Jump to content

నవీన్ మేడారం

వికీపీడియా నుండి
నవీన్ మేడారం
జననం(1985-08-07)1985 ఆగస్టు 7
వృత్తితెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం

నవీన్ మేడారం,[1] భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత. పైరేట్ ఆఫ్ కరేబియన్, ప్రిన్స్ ఆఫ్ పర్షియా: ది సాండ్స్ ఆఫ్ టైమ్, హ్యారీ పాటర్, ద డార్క్ నైట్ వంటి వివిధ హాలీవుడ్‌ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు.

జీవిత విషయాలు

[మార్చు]

నవీన్ 1985, ఆగస్టు 7న నిజామాబాదు జిల్లాలో జన్మించాడు. హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేవాడు. ఆ తరువాత యునైటెడ్ కింగ్‌డమ్ లోని బౌర్న్‌మౌత్ విశ్వవిద్యాలయం నుండి విజువల్ ఎఫెక్ట్స్ లో మాస్టర్ డిగ్రీ చదివాడు.

సినిమారంగం

[మార్చు]

లండన్‌లోని రెయిన్‌డాన్స్ ఫిల్మ్ స్కూల్ నుండి ఫిల్మ్ మేకింగ్‌లో డిప్లొమా పొందాడు. రెయిన్‌డాన్స్ ఫిల్మ్ స్కూల్‌లో ఉన్నప్పుడు స్క్రీన్ ప్లే రాయడం నేర్చుకొని లఘు చిత్రాలకు, సినిమాలకు పనిచేశాడు. ఫిల్మ్ స్కూల్‌లోని ఐదుగురు దర్శకుల బృందంతో కలిసి “మూవింగ్ ఆన్” అనే ఒక షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించాడు. తరువాత "ఫిలోఫోబియా" అనే లఘు చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించాడు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని డబుల్ నెగటివ్ స్టూడియోస్, ది మూవింగ్ పిక్చర్ కంపెనీ, పైన్‌వుడ్ స్టూడియోలలో విజువల్ ఎఫెక్ట్స్ కంపోజిటర్‌గా పనిచేశాడు. ఎఫెక్ట్స్ ఆర్టిస్టుగా ది డా విన్సీ కోడ్, ఎక్స్-మెన్: ది లాస్ట్ స్టాండ్ ది లాస్ట్ స్టాండ్, సిక్స్టి సిక్స్, సన్ షైన్ మొదలైన సినిమాలకు పనిచేశాడు.

లండన్ లైఫ్, నైస్ టూ మీట్ యు వంటి బ్రిటిష్ చిత్రాలకు దర్శకత్వం వహించిన నవీన్, బాబు బాగా బిజి[2][3] (హిందీ చిత్రం హంటర్ర్ రిమేక్)[4] సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.[5][6] నార్త్‌స్టార్ ప్రొడక్షన్ బ్యానరలో శరత్ మరార్ నిర్మాతగా "సిన్" అనే వెబ్ సిరీస్ ను రూపొందించి, అల్లు అరవింద్కు చెందిన ఆహా (ఓటిటి) ద్వారా విడుదల చేశాడు.[7][8]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక దర్శకుడు నిర్మాత రచయిత ఇతరులు గమనికలు
2015 నైస్ టూ మీట్ యు Yes Yes Yes [9]
2016 లండన్ లైఫ్ Yes కాదు Yes విఎఫెక్స్ ఆర్టిస్టుగా
2017 బాబు బాగా బిజి Yes కాదు స్క్రీన్ ప్లే [10][11]
2020 సిన్ Yes కాదు Yes వెబ్ సిరీస్[12]
2023 డెవిల్ Yes కాదు కాదు [13] 80 శాతం సినిమా షూటింగ్ కు

దర్శకత్వం వహించాడు[14]

