు (బాలాజీ) కి సరోజతో పెళ్ళి చెయ్యాలని ఒక ప్రణాళిక వేసుకుంటాడు. ధ్రువ కుమార్ అతడి పన్నాగాన్ని దెబ్బకొట్టి తన స్నేహితుడు శివాజీతో సరోజకు పెళ్ళి చేస్తాడు. ఇంతలో, నరేంద్ర లక్ష్మీపతిని అరెస్టు చేస్తాడు. నరేంద్రను చంపమని లక్ష్మీపతి ధ్రువ కుమార్‌ను ఆదేశిస్తాడు. కాని ధ్రువ కుమార్ అతన్ని రక్షించి లక్ష్మీపతికి కూడా ప్రత్యర్థి అవుతాడు. చివరగా, లక్ష్మీపతి, మాణిక్యాలరావులు కలిసి ధ్రువ కుమార్ కుటుంబం మొత్తాన్ని అపహరిస్తారు. చివరగా, ధ్రువ కుమార్ తన జీవితాన్ని త్యాగం చేసి, తన కుటుంబాన్ని రక్షిస్తాడు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
ఎస్. పాట పేరు గాయకులు సాహిత్యం పొడవు
1 "ఈ అర్ధరాత్రిలోనా పాపా" ఎస్పీ బాలు ఆచార్య ఆత్రేయ 3:56
2 "కసిగా కౌగిలిస్తా" ఎస్పీ బాలు, ఎస్.జానకి ఆచార్య ఆత్రేయ 3:42
3 "హౌలే హౌ" ఎస్పీ బాలు, ఎస్.జానకి వేటూరి సుందరరామమూర్తి 4:01
4 "రంభలకీ రంగులకీ" ఎస్పీ బాలు, ఎస్.జానకి వేటూరి సుందరరామమూర్తి 4:09
5 "పెళ్ళి పెళ్ళి" ఎస్పీ బాలు, ఎస్.జానకి వేటూరి సుందరరామమూర్తి 4:21

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-26. Retrieved 2020-08-30. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "Success and centers list – Venkatesh". Retrieved 30 October 2014.
  3. http://74.208.147.65/movies/Dhruva_Nakshthram/19288[permanent dead link]