నల్లపాటి సురేంద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నల్లపాటి సురేంద్ర వర్థమాన తెలుగు రచయిత, వ్యంగ్య చిత్రకారుడు, ఆల్బమ్ మేకర్

జీవిత విశేషాలు[మార్చు]

నల్లపాటి సురేంద్ర విశాఖపట్నంలో జన్మించారు. అచ్యుతాపురం మండలం దుప్పిటూరు ఆయన స్వగ్రామం. ఈయన రాసిన కథలు ఈనాడు, వార్త, ఆంధ్రభూమి, నమస్తే తెలంగాణ, సాహిత్య ప్రస్థానం లాంటి పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బిఎస్సీ (కెమిస్ట్రీ), ఎం.ఏ (తెలుగు) చేసిన సురేంద్ర, గత కొద్ది సంవత్సరాలుగా వివిధ వార్తా పత్రికలలో ప్రచురితమవుతున్న విలువైన వ్యాసాలనెన్నింటినో సేకరిస్తున్నారు. ఈ వ్యాసాలతో ఒక్కో రంగానికి సంబంధించి, ఒక్కో ఆల్బమ్‌ను తయారుచేశారు. మన శాస్త్రవేత్తలు, ఈ పాటకు ట్యూన్ తెలుసా, జంతు ప్రపంచం, విహారి, ప్రపంచ దేశాలు, వేమన పద్యాలు, ఫార్ములా 1, దైవాలజీ, ఆణిముత్యాలు, స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర, డాక్యుమెంటరీల పరిచయం, అద్భుత కట్టడాలు, సాక్షి భవిత, ఆరోగ్య సూక్తులు తదితర అంశాల పై ఆల్బమ్‌లు తయారుచేసి సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. అలాగే దాదాపు 2500 పాటలు సేకరించారు. ఈ క్రమంలో తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు. అలాగే సురేంద్ర గీసిన కార్టూన్స్ హాస్యనందంతో పాటు పలు పత్రికలలో ప్రచురితమయ్యాయి. [1]

పురస్కారాలు[మార్చు]

  • గిడుగు రామమూర్తి స్మారక పురస్కారం [2]
  • హాస్యానందం వారి ఉత్తమ కార్టూనిస్టు పురస్కారం
  • సాహిత్య ప్రస్థానం వారి ఉత్తమ కథా పురస్కారం

రచనలు[మార్చు]

  • ఆమె గళమెత్తింది (సాహిత్య ప్రస్థానం) [3]
  • కాలనాగులు (ప్రజాశక్తి)[4]
  • ఆవు (నమస్తే తెలంగాణ)

మూలాలు[మార్చు]

  1. ":సాక్షి పత్రికలో నల్లపాటి సురేంద్ర సమగ్ర సమాచారం". archive.org. Retrieved 10 May 2021.
  2. ":ప్రతిలిపిలో నల్లపాటి సురేంద్ర వివరాలు". pratilipi.com. Retrieved 10 May 2021.
  3. "సాహిత్య ప్రస్థానం పత్రికలో నల్లపాటి సురేంద్ర కథ" (PDF). prasthanam.com. Retrieved 10 May 2021.
  4. ":ప్రజాశక్తి పత్రికలో సురేంద్ర కాలనాగులు రచన". archive.org. Retrieved 10 May 2021.