విఎఫెక్స్ ఆర్టిస్టుగా

[మార్చు]
  • లెస్ మిజరబుల్స్
  • ఆల్ థింగ్స్ టూ ఆల్ మెన్
  • డార్క్ షాడోస్
  • ప్లానెట్ డైనోసార్
  • పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్
  • ది వెటరన్
  • ది డెబ్యూట్
  • స్కాట్ పిల్గ్రిమ్ వర్సెస్ ది వరల్డ్
  • ప్రిన్స్ ఆఫ్ పర్షియా: ది సాండ్స్ ఆఫ్ టైమ్
  • గ్రీన్ జోన్
  • 2012
  • హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్-బ్లడ్ ప్రిన్స్
  • ది బోట్ దట్ రాక్
  • కెప్టెన్ స్కార్లెట్
  • ఇంక్ హార్ట్
  • ది డార్క్ నైట్
  • 10,000 బిసి
  • క్లోవర్ఫీల్డ్
  • హ్యారీ పాటర్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫీనిక్స్
  • రైడ్ బై[15]
  • సన్ షైన్
  • సిక్స్టి సిక్స్
  • ఎక్స్-మెన్: ది లాస్ట్ స్టాండ్
  • ది డా విన్సీ కోడ్
  • పోసిడాన్

మూలాలు

[మార్చు]
  1. Ravi, Murali (2018-08-29). "Young Hero Completes Hat trick, hopes on Abhishek Nama". Tollywood. Archived from the original on 2020-04-07. Retrieved 7 April 2021.
  2. Chowdhary, Y. Sunita (2017-03-24). "Switching sides". The Hindu. ISSN 0971-751X. Retrieved 7 April 2021.
  3. "Hunterrr Telugu remake re-titled as Babu Baga Busy". The Indian Express. 2016-12-15. Retrieved 7 April 2021.
  4. "Srinivas Avasarala's Babu Chala Busy Movie Teaser Is Out And Too Hot !!". All India Roundup. 2017-03-15. Retrieved 7 April 2021.
  5. KhadeerBasha (2016-11-30). "Srinivas Avasarala's Soggadu hot pre-look poster creates hype". Chitramala. Retrieved 7 April 2021.
  6. "'Babu Baga Busy' starring Srinivas Avasarala clears censor with an 'A' - Times of India". The Times of India. Retrieved 7 April 2021.
  7. DelhiMarch 27, India Today Features New; March 29, 2020UPDATED; Ist, 2020 13:26. "Your Weekend Planner March 27: How to get through a lockdown?". India Today. Retrieved 7 April 2021. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  8. "aha clocks 2.8 million unique visitors, 1+ million app downloads - Exchange4media". Indian Advertising Media & Marketing News – exchange4media. Retrieved 7 April 2021.
  9. "Abhijeeth Poondla's film 'Nice 2 Meet U' goes to Cannes - Times of India". The Times of India. Retrieved 7 April 2021.
  10. "Like roles that stimulate me, says Srinivas Avasarala". The New Indian Express. Retrieved 7 April 2021.
  11. Pattikonda, Gautham. "Naveen Medaram: Babu Baga Busy has bold scenes but they are not used for cheap publicity". Pinkvilla. Retrieved 7 April 2021.
  12. AuthorAgencies. "A space where food and work go together". Telangana Today. Retrieved 7 April 2021.
  13. V6 Velugu (6 July 2021). "డేర్‌‌‌‌‌‌‌‌ డెవిల్ గా వస్తున్న కళ్యాణ్‌‌‌‌ రామ్" (in ఇంగ్లీష్). Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  14. Andhrajyothy (27 December 2023). "'డెవిల్' సినిమాపై ఎటువంటి చట్టపరమైన చర్యలకి వెళ్లడం లేదు". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  15. Chowdhary, Y. Sunita (2019-01-22). "Naveen Medaram on 'Ride By'". The Hindu. ISSN 0971-751X. Retrieved 7 April 2021.

బయటి లింకులు

[మార్చు]