నవీన్ దేశబోయిన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవీన్ దేశబోయిన
జననం23 జూన్ 1988
జాతీయత భారతదేశం
వృత్తిసినిమా దర్శకుడు
స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు2015 - ప్రస్తుతం

నవీన్‌ దేశబోయిన తెలంగాణకు చెందిన సినిమా దర్శకుడు. ఆయన తొలిసారి 2020లో మరాఠీలో లతా భగవాన్‌ కరే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు గాను 67వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ‘స్పెషల్‌ మెన్షన్‌ అవార్డ్‌’ దక్కింది.[1][2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

దేశబోయిన నవీన్ 1988

, జూన్ 23న తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, మానకొండూరు లో జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు మానకొండూరులో పూర్తి చేసి, కరీంనగర్ లోని సైన్స్ వింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అనంతరం జనంసాక్షి పత్రికలో జర్నలిస్టుగా పని చేశాడు.[3]

సినీ ప్రస్థానం[మార్చు]

కరీంనగర్‌లోని కరీంనగర్‌ ఫిల్మ్‌ సొసైటీ (కఫిసో) అతడికి సినిమాపై ఆసక్తిని పెంచింది. ఆయన ఇంటర్‌ పరీక్షలు పూర్తికాగానే ఇంట్లో చెప్పకుండా హైదరాబాదు వచ్చేశాడు. హైదరాబాదులో ఘోస్ట్‌ రైటర్‌గా పని చేసే తన మిత్రుడు వద్ద స్క్రిప్ట్‌ ఎలా రాయాలో నేర్చుకున్నాడు. ఆయన కొంతకాలం . సినీ దర్శకుడు అల్లాణి శ్రీధర్ ఆఫీసులో పని చేస్తూ అక్కడ సీరియల్‌ షూటింగ్‌లు, డబ్బింగ్‌, ఎడిటింగ్‌ పనులను చూస్తూ సినిమా మేకింగ్‌ పట్ల అవగాహన పెంచుకున్నాడు. నవీన్‌, లెజెండరీ దర్శకుడైన సత్యజిత్!రే స్పూర్తి థో ఇన్స్టిట్యూట్ లో చేరి దర్శకత్వం కోర్స్ పూర్తి చేశాడు. ఆయన తొలిసారి 2020లో మరాఠీలో లతా భగవాన్‌ కరే సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూలాలు[మార్చు]

  1. Eenadu (17 May 2021). "మరాఠీ తెరపై.. తెలుగు జయకేతనం". www.eenadu.net. Archived from the original on 17 మే 2021. Retrieved 17 May 2021.
  2. Sakshi, హోం » ఫ్యామిలీ (26 March 2021). "తెలుగు వాళ్లూ కలిసి పరిగెత్తారు". Sakshi. Archived from the original on 17 మే 2021. Retrieved 17 May 2021.
  3. Mafab (17 May 2021). "Naveen Deshaboina | Személyiség adatlap | Mafab.hu". www.mafab.hu. Archived from the original on 17 మే 2021. Retrieved 17 May 2021.