నర్రా
స్వరూపం

నర్రా అను ఇంటి పేరు గల వారు ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొంగపాడు ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నారు. నల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాలలోనూ ఉన్నారు. అంతే కాకుండా గన్నవరం మండలంలో కూడా చాలామంది ఉన్నారు.
ఇంటి పేరు
[మార్చు]నర్రా ఇంటిపేరు గల కొందరు వ్యక్తులు:
- నర్రా రవికుమార్ : భారతదేశ వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. పద్మశ్రీ పురస్కార గ్రహీత.[1]
- నర్రా రాఘవ రెడ్డి : కమ్యూనిస్టు యోధుడు. ఆరు సార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధి.
- నర్రా విజయలక్ష్మి : రంగస్థల నటి. అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక నాటకాల్లో పాత్రధారణ గావించింది. దూరదర్శన్, ఆకాశవాణిలో ఆర్టిస్ట్ గా పనిచేసింది.[2]
- నర్రా వెంకటేశ్వర రావు : తెలుగు నటుడు.[3] ఎక్కువగా సహాయ, ప్రతినాయక, హాస్య పాత్రలలో నటించాడు. ముప్ఫై సంవత్సరాలకి పైగా నటనానుభవం కలిగిన ఆయన సుమారు 500 సినిమాలకు పైగా నటించాడు.
- నర్రా సిధారెడ్డి: నందిని సిధారెడ్డిగా పిలవబడుతున్న తెలంగాణకు చెందిన కవి. ప్రస్తుతం తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.[4]
- నర్రా బాల సిధారెడ్డి : సిధారెడ్డి తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు.
మూలాలు
[మార్చు]- ↑ "Padma Awards Announced". Circular. Press Information Bureau, Government of India. January 25, 2014. Archived from the original on 2019-05-17. Retrieved 2022-04-07.
- ↑ విజయలక్ష్మి నర్రా, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబర్ 2011, పుట. 100.
- ↑ "Telugu Movie Actor Narra Venkateswara Rao". nettv4u.com. Retrieved 13 September 2016.
- ↑ పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